ఎంతో మంది విద్యార్థులకు మార్గదర్శిగా నిలిచిన విద్యాలయం
1950వ సంవత్సరంలో పురుడు పోసుకున్న పాఠశాల
నాడు చెరువు కట్ట బడిగా... నేడు బెల్లంపల్లి బస్తి బడిగా ప్రసిద్ధి..
ఎంతోమంది రాజకీయ నాయకులు, కవులు, కళాకారులు, నక్సలైట్లు, ప్రభుత్వ అధికారులను, బొగ్గు గని కార్మికులకు ఇచ్చిన పాఠశాల
బెల్లంపల్లి, మేము సైతం, జూన్ 29
బెల్లంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల సుమారుగా 1950 1950 వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు బెల్లంపల్లి నియోజకవర్గంలో మొట్టమొదటి పాఠశాల ఇదే. 1950 నుండి 2025 వరకు ఎంతోమంది విద్యార్థులను తీర్చి దిద్దిన పాఠశాలగా గుర్తింపు. నాటి నక్సలైట్ ఉద్యమం నుండి నేటి తెలంగాణ ఉద్యమం వరకు ఎంతోమంది ఉద్యమకారులు తయారుచేసిన పాఠశాల, ఎంతోమంది అధికారులను సైతం ఇదే పాఠశాలలో చదివారంటే నమ్మశక్యం కాదు. నాడు చెరువు కట్ట బడిగా, నేడు బెల్లంపల్లి బస్తి బడిగా స్థానిక ప్రజలకు నానుడి ఈ పేరు.
• *2021 లో నూతన భవనం*
పాఠశాల ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత శిలావస్థలో ఉన్న పాఠశాలకి నూతన భవనం కావాలని విద్యార్థి సంఘాల ఉద్యమాల ప్రతీకగా 2021లో డి ఎం ఎఫ్ టి నిధులతో సుమారు 62 లక్షల రూపాయలతో నూతన భవనాన్ని అప్పటి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.
• నాటి విద్యా సంవత్సరం కంటే ఈ విద్యాసంస్థలం అడ్మిషన్లు పెరిగాయి
గత విద్యా సంవత్సరంలో
ఆరో తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు 180 మంది విద్యార్థులు ఉన్నారు
పదో తరగతి విద్యార్థులు 26 మంది
మొత్తం 206 విద్యార్థులు.
ప్రస్తుత ఈ విద్యా సంవత్సరం
ఆరో తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు 220 మంది విద్యార్థులు ఉన్నారు
పదో తరగతి విద్యార్థులు 38 మంది మొత్తం 258 విద్యార్థులు.
హెచ్ఎం బండి మాధవి
ప్రభుత్వ ఉన్నత పాఠశాల బెల్లంపల్లి
అడ్మిషన్ కోసం ఇంకా చాలా మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాఠశాలకు వస్తున్నారు. అడ్మిషన్స్ పూర్తయ్యాయి. గతంలో 86% పదో తరగతి ఉత్తీర్ణులైతే, ఈ సంవత్సరం పదో తరగతి 100% ఉత్తీర్ణులయ్యారు. అప్పటినుంచి అడ్మిషన్లు చాలా పెరిగాయి. అడ్మిషన్ల కొరకు జూన్ 6 2025 నుండి జూన్ 19 వరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. విద్యాశాఖ ఉన్నత అధికారుల ఆదేశం మేము చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు వెళ్లి మా పాఠశాల గురించి తల్లిదండ్రులకు వివరించడం. అలా కాన్వసింగ్ చేయడం వల్ల ఈ సంవత్సరం అడ్మిషన్ ఎంతో పెరిగాయి. అదేవిధంగా విద్యార్థులకు హాస్టల్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నాము.
డిజిటల్ బోర్డ్ ద్వారా తరగతులను బోధిస్తున్నాము. మా పాఠశాలలో ప్రత్యేక గ్రంథాలయం తో పాటు చల్తోపాటు ఆటపాటలు బాలసభలు నిర్వహణ తదితర సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంతేగాక 6 నుండి పదో తరగతి వరకు పూర్తిగా ఇంగ్లీష్ మీడియం లోనే బోధిస్తున్నాం. ప్రైవేటు పాఠశాలకు దీటుగా మా ప్రభుత్వ స్కూళ్లని నడిపించుతున్నామని తెలియజేయడం గర్వకారణంగా ఉంది.
• *పాఠశాలలో ప్రధాన సమస్యలు*
అదనపు తరగతి గదులు కావాలి
ప్రస్తుతానికి ఈ పాఠశాలలో విద్యార్థులకు బోధించడానికి 5 గదులు మాత్రమే ఉన్నాయి. ఆ ఐదు గదులలో ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు మాత్రమే బోధిస్తున్నాము. అదనపు గదులు పెరిగితే ఇంకా అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉంది.
• *టీచర్ల కొరత.. సబ్జెక్ట్ కి ఒక టీచర్ మాత్రమే*
ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం బోధించడానికి ప్రస్తుతానికి ఒక సబ్జెక్టుకి ఒక టీచర్లు ఉన్నారు మాత్రమే ఉన్నారు. టీచర్లు పెరగడం వల్ల విద్యార్థులకి మరికొన్ని కొత్త విషయాలను తోపాటు సబ్జెక్ట్ ని కూడా నేర్పించవచ్చని విద్యార్థులు కోరుతున్నారు.
నా ఇద్దరు ఆడ పిల్లలు ఇదే పాఠశాలలో చదువుతున్నారు. ఒక పాప ప్రస్తుతం పదో, ఇంకో పాప ఏడో తరగతి. ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. నాణ్యతమైన మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడంలో హెడ్మాస్టర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. హాస్టల్ సౌకర్యం కూడా ఉంది. విద్యార్థుల సౌకర్యం కొరకు అదునపు గదులను ప్రభుత్వం మంజూరు చేయాలని కోరుతున్నాను. పేరెంట్స్ కమిటీ సభ్యుల నుండి కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లాము.