Thursday, January 31, 2019

ప్రశ్న: హిందూ మతాచారాల ప్రకారం పాములు పాలు తాగుతాయి. పాములు నిజంగానే పాలు తాగుతాయా?

ప్రశ్న: - హిందూ మతాచారాల ప్రకారం పాములు పాలు తాగుతాయి. పాములు నిజంగానే పాలు తాగుతాయా?

                   జవాబు : - మతాచారాలు, నాగులచవితి పండుగ సమయాల్లోనే కాదు, 'పాముకు పాలుపోసి పెంచినట్లు' అన్న సామెత కూడా ప్రచారంలో వుంది. పాములు పాలు తాగవు. ఇది శాస్త్ర పరిజ్ఞానం. పాలను తాగే యంత్రాంగం పాముల నోళ్లకు లేదు. పాములు, పదేపదే చీలిక ఉన్న నాలుకలాంటి అవయవాన్ని బయటకు చాచి లోపలికి ముడుచుకోవడాన్ని గమనిస్తాము. నిజానికి అది నాలుక కాదు. అది ఒక రకంగా పాము ముక్కు అనగలం. వాసన చూసే ఇంద్రియావయవం ఎక్కడ వున్నా దాన్ని నాసికము లేదా ముక్కు అని అనవలసిందేనని తీర్మానిస్తే పాము నోట నాలుకలాగా బయటి కి లోపలికి వచ్చేదే నాసికం. ఎందుకంటే ఆ అవయవంతోనే పాములు పరిసరాల్లో వున్న రసాయనిక ధాతువుల్ని పసిగడతాయి. పాముకు మామూలుగానే కప్పలకు ఉన్నట్టే పెదాలపైన ముక్కు రంధ్రాలున్నా అవి ముక్కు చేయవలసిన పనుల్ని సమర్థవంతంగా చేయవు. అంతేకాదు. పాము తలకు అటుయిటూ చెవుల్లాగా కూడా కొంత లోతట్టు ప్రాంతాలుంటాయి. కానీ అవి చెవులు కావు. మతాచారాల్లోను, వాడకంలోను బాగా శ్రద్ధగా, సునిశితంగా వినేవాడిని 'వీడివి పాము చెవుల్రా' అంటూ కితాబులిస్తుంటారు. నిజానికి పాము చెవులకు వినికిడి సామర్థ్యం లేదు. కాబట్టి వినికిడి శక్తిలేని బధిరుడిని 'వీడికి పాము చెవుల్రా' అనాలి. ఎందుకంటే బధిరులకు అందరికిలాగే చెవులున్నా అవి వినలేని చెవులు. పాములకు కూడా చెవులున్నట్లే అనిపించినా అవి వినలేని వధ్య (Vastegial) చెవులు. ఏ పామూ నాగస్వరం చేసే శబ్దాలను వినలేదు.
పురాణాల్లోనే క్లోనింగ్‌ ఉందంటూ, రాకెట్లు ఉన్నాయంటూ, అవయవమార్పిడి ఉందంటూ చంకలు చర్చుకునే మతవాదులు, అవే మత గ్రంథాల్లో సాధారణ విజ్ఞాన శాస్త్రాల పరిధిలో ఉండే 'పాము-పాలు త్రాగదు', 'పాములు వినలేవు', 'మనిషిని నిట్టనిలువుగా చీల్చి అటూయిటూ పడేస్తే తిరిగి అతుక్కోవు' (జరాసంధుడు), 'అగ్నిలో దూకిన మనిషికి చర్మం కాలక మానదు' (సీత అగ్నిప్రవేశం), 'ఒకే వ్యక్తి ఏకకాలంలో ఎనిమిది మంది దగ్గర ఉండలేడు' (శ్రీకృష్ణుడి అష్టభార్యల శృంగార లీలలు), 'మనుషుల ప్రాణాలు చిలుకల్లో వుండవు' (మాయల ఫకీరు) మొదలయిన వెన్నింటినో అశాస్త్రీయంగా ఎందుకు కొట్టిపారెయ్యరు? శాస్త్రానికి దగ్గరగా వున్న వాటిని పట్టుకొని 'ఈ విజ్ఞానం మనకు ముందే తెలుసు, మన వేదాల్లో, ఉపనిషత్తుల్లో అన్నీ వున్నాయి' అన్న వాళ్లు నిజంగానే శాస్త్రాన్ని వైజ్ఞానిక ప్రతిపత్తిని గౌరవించిన వాళ్లయితే పైన పేర్కొన్న అశాస్త్రీయ అంశాలతోపాటు పునర్జన్మ, గతజన్మ, జ్యోతిష్యశాస్త్రం, బాబాలు, ఉంగరాలు తీయడం, పాములు పాలు తాగడం వంటివి అశాస్త్రీయాలని కూడా ప్రకటించాలి. కానీ 'మెలితిరిగి వున్నా నాదే' అన్నట్టు అబద్ధాలూ వారికి నిజమే. నిజాలు కూడా ఎపుడో తెలిసిన నిజాలే! అంటే పచ్చి అవకాశవాదమన్నమాట. నాగుల చవితి నాడు అమ్మలక్కలు అందరూ పుట్టల దగ్గరకెళ్లి పుట్టల్లో ఉన్న పాములు (అదేదో విధిగా నాగుపాములే ఉండాలన్నట్లు) పాలు తాగుతాయన్న అశాస్త్రీయ భావాలతో పాలు పోస్తారు. అక్కడ నిజంగా పాములు ఉన్నట్లయితే (అవి నాగుబాములయినా మరే పాములయినా) చచ్చి ఊరుకుంటాయి. ఒక పరిశోధన ప్రకారం నాగుల చవితి అనంతరం పొలాలు, మైదాన ప్రాంతాలు, పుట్టల పరిసరాల్లో ఎక్కువ పాముల శవాలు కనిపించాయి. ఇలా అదనపు పాముల ప్రాణహానికి, వినాశనానికి కారణం నాగులచవితి నాడు పుట్టల్లో పాలు పోయడం వల్లనే అవి ఊపిరి ఆడక చనిపోయాయని తేలింది. దేశంలో వున్న శతకోటి మూఢ నమ్మకాల్లో పాములు పాలు తాగుతాయనుకోవడం కూడా ఒకటి. 

