Thursday, January 23, 2020

SANGAMITHRA WON BEST YOUTH ORGANIZATION AT DISTRICT LEVEL

సంఘమిత్ర యూత్ అవేర్నెస్ సేవా సొసైటీ  యువజన స్వచ్ఛంద సంస్థ కు జిల్లా స్థాయి ఉత్తమ యువజన సంస్థ అవార్డు ప్రధానం చేసిన తెలంగాణ  రాష్ట్ర గవర్నర్ డా.తమిళిసై సౌందర్ రాజన్ గారు*

వరంగల్ రూరల్  జిల్లా నర్సంపేట కు చెందిన *నర్సంపేట టౌన్ సంఘమిత్ర యూత్ అవేర్నెస్ సేవా సొసైటీ  254/2017*  జిల్లా లో స్వచ్ఛందంగా చేపడుతున్న యూత్ లీడర్ షిప్ & డెలవలప్మెంట్ ప్రోగ్రామ్ మరియు సామాజిక సేవా & అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న విధానాన్ని అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నెహ్రూ యువ కేంద్ర  ప్రకటించిన జిల్లా స్థాయి ఉత్తమ యువజన సంస్థ అవార్డును నేడు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం లో *తెలంగాణ    రాష్ట్ర గవర్నర్ డా.తమిళిసై సౌందర రాజన్ గారు సంఘమిత్ర బృందానికి   అభినందనలు తెలుపుతూ అవార్డు ను   ( 25000/-  నగదు బహుమతి & ప్రశంసపత్రం )* ప్రధానం  చేశారు.

ఈ కార్యక్రమంలో స్టేట్ *యూత్ సర్వీసెస్ కమీషనర్ అబ్దుల్ అజీమ్ IAS మరియు నెహ్రూ యువ కేంద్రం తెలంగాణ   రాష్ట్ర డైరెక్టర్ ప్రమూద్ హింగే (PRAMOD HINGE) NSS స్టేట్ రీజనల్ డైరెక్టర్ రామకృష్ణ* గారు , NYK వరంగల్ కో ఆర్డినేటర్ శ్రీవాణి మరియు అన్వేష్ గార్లు పాల్గొన్నారు.

ఈ అవార్డు ను  సంఘమిత్ర అధ్యక్షులు   గొంగళ్ళ అశోక్ నేతృత్వంలో స్వీకరించిన అనంతరం వారు మాట్లాడుతూ దేశాభివృద్ధికి మూలమైన యువతను సన్మార్గంలో నడిపించుటకు , సమాజం హితం కోరుతూ ,యువతను,  ప్రజలను పలు అంశాలలో అవగాహన పరుస్తు సామాజిక మార్పుకు , అభివృద్ధికి సంఘమిత్ర పాటు పడుతున్నందుకు దక్కిన అరుదైన గౌరవమని తెలిపారు.

సంఘమిత్ర సభ్యులు నిర్విరామంగా సమాజ మార్పుకోసం పాటు పడడం ఆదర్శనీయమని  పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న నెహ్రూ యువ కేంద్రం- వరంగల్ గారికి కృతజ్ఞతలు మరియు  అధ్యక్షులు అశోక్ తో కలిసి వస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

కన్నె రాజు, ఆకుల గణేష్, చేపూరి ప్రశాంత్, పెండ్యాల రాకేష్, అజ్మీర రాజేందర్, తోట రవి, ఎర్రా రాకేష్, భూక్య లాలు,దూపటి సాయితేజలు అవార్డు స్వీకరించిన వారిలో ఉన్నారు. 

Saturday, January 4, 2020

షెడ్యూల్ కులాల జాతీయ కమీషన్  సభ్యులు కె. రాములు ను కలిసిన హై కోర్టు న్యాయవాది కాంపెల్లి ఉదయ్ కాంత్ , చైర్మన్ - ఉదయ్ ఫౌండేషన్  


షెడ్యూల్ కులాల జాతీయ కమీషన్  సభ్యులు కె. రాములు ను కలిసిన హై కోర్టు న్యాయవాది కాంపెల్లి ఉదయ్ కాంత్ , చైర్మన్ - ఉదయ్ ఫౌండేషన్                                                                                                                             షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ సభ్యుడు కె. రాములు గారిని హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యదపుార్వకంగా కలవటం జరిగింది. పుష్పగుచ్చం ఇచ్చి నుాతన సంవత్సర శుాభాకాంక్షాలు తెలియజేయటం జరిగింది.. ఈ సందర్భంగా  హై కోర్టు న్యాయవాది కాంపెల్లి ఉదయ్ కాంత్  గారు మాట్లడుాతు  తెలంగాణ రాష్ర్టంలో దళితులపై జరుగుతున్నా హత్యలు, అత్యచారలు, దాడులపై చర్చించుకోవటం జరిగింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ర్ట ప్రభుత్వలకు ఆదేశాలను ఇవ్వలని కోరటం జరిగింది. ప్రభుత్వ కార్యలయాలలో పని చేస్తున్నా ఉద్యోగులలో షెడ్యూల్ కులాల ఉద్యోగులను మరియు మహిళల ఉద్యోగులను కీంచపరిచే విధాంగా కోంత మంది అధికారులు ప్రవర్తింస్తున్నారని ఉద్యోగులు ఫీర్యాదులు ఇస్తున్నా ఉన్నత అధికారులు అధికార దుర్వనియెాగంతో, అహాంకరంతో వారిపై వివక్షత చుాపుతుాన్నారని అన్నారు. వారికి న్యాయం జరిగేలా కమిషన్ భాద్యత వహించేలా చుాడలని కోరారు. దళిత ఉద్యోగులకు రక్షణ కరువైతుందాని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాడినప్పుటి నుండి చిన్న తరహా పరిశ్రమ ఏర్పాటు చేయటంలో విఫలమయిందాని, నిరుద్యోగ సమస్య రోజు రోజుకు పెరిగిపోయిందాని అన్నారు. షెడ్యూల్ కులాల వారిని రాష్ర్ట ప్రభుత్వం చిన్న చుాపు చుాస్తుందాని వారికి చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాటనికి, స్వయం ఉఫాది కై లబ్బిదారులకు లోన్ లు   దళారులు లేకుండా పారదర్శకంగా ఇచ్చేలా వ్యవహారించేలా చుాడలని కమిషన్ కోరటం జరిగింది.