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య
    సంపాదకులు, 
చెకుముకి, జనవిజ్ఞాన వేదిక.
email: allikayala@gmail.com                                    సేకరణ : రంగ ప్రశాంత్,  సామాజిక కార్యకర్త..

Wednesday, January 30, 2019

27 వ జాతీయ నాస్తిక మేళా కరపత్రం ఆవిష్కరణ.

27 వ జాతీయ నాస్తిక మేళా కరపత్రం ఆవిష్కరణ.

" గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని చార్వాక ఆశ్రమం లో ఫిబ్రవరి 9,10 తేదీల్లో జరిగే 27వ జాతీయ నాస్తిక మేళా ను విజయవంతం చేయాలని " కడప జిల్లా హేతువాద సంఘం నాయకులు పిలుపునిచ్చారు . ఈ సందర్భంగా వారు జిల్లా కేంద్రమైన కడపలో డాక్టర్ అశోక్ కుమార్ వైద్య శాల యందు జాతీయ నాస్తిక మేళా కరపత్రాన్ని ఆవిష్కరించారు . తరతరాల మానవ అనవసరమైన శాస్త్రీయ వైజ్ఞానిక దృక్పథమే నాస్తికత్వమన్నారు. శ్రమ దోపిడీ పై ఆధారపడిన ఆధిపత్య మనువాద సంస్కృతికి ప్రత్యామ్నాయం గా నాస్తిక మేళా నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు భారత సమాజం రోజురోజుకి సాంస్కృతికంగా మూఢ విశ్వాసాలమయంగా  తయారుకావడం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. శబరిమల ఆలయంలో అయ్యప్ప భక్తి ని వ్యాపార స్థాయికి పెరిగిన పరిశ్రమగా మార్చిన పిదప ఆలయ ప్రవేశం లోని కొన్ని ఆంక్షలను సుప్రీంకోర్టు రద్దు పరిచిందని అలాంటి ఆంక్షలే మహారాష్ట్రలోని శనీశ్వరాలయం లో ఉంటే బొంబాయి హైకోర్టు వాటిని రద్దు పరిచినప్పుడు భారతీయ జనతా పార్టీ స్వాగత్ ఇచ్చినట్లు శబరిమల లో కూడా చేయొచ్చు కదా అని ప్రశ్నించారు . కర్ణాటక మహారాష్ట్ర ప్రభుత్వాలు మూఢవిశ్వాసాల నిరోధక చట్టాలు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వం కూడా ఆమోదించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాస్తిక సమాజం నాయకులు నాగార్జున్ , గంగా సురేష్, పల్లవోలు రమణ, కొమ్మద్ది ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

విశ్వవిద్యాలయ_పై_కేంద్ర_ప్రభుత్వం_కుట్రను_తిప్పికొట్టండి

https://youtu.be/VATQ5-vqudA
విశ్వవిద్యాలయ_పై_కేంద్ర_ప్రభుత్వం_కుట్రను_తిప్పికొట్టండి..- నరేష్_గ్యార_ఓయూ

దేశంలో ఉన్న వివిధ విశ్వవిద్యాలయాలో దాదాపు 90 శాతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఉంటే... భవిష్యత్తులో వీళ్లంతా ఆయా యూనివర్సిటీలో అధ్యాపకులుగా కొనసాగుతారనే కుట్రతో బిజెపి ప్రభుత్వం అధ్యాపకుల భర్తీ విధానంలో కొత్త విధానం తెరపైకి తీసుకొస్తుంది...!!

ప్రస్తుతం 200 పాయింట్ రోస్టర్ విధానం కొనసాగుతుంది దీనివల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నత చదువులు చదివిన ఎస్సీ ఎస్టీ ఓబీసీ విద్యార్థులకు సామాజికంగా ఎంతో కొంత న్యాయం జరుగుతుంది.. ప్రభుత్వం కనుక యూనివర్సిటీల వారీగా అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తే 50 శాతం రిజర్వేషన్ అమలు కాబడి విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులుగా అవకాశాలు పొందవచ్చు...!!

కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్నా 13 పాయింట్ రోస్టర్ విధానం వల్ల కేవలం 10 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చి 90 శాతం ఓపెన్ కేటగిరీలో పెట్టడం వల్ల కొన్ని సంవత్సరాల నుండి ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్న ఎస్సీ ఎస్టీ ఓబీసీ విద్యార్థులు నష్టపోవడమే కాకుండా జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వారికి దక్కదు...!!

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయాన్ని ప్రధాన టార్గెట్గా చేసుకొని పరిశోధన విద్యార్థులకు ఫెలోషిప్స్ ఇవ్వకుండా RGNF లాంటి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం లేదు...!!

ఇప్పుడిప్పుడే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఎస్సీ ఎస్టీ ఓబీసీ విద్యార్థుల అభివృద్ధిని అడ్డుకోవడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకుంది బిజెపి ప్రభుత్వం...!!

👉కేంద్ర ప్రభుత్వం 13 పాయింట్ రోస్టర్ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి

👉 200 పాయింట్ రోస్టర్ విధానాన్ని కొనసాగించాలి

👉 డిపార్ట్మెంట్ ని యూనిట్ గా తీసుకోకుండా యూనివర్సిటీ ని యూనిట్ తీసుకొని నియామకాలు     చేపట్టాలి

లేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వం యొక్క కుట్రలను తిప్పి కొడుతూ దేశవ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతామని ఏఐఎస్ఎఫ్ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది...!!

ఏఐఎస్ఎఫ్ ఉస్మానియా యూనివర్సిటీ & హైదరాబాద్ కమిటీల ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందు నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది..!!

                            - నరేష్_గ్యార_ఓయూ   #No_to_the_attacks_on_reservations

AISF Osmania University council and Hyderabad council protest on today against "13 Point Roster System"

Let's demand for the continuation of "200 Point Roster System" This is an attack on the rights of SC/ST/OBC and socially discriminated classes...

          At Osmania University...

గ్రామ పంచాయతీల కొత్త పాలక మండళ్ల ఫిబ్రవరి 2వ తేదిన అపాయింట్ డే గా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

గ్రామ పంచాయతీల కొత్త పాలక మండళ్ల ఫిబ్రవరి 2వ తేదిన అపాయింట్ డే గా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
గ్రామ పంచాయతీల కొత్త పాలక మండళ్ల అపాయింట్ డే ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం....
ఫిబ్రవరి రెండు అపాయింట్ డేగా ఖరారు..ఎన్నికలు జరిగిన పంచాయతీలు ఆరోజు మొదటి సమావేశం కావాలని స్పష్టం చేసిన ప్రభుత్వం..... 
నోటిఫికేషన్ జారీ చేసిన పంచాయతీ రాజ్ శాఖ.

Tuesday, January 29, 2019

*విద్యార్థుల సమస్యల పరిష్కారమే NSUI కర్తవ్యం*

విద్యార్థుల సమస్యల పరిష్కారమే NSUI కర్తవ్యం - బల్మూరి వెంకట్ 

మంచిర్యాల జిల్లా పట్టణంలో ఉన్నMIMS డిగ్రీ కళాశాలలోNSUI జిల్లా అధ్యక్షులు *ఆదర్శ వర్ధన్ రాజు* అధ్యక్షతన నిర్వహించిన BEHTAR BARAT నమోదు కార్యక్రమా నికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ గారు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి రాహుల్ గాంధీ గారు విన్నూత్న ఆలోచన సాకారమే ఈ BEHTAR BHARAT నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు, కావున విద్యార్థులంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నమోదు చేసుకొని వారి సమస్యలను తమకు తెలియజేయాలని కోరారు
          ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కొక్కిరాల సురేఖ సాగర్ రావు గారు మాట్లాడుతూ విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని ఏర్పరచుకున్న వారే అన్ని రంగాలలో రాణిస్తారని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం పరచుకొని తమ సమస్యలను తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ నరేష్, స్టేట్ కో ఆర్డినేటర్ తిరుమల రావు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ వినేష్, అన్వర్, అజయ్ గౌడ్, సాయి కుమార్, మనోజ్ వర్మ, మనీ, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు..

హిందు_మతొన్మాద_వ్యతిరేక_దినం

    
   - రచయిత :నరేష్_గ్యార_ఓయూ    
హిందు_మతొన్మాద_వ్యతిరేక_దినం

ప్రజాస్వామ్యంలొ ప్రజల ఆమెదం పొందడానికి,ప్రజా అవసరాలను గుర్తించడానికి ప్రజా జీవన విదానంలొ మార్పులు తేవడానికి చర్చలు సంప్రదింపులు సైద్దాంతికరణలొ మూలం వాటి ద్వార మాత్రమే సామాజిక, ఆర్ధిక ,రాజకియ, న్యాయం సాద్యమవుతుంది కాని భరత దేశంలొ హిందు మతొన్మాద శక్తులు దినికి వ్యతిరేకంగా...!!

హింసా బెదిరించడం ప్రజాస్వామ్యా వాదుల్ని హత్య చెయడం చేస్తు ...చర్చ అనే అంశమే తెర పైకి రాకుండా ప్రజాస్వామ్యన్ని బ్రతకనివ్వకుండా హిందు మతొన్మాదమే ఈ దేశంలొ ఉండాలనే నిరంకుశవాదన్ని అరచకత్వన్ని వేల సంవత్సరాల నుండి అవలంబిస్తు వస్తున్నారు...!!

ఎంతటి ప్రతికూల సామజిక పరిస్థితుల్లోనూ ఎన్ని ప్రతిబంధకాలు ఎదురైనా వాస్తవాలను గుర్తించి కఠొర సత్యాలను వెతికి శోధించి కుండబద్దలు కొట్టినట్లు ఉన్నది ఉన్నట్లు ప్రాణాలను సైతం తెగించి , రాజీపడక తమ భావ ప్రకటన స్వేచ్ఛను వినియోగించిన మహానుభావులు కోకోల్లలున్నారు...!!

తత్వాలను, తత్వాలతో , భావాలను,భావాలతో, ఓడించలేని పలాయన తిరోగమ నివాదులు. తమ ప్రత్యర్థుల విరుద్ధ భావజాలాలకు చెందిన వ్యక్తులను , సమూహాలను ,నేరుగా ఓడించలేక కుట్రలతో , కుహకాలతో , చాణక్యనీతితో , మనుధర్మ పరిరక్షణలతో , ఈ దేశంలో వెలది ‘భవిష్యత్ వేగుచుక్కలు , హత్యలుచేసి ,చిత్రహింసలు చేసి , ఉచకోతలు , నరసంహారాలు జరిపిన ఘటనలు చరిత్ర పూతల నిండా నమోదైనవి....!!

మానవులందరూ ఒక్కటే ఈశ్వరుడొక్కడే , సత్యమొక్కటే అంతిమ సత్యం మిగిలిన ధర్మాలు , దేవతలు ,పురాణాలన్నీ అసత్యమేనని చెప్పడం సహితం ఓర్చుకోలేని హిందుత్వ శక్తులు , చివరకి మూఢనమ్మకాలు నిర్ములించాలని చెప్పడం కూడా నేరంగా పరిగణించి , బెదిరింపులకు , దాడులకు ,హత్యలకు ,నరమేధాలకు ఎన్నాళ్ళనుంచో పూనుకుంటూనే ఉన్నారు...అందులో కొత్తేమి లేదు అందులో భాగంగానే #గాంధీని ఆపైన డాబోల్కర్, పన్సారి,ని కాల్బుర్గిని, గౌరీ లంకేశ్, లను దారుణంగా హత్యచేసి ...ప్రజాస్వామ్యాన్ని కూల్చేస్తున్నారు ....!!

స్వేచ్ఛ సమానత్వం పై మాట్లాడినందుకు , హిందుత్వ మతోన్మాదాన్ని వ్యతిరేకించి ముడానమ్మకాలను, అబద్దాలను,తృణిగించి,హేతుబద్దతను, శాస్త్రీయతను, సామజిక,సమానత్వాన్ని, వ్యక్తపరిచందుకు డాబోల్కర్,కాల్బుర్గిని, అత్యంత దారుణంగా ఒకే పద్దతిలో హత్యచేశారు...అదే క్రమంలో ఇటీవల జర్నలిస్ట్ #గౌరీ_లంకేశ్ ను కూడా హత్య చేసి ప్రజాస్వామ్య గొంతులకు ప్రమాదకర హెచ్చరికలు జారీచేశారు ..!!

అదే క్రమంలో గోరక్షదళాల పేరుతొ సామాన్యులపై పాశవికంగా దాడులు చేస్తూ హత్యలు చేస్తూ.. ఘర్ వాపాసి పేరుతొ భారతీయత దేశభక్తి పేరుతొ..హిందూమతోన్మాదాని వ్యతిరేకించిన వారందరిని వరుసపెట్టి మరి హత్యలు చేస్తూ...అడిగితె చంపేస్తాం అనే ఓ బయేత్పతాన్ని స్పష్టించారు ..!!

ఇలాంటి బయేత్పత హత్యారాజకీయాల వాతావరణంలో ఈ దేశం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ...ప్రజాసంఘాలు మేధావులు రచయితలూ రాజకీయ నాయకులూ , విద్యార్థి సంఘాలు అందరు ఐక్యంగా పోరాడాలి అల పొరడాని క్రమంలో...భవిషత్ తారలు మాట్లాడే స్వేచ్ఛను కోల్పోయి అరాచకం హింస హత్యల రాజ్యమేలే పరిస్థితి దారితీస్తుంది ..కాబట్టి #జనవరి_30 ని హిందూ మతోన్మాద వ్యతిరేక దినంగా పాటించి ..ప్రజాస్వామ్యాన్ని రక్షించే గొంతులను ఏకం చేసి పోరాడుదాం ...!!

                         - నరేష్_గ్యార_ఓయూ

ఎద్దు మాంసం

రచయిత : గోడిసెల శ్రీహరి, ( డా,, బి.ఆర్.అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహిత )
ఎద్దు మాంసం
----------------------
రామాయణాన్ని చదువు 
యజ్ఞం. యాగాలు చేస్తూ 
పశువుల చంపి మాంసం 
తిన్నది బ్రాహ్మణులు కాదా !
వసిష్ఠుడు గో మాంసం 
వండి విందు భోజనానికి 
రాముణ్ణి అవ్వణించలేదా. 

నీతి మాటలు చెప్పుతుండ్లు నేటి 
వారి వారసులు 
తాము శాకాహారులమని 
శాకాహారమిచ్చు చెట్లు కూడా జీవులేనన్నది 
వారికీ తెలియదా !

చరిత్ర తెలియనోళ్లు 
గోమాంసం తిన్నారని 
ముస్లిం. దళితులపై 
దాడులు చేస్తూ 
మారణకాండ చేస్తూండ్లు 

ఆకలి తీర్చుకోవడానికి 
చచ్చిపోయిన ఎద్దు 
మాంసంతిని వాటి 
తోళ్లతో చెప్పులు చేసి 
సమాజానికిచ్చింది మాదిగన్నాకదా !

చచ్చిపోయిన పశువుల 
చర్మాలను ఒలిచి 
డప్పుగా చేసి సంగీతాన్ని 
సృష్టించింది మాదిగన్నాకదా !

జ్ఞానం ఈ దేశపు మూలవాసులదైతే 
కుతంత్రాలతో జ్ఞానాన్ని 
సొంతం చేసుకున్నది బ్రాహ్మణులుకదా !

ఎద్దు మాంసం తిన్న 
దేశాలు శాస్త్ర సాంకేతిక 
రంగాలలో ముందుంటే 
ముప్ఫైయారు కోట్ల 
దేవులున్న మనదేశం 
ఎందుకని వెనుకబడి వుందో చెప్పగలరా 
హిందూ మతవాదులు.

Monday, January 28, 2019

ఈరోజు గౌరీ లంకేష్‌ జయంతి

గౌరీ లంకేష్‌ (29 జనవరి 1962 – 5 సెప్టెంబరు 2017) భారతీయ జర్నలిస్టు, ఉద్యమకారిణి.
 *************************************


జీవిత విశేషాలు
---------------------
ఆమె బెంగళూరుకు చెందిన లంకేశ్, ఇందిరల మొదటి కుమార్తె. తండ్రి లంకేష్‌ తనపేరుతోనే ‘లంకేశ్‌’ అనే పత్రికను నడిపారు. చిన్నప్పటినుంచే జర్నలిజంపై ఆసక్తి కనబరిచారు. పలు ఇంగ్లీష్, కన్నడ పత్రికల్లో పనిచేస్తూ ప్రజా సమస్యలపై కథనాలను అందించారు. గౌరీ లంకేశ్ కన్నడ నాట ప్రముఖ పాత్రికేయురాలు. మితవాదులు, హిందూత్వవాదులపై లౌకిక కోణంలో విమర్శలు చేసే పాత్రికేయురాలిగా ఆమె ప్రసిద్ధి గాంచారు. నక్సలైట్ల సానుభూతి పరురాలిగా కూడా పేరుంది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేశారు. అనంతరం తన తండ్రి స్థాపించిన ‘‘లంకేశ్ పత్రికే’’ వార్తాపత్రికను సోదరుడు ఇంద్రజిత్‌తో కలిసి కొన్నేళ్లు నడిపారు. ఆ తర్వాత తన సొంత వార్తా పత్రిక ‘‘గౌరీ లంకేశ్ పత్రికే’’తో పాటు పలు ప్రచురణలను ప్రారంభించారు.

ధైర్యశాలిగా, ముక్కుసూటిగా మాట్లాడే పాత్రికేయురాలిగా ఆమె ప్రసిద్ధి గాంచారు. ప్రముఖ సినీ దర్శకురాలు, అవార్డు గ్రహీత కవితా లంకేశ్ ఆమె సోదరి. తండ్రి పి. లంకేశ్ ప్రముఖ వామపక్ష కవి, రచయిత. బెంగళూరు, రాజరాజేశ్వరి నగర్‌లో గౌరీ నివసిస్తున్నారు. 2017 సెప్టెంబరు 4 సాయంత్రం గుర్తు తెలియని దుండగులు ఆమెను ఇంటివద్ద కాల్చి చంపారు.

ప్రజా ఉద్యమం
--------------------
గౌరి లంకేశ్‌ మూఢాచారాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని సాగించారు. సమాజంలోని అసమానతలు, దురాచారాల నిర్మూలనకు నడుం కట్టిన పౌరులకు, వారు సాగించిన ఆందోళనలకూ లంకేశ్‌ పత్రికతో ప్రచారం ఇచ్చారు. గత దశాబ్దమున్నర కాలగమనంలో కన్నడ నాట జరిగిన అనేక ప్రజా ఉద్యమాలతో మమేకమయ్యారు. లింగాయత వీరశైవ వివాదంలో లింగాయత వాదానికి దన్నుగా నిలిచారు. ఎంగిలాకులపై పొర్లు దండాలు పెట్టించే దుష్ట ఆచారానికి వ్యతిరేకంగా సాగిన పోరాటానికి మద్దతిచ్చారు. బాబాబుడాన్‌ గిరి
దత్త పీఠం వివాదంలో సంఘపరివార్‌ శక్తుల దూకుడును అడ్డుగడుగునా అడ్డుకునేందుకు, మత సామరస్య సాధనకు శక్తి వంచన లేకుండా కృషి చేశారు. సమ సమాజ స్థాపనకు కాగడాలైన వారి వెలుగుబాటలోనే అడుగులేస్తున్నానని తన విధానాల్ని గట్టిగా సమర్థించుకున్నారు. ప్రజాందోళనల్లో పాల్గొనే యువ కార్యకర్తల్ని కన్న బిడ్డలుగా భావించారు. దళిత యువజన కార్యకర్త జిగ్నేశ మేవాని, అఖిల భారత విద్యార్థి సమాఖ్య నాయకుడు కన్నయ్యలాల్‌ను తన దత్త పుత్రలని చెప్పుకొన్నారు.

అణగారిన వర్గాల కోసం పోరాడే వారిపై ఎనలేని ప్రేమాభిమానాల్ని ప్రదర్శించారు. కేవలం మాటల్లోనే కాకుండా చేతల్లోనూ ప్రదర్శించారు. పత్రికారచనతోపాటు ప్రజాందోళనల క్రియాశీల కార్యకర్త, నేతగానూ జోడు గుర్రాల స్వారీని అప్రతిహతంగా సాగించి రెండు రంగాల్లోనూ చెరగని ముద్ర వేసారు. మూఢనమ్మకాలను తీవ్రంగా వ్యతిరేకించే గౌరి, దేవాలయాల్లో జరిగే మూఢనమ్మకాలను విమర్శిస్తూ ఎన్నో కథనాలు ప్రచురించారు. దీంతో ఓ వర్గం నుండి వ్యతిరేకతను ఎదుర్కొనాల్సి వచ్చింది. 2008లో పలువురు హిందుత్వ నాయకులపై రాసిన కథనాలకు గాను రెండు పరువునష్టం కేసు (ఎంపీ ప్రహ్లాద్‌ జోషి, బీజేపీ నేత ఉమేశ్‌ దోషిలు వేసిన)ల్లో కోర్టు ఈమెను దోషిగా పేర్కొంది. ఇందుకు గానూ ఆర్నెల్ల జైలుశిక్షకు ఆదేశించింది. అయితే, అదేరోజు కోర్టు ఆమెకు బెయిల్‌ మంజూరు చేసింది.
ఆమె జీవితం, రచనలు ప్రగతి శీల ఉద్యమాలకు ఎంతో స్ఫూర్తిదాయకం.. 

అగ్రవర్ణాలకు, బ్రాహ్మణులకే భారతరత్న అవార్డులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన - ఒవైసీ

అగ్రవర్ణాలకు, బ్రాహ్మణులకే భారతరత్న అవార్డులు తప్పని పరిస్థితుల్లో అంబేద్కర్‌కు కూడా భారతరత్న ఇచ్చారు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన   : ఓవైసీ  

ముంబై : భారత అత్యున్నత పౌరపురస్కారమైన ‘భారతరత్న’ను ఇప్పటి వరకు ఎంతమంది ముస్లింలు, దళితులు, ఆదివాసీలకు ఇచ్చారని ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించారు. దళితుల ఐకాన్‌ బీఆర్‌ అంబేడ్కర్‌కు కూడా భారతరత్న అవార్డును హృదయపూర్వకంగా ఇవ్వలేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మహారాష్ట్రలో ఓ సభలో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఎంతమంది దళితులు, ఆదివాసీలు, ముస్లింలు, పేదలు, అగ్రవర్ణాలైన బ్రాహ్మణులకు భారతరత్న అవార్డులు ఇచ్చారో చెప్పాలని ఒవైసీ కేంద్రాన్ని నిలదీశారు. తప్పని పరిస్థితుల్లో అంబేడ్కర్‌కు భారతరత్న అవార్డును ప్రకటించారని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రముఖ గాయకుడు భూపేన్ హజారికా, సామాజిక కార్యకర్త నానాజీ దేశ్‌ముఖ్‌లకు భారత రత్న అవార్డులు వరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అత్యున్నత పురస్కారాల ప్రకటన విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి......    

Sunday, January 27, 2019

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందచేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య

 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందచేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య
                                                       న్యుాస్ టుా డే  బెల్లంపల్లి నియోజకవర్గం :  బెల్లంపల్లి మండలంలోని భరత్ నగర్ కాలనికి చెందిన అగర్వాల్ గారికి 36,000 రూపాయలు,....బెల్లంపల్లి మండలం చాకేపల్లి గ్రామానికి చెందిన B. రాజు గారికి 44,000 రూపాయలు,...పెద్దబూద గ్రామానికి చెందిన CH. నరేష్ గారికి 28,500 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందచేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారు ...

విశ్వం ఆవిర్భవించింది. సృష్ఠించబడలేదు.

విశ్వం ఆవిర్భవించింది. సృష్ఠించబడలేదు.
————————————————————
మాయలతో మంత్రాలతో ఈ భూమి పుట్టలేదు. ఏదో ఓ దేవుడు తీరికగా భోంచేసి కూర్చుని ఈ విశ్వాన్ని, సకల చరాచర జగత్తుని సృష్టించలేదు. మనిషిగా పుట్టినవాడు మనిషిగా ఆలోచించాలి. తన పుట్టుకను, తన అస్థిత్వాన్ని, సమాజ గతిని అన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవాలంటే సైన్సు తెలుసుకోవాలి. కనీసం కామన్‌సెన్స్‌ (ఇంగితజ్ఞానాన్ని) ఉపయోగించాలి. కామన్‌సెన్స్‌ ఉపయోగించకుండా ఎవరైనా మాట్లాడితే తాము మూర్ఖులమని వారికి వారే ప్రకటించుకున్నట్టు అవుతుంది. అలాంటి వారు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా, ఎంతటి స్థితిలో ఉన్నా వారి వల్ల సమాజానికి ఉపయోగం ఉండదు.
ఐదువందల బిలియన్‌ సంవత్సరాల పూర్వం, భూమిపుట్టిన తొలిదశలో భూమి ఉపరితల ఉష్ణోగ్రత అత్యంత గరిష్ట స్థాయిలో ఐదువందల సెంటీగ్రేడ్‌ నుండి ఆరువేల సెంటీగ్రేడ్‌ వరకు ఉంది. కొన్ని మిలియన్‌ సంవత్సరాల తరువాత భూమి కొంత చల్లబడింది. అప్పుడు భూమిలోపల ఉన్న, తక్కువ బరువున్న మూలకాలు హైడ్రోజన్‌, హీలియం, నైట్రోజన్‌, కార్బన్‌ వంటివి భూమి ఉపరితలంపైకి వ్యాపించి ప్రాథమిక వాతావరణం ఏర్పడింది. జీవుల పుట్టుక, మనుగడ కోసం భూమి ఉపరితలంలో జరిగిన పరిణామాల గూర్చి వివరంగా తెలుసుకోవడం ప్రతివారికీ అవసరం.
ఆక్సిజన్‌ ఎలా ఏర్పడింది? ఏకకణ జీవులు ఎలా రూపొందాయి వంటి విషయాలు తెలుసుకున్న తర్వాత, జీవపరిణామం గురించి తెలుసుకోవడం మంచిది. ఒకవైపు ఖగోళ శాస్త్ర విశేషాలు, మరోవైపు జీవ పరిణామం గురించి తెలుసుకుంటే గాని విషయం పూర్తిగా బోధపడదు.
ఈ విశ్వం గురించి, నక్షత్రాల గురించి కొన్ని వాస్తవాలు చెప్పుకుందాం. గెలాక్సీలో కోటాను కోట్ల నక్షత్రాలున్నాయి. అందులో సూర్యుడు ఒక నక్షత్రం. తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతున్న భూమి, ఇతర గ్రహాలతో పాటు తానున్న గెలాక్సీ కేంద్రకం చుట్టూ గంటకు 7,20,000 కి.మీ. వేగంతో తిరుగుతుంది. దానికి పట్టే కాలం 225×10(6). దీన్ని ఒక కాస్మిక్‌ యూనిట్‌ అంటారు. భూమి నుండి సూర్యుడి దూరం 14,95,98,500 కి.మీ. దీనిని ఒక ఆస్ట్రానమిక్‌ యూనిట్‌ అంటారు.
గ్రహాలు తమ చుట్టూ తాము తిరుగుతూ తమని ఆకర్షించే వాటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయంటే.. తమను ఆకర్షించే నక్షత్రాలపై పడిపోకుండా! నక్షత్రాలు, వాటిని ఆకర్షించే కేంద్రకాలలో పడిపోకుండా ఉండడానికి! ఉదాహరణకు సైకిల్‌ మీద తొక్కకుండా కూర్చుంటే కింద పడిపోతాం. తొక్కుతూ ముందుకు కదులుతూ ఉంటే పడిపోకుండా ఉంటాం. బాలెన్స్‌ చలనం ద్వారా సాధ్యమవుతుంది.
భూమి గంటకు 1670 కి.మీ. వేగంతో తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ గంటకు 1,08,000 కి.మీ. వేగంతో తిరుగుతూ ఉంది. ఒక రాకెట్‌ భూమ్యాకర్షణ శక్తి దాటుకుని అంతరిక్షంలోకి వెళ్ళాలంటే సెకనుకు 11.2 కి.మీ. వేగం కావాలి. సైన్సు చెపుతున్న ఇలాంటి వివరాలు ఏ మత గ్రంథంలోనూ లేకపోవడం మనం గమనించాలి!
ఈ విశ్వంలో లెక్కలేనన్ని గెలాక్సీలున్నాయి.
అందులో ఎన్నెన్నో నక్షత్రాలు వాటితోపాటు భూమి వంటి ఎన్నో గ్రహాలు, మరెన్నో ఇతర పదార్థాలూ ఉన్నాయి. జీవం కూడా విశ్వంలోనే ఆవిర్భవించింది. అందువల్ల శాస్త్రజ్ఞుల దృష్టిలో విశ్వమే విశ్వాన్ని సృష్టించుకుంది. విశ్వాన్ని గానీ, జీవాన్ని గానీ ఎవరూ సృష్టించలేదు. కాలగమనంలో పరిణామ క్రమంలో ఇవన్నీ ఒక్కొక్కటిగా ఏర్పడ్డాయి. మనముందు రెండు సిద్ధాంతాలున్నాయి. ఒకటి థియరీ ఆఫ్‌ స్పెషల్‌ క్రియేషన్‌. దీన్ని మత విశ్వాసకులు నమ్ముతున్నారు. తమ తమ దేవుళ్లే ఈ సృష్టికి కారణమని వారు విశ్వసిస్తున్నారు. అందుకు తగిన సాక్ష్యాలు, రుజువులు వారి దగ్గర లేవు. ఉంటే పరిణామ వాదాన్ని వివరించినట్టుగా ఒక క్రమ పద్ధతిలో వారు తమ సృష్టివాదాన్ని కూడా వివరించగలిగితే బావుంటుంది.
ఇక రెండోది పరిణామ సిద్ధాంతం. దాని ప్రకారంగా అంచెలంచలుగా భూమి ఎలా ఏర్పడింది. భూమిపై వాతావరణం ఎలా ఏర్పడిందీ... క్రమ క్రమంగా జీవులు ఎలా పుట్టుకొచ్చాయనే విషయాలు ఎందరో శాస్త్రవేత్తలు తమ జీవితాలు ధారపోసి తెలుసుకున్నవి. వారు ఎంతో బాధ్యతతో వాటిని ఈ సమాజానికి అందిస్తూ వచ్చారు. రుజువులు, సాక్ష్యాలు చూపుతూ విషయం స్పష్టంగా చెప్పే సిద్ధాంతాన్ని పక్కన పెట్టి మూఢ విశ్వాసం ఆధారంగా కల్పించుకున్న ఒక భ్రమను ఎలా నమ్ముతాం? ఇది మనిషైన వాడు, మెదడున్నవాడు
ఆలోచించుకోవాల్సిన విషయం. లేదూ మా విశ్వాసంలోనే మాకు ఆనందముంది.. అని ఎవరైనా అనుకుంటే అది వారి ఇష్టం. వ్యక్తి స్వేచ్ఛని కాదనలేం.
అసలైతే ఒక రకంగా సృష్టికర్త మానవుడే. భూమి పుట్టి కోటానుకోట్లు గడిచిపోయినా మనిషికి దేవుడి గూర్చి ఏ మాత్రం తెలియదు. రాతియుగంలో ప్రకృతి వైపరీత్యాలకు భయపడి మనిషి దేవుణ్ణి తనకు తానుగా సృష్టించుకున్నాడు. ఆ తర్వాత కాలంలో మతాలు రంగప్రవేశం చేశాయి. వివిధ ధర్మాలు జనజీవితంలో ప్రవేశించాయి.
ఐదువేల సంవత్సరాలకు ముందే హిందూధర్మం వర్థిల్లిందని చరిత్ర చెపుతోంది. ధర్మమే మతంగా మారింది. అలా హిందూ మతం ద్వారా అనేకనేక దేవుళ్ళు వెలుగులోకి వచ్చారు. అయితే వారిలో ఏ దేవుడి ద్వారా సృష్టి జరిగిందన్న దానికి స్పష్టత లేదు. హిందూ మతం వారే కాదు, ప్రతి మతం వారు మా దేవుడే ఈ సృష్టికి మూలకారకుడని చెప్పుకుంటున్నారు.
కేవలం రెండు వేల సంవత్సరాల క్రితం మాత్రమే క్రీస్తు పుట్టాడు. కొన్ని కోట్ల సంవత్సరాల నుండి ఉన్న ఈ సృష్టిని జీసస్‌ సృష్టించడమేమిటి? ఇది పూర్తిగా అబద్ధం. అసంబద్ధం. అంతే కాదు, అసంభవం. ఒకవైపు ఖగోళశాస్త్రం, మరోవైపు చరిత్ర, ఒకింత జీవశాస్త్ర పరిజ్ఞానం పెంచుకుంటే భ్రమలు వాటంతట అవే తొలగిపోతాయి.
సరే, ఇక అల్లా సంగతి చూద్దాం. ఇస్లాం మతం ఆరో శతాబ్దపు చివరలో స్థాపించబడింది. అంటే కొన్ని కోట్ల సంవత్సరాలుగా వర్ధిల్లుతున్న ఈ సృష్టిని అల్లా కూడా సృష్టించలేదు. ఆయనకు రూపకల్పన జరగక ముందునుండే ఈ సృష్టి ఉంది. జీసస్‌, మహమ్మద్‌లకు ఒక రూపం రాకముందే జనం యూదుల దేవుడైన యహోవాని పూజించుకునేవారు. యూదుల మతం నాలుగువేల ఐదువందల నుండి ఆరువేల సంవత్సరాల పురాతనమైంది. క్రైస్తవ, ఇస్లాం మతాలకు మూలం యూదుల మతమే! వారి దేవుడైన అల్లా - యహోవా ఇద్దరూ ఒకరే కానీ, వారి ప్రవక్తలు వేరు. క్రైస్తవులు జీసస్‌ని నమ్ముకుని యూదు దేవుణ్ణి కొలిస్తే.. ముస్లింలు మహ్మద్‌ని నమ్మి యూదు దేవుణ్ణే అల్లా అనిపించుకున్నారు. ఇవన్నీ మనిషికి ఊహ తెలిసిన తర్వాత ఏర్పాటు చేసుకున్న మతాలు. చాలా వరకు వీటి చరిత్ర రాజకీయంతో ముడివడి ఉంది.
ఇట్లా ఏ మతానికి, లేదా ఏ దేవునికి సంబంధించిన వివరాలు చూసినా అన్నీ విశ్వం ఏర్పడిన తర్వాత.. పరిణామ క్రమంలో మనిషి రూపొందిన తర్వాత.. ఏర్పాటు చేసుకున్నవే! మనిషే తనకు కావల్సిన మతాలు, ధర్మాలు ఏర్పరచుకుంటూ వస్తున్నాడన్నది అర్థం చేసుకోవాలి.
ఇప్పుడు అనుకుంటున్నట్టు ఈ సృష్టికి ఏ దేవుడూ మూలకారకుడు కాదని కచ్చితంగా తెలుస్తూ ఉంది. ఈ చిన్న ప్రాధమిక విషయం మనిషి ఆలోచించుకోకపోవడం తెలివితక్కువ తనమే కదా? ఒకప్పటి ఆటవిక యుగం నుండి ఇప్పటి అత్యాధునిక యుగం వరకు మనిషి దేవుణ్ణి చూసిందే లేదు. కారణం ఆలోచనని, ఊహని, భ్రమని మనిషి చూసుకోలేడు. వాటిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించొచ్చు. అంతే.. మళ్ళీ అవి సక్రమంగా సహేతుకంగా ఉన్నదీ లేనిది సమాజం గమనిస్తూనే ఉంటుంది.
మనకు అందుతున్న వైజ్ఞానిక సమాచారం ప్రకారం ఏకకణ జీవుల నుండి వెన్నెముక లేని (అకశేరుకాలు) జీవుల ఏర్పడ్డాయి. ఇవి ప్రాథమిక జీవ సమూహంలో 350 మిలియన్‌ సంవత్సరాల క్రితం పురాజీవ మహాయుగంలోనివి. ఆ తర్వాత కాలంలో అవశేరుకాల నుండి సకశేరుకాలు (వెన్నెముక గల జీవులు) ఏర్పడ్డాయి. వాటి నుంచి చేపలు ఆవిర్భవించాయి. వీటి నుంచి ఉభయ చరాలు, వాటి నుంచి సరీసృపాలు, మళ్ళీ వాటి నుంచి పక్షులు, క్షీరదాలు, జరాయు క్షీరదాలు (పాలిచ్చే జంతువులు) ఆవిర్భవించాయి.
ఆధునిక జీవ మహాయుగంలో ప్లియోసీన్‌ శకంలోని మానవుడి ఉద్భవం జరిగింది. టూకీగా పరిణామ దశల్ని చెప్పుకోవడమెందుకంటే ప్రాథమిక పరిజ్ఞానంతో మత గ్రంథాలు రాసిన వారెవరూ ఇలాంటి వివరాలు ఇవ్వలేదు. తమను తాము తెలుసుకున్న గొప్ప తత్వవేత్తలెవరంటే శాస్త్రజ్ఞులే! సైన్సు తెలుసుకుంటేనే తమను తాము తెలుసుకున్నట్టు. కళ్ళు, ముక్కూ మూసుకుని దైవప్రార్థన చేయడమంటే ఏమిటీ? మనిషి ప్రాథమిక దశలో ఏర్పరుచుకున్న దైవభావనని ధ్యానిస్తూ కూర్చోవడమన్న మాట! దానివల్ల భౌతిక ప్రపంచంలో ఏ మార్పులూ రావు. శారీరకంగా విశ్రాంతి లభిస్తుంది. ఇతర విషయాలేవీ ఆలోచించకుండా ఉండడం వల్ల మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. ఫలితంగా మనసు ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంతే.. దానివల్ల ఏ అద్భుతాలూ జరగవు.
సైన్సుకు మత గ్రంథాలకూ వైరుధ్యం ఎప్పుడూ ఏర్పడుతూ వస్తోంది. అందుకు కారణమేమంటే సైన్సు ఎప్పుడూ నిరంతరం మారుతూ ఉంటుంది. కాలానుగుణంగా కొత్త కొత్త విషయాలు చేర్చుకుంటుంది. ఒకప్పుడు ఉజ్జాయింపుగా చెప్పిన అంశాల్ని స్పష్టంగా, కచ్చితంగా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఆదిమానవుడిని సంస్కరిస్తూ ఆధునికుడిగా, అత్యాధునికుడిగా తీర్చిదిద్దుకుంటూ వస్తోంది. మనిషి ధర్మంగా బతకడానికి మత గ్రంథాలు గతంలో కొంత వరకు ప్రయత్నించాయి. ఒప్పుకోవల్సిందే.. కానీ ఎప్పుడో ప్రాథమిక అవగాహనతో రాయబడ్డ అన్ని మత గ్రంథాలు ఆధునికుడి మేధో శక్తితో పోటీ పడలేక వెనకబడిపోతున్నాయి. కొత్త ఆలోచనలకు, కొత్త కొత్త ప్రశ్నలకు అందులో జవాబులు దొరకడం లేదు. ఆయా మత విశ్వాసాల్లో బతికేవారు బతకొచ్చు. అది వారి ఇష్టం. కానీ, ఒక విషయం అందరూ స్పష్టంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మత గ్రంథాల సారాంశం వల్ల గానీ, మత బోధకుల వల్ల గానీ, మత విశ్వాసాల వల్లగానీ ఈ ప్రపంచం ముందుకు రాలేదు. ఇక ముందు కూడా ముందుకుపోదు.
వైజ్ఞానిక శక్తి మాత్రమే మనిషికి తిండిపెట్టి బతికిస్తోంది. జబ్బుచేస్తే నయం చేస్తోంది. అంతరిక్షంలోకి తీసుకెళుతోంది.
అదీగాక, మత బోధకులు నైతికంగా దిగజారి మతాన్ని ఒక వ్యాపారంగా మార్చేశారు. అందువల్ల సామాన్య జనానికి వారి మీద గౌరవం ఉండడం లేదు. పైగా మాయ మాటలు చెప్పే రాజకీయ నాయకులు, మత పెద్దలు ఒకరికొకరు సహాయమందించుకుంటూ అక్రమంగా బలిసిపోతున్నారు. ఇక విలువలూ, గౌరవాలూ ఎక్కడుంటాయి? అందుకే ఆత్మవిశ్వాసం లేనివారే దైవశక్తిని నమ్ముకుంటారన్న అభిప్రాయం బలపడుతూ ఉంది.
- డాక్టర్‌ దేవరాజు

ఉత్తమ తహశీల్దార్ అవార్టు అందుకున్న ఆసిఫాబాద్ తహశీల్దార్ Eకిషన్ గారు

ఉత్తమ తహశీల్దార్ అవార్టు అందుకున్న ఆసిఫాబాద్ తహశీల్దార్ Eకిషన్ గారు
 రెవెన్యూ శాఖలో అత్యుత్తమ సేవలు అందించినందుకుగాను గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ గౌరవనీయు రాజీవ్ హనుమంతుగారి చేతుల మీదిగా ఉత్తమ తహశీల్దార్ గా అవార్టు అందుకున్న గౌరవనీయులు  శ్రీ Eకిషన్ గారికి అథికారులు , విద్యార్థులు, యువత , సామాజిక కార్యకర్తలు, మేము సైతం ఏడ్యుకేషనల్ రుారల్ డెవలప్ మెంట్ యుాత్ వెల్ఫేర్ సోసైటి కమిటీ    హృదయపుార్వక శుభాకాంక్షలు తెలియజేశారు .... 

పెయిన్‌ కిల్లర్లు వాడడం వలన

పెయిన్‌ కిల్లర్లు వాడడం వలన
పెయిన్‌ కిల్లర్లు వాడడం వలన నొప్పి తగ్గే అవకాశాల కన్నా భవిష్యత్తులో వినికిడి లోపం కలిగే ప్రమాదం ఉందని అమెరికా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వైద్యుల సలహా తీసుకోకుండా ఏళ్ల తరబడి పెయిన్‌ కిల్లర్లు వాడితే వినికిడి శక్తి తగ్గే అవకాశం సుమారు ఆరు శాతం ఉంటుందన్న విషయం వీరి పరిశోధనలో వెల్లడైంది. కొందరు వైద్యుల సలహా తీసుకోకుండా పెయిన్‌కిల్లర్స్‌ రోజుల తరబడి వాడుతుంటారనీ అలాంటి వారికి వినికిడి శక్తి లోపం ఏర్పడవచ్చని వారు హెచ్చరిస్తున్నారు... 

అందరూ ఆహ్వానితులే

అందరూ ఆహ్వానితులే
                                                                                              
         స్థలం :- చార్వాకాశ్రమం, మంగళగిరి, నిడమర్రులో, గుంటూరు జిల్లా.