Monday, October 7, 2019

అశోకుడు యుద్ధం వీడిన రోజే దసరా విజయదశమి చరిత్ర పరిశీలించాలి


  • అశోకుడు యుద్ధం వీడిన రోజే దసరా విజయదశమి చరిత్ర పరిశీలించాలి - దుర్గం సిద్ధార్థరాంమ్మూర్తీ సమత సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు


మాట్లడుతుాన్న, దళిత, బహుజన నాయకులు

బుద్ధం సరణం గచ్ఛామి
ధమ్మం సరణం గచ్ఛామి
సంఘం సరణం గచ్ఛామి

1. భారతదేశ చరిత్ర అంటే బ్రహ్మనిజానికి, బౌద్ధం కి మధ్య సంఘర్షణ మాత్రమె అంటారు బాబాసాహెబ్. చరిత్ర వేటగాళ్లువ్రాసుకున్నదే కాని పులులు వ్రాసుకోలేదు అయితే వేటగాళ్ళ కుట్రలను ఇప్పుడు తెలుసుకున్న బహుజన సమాజం సమర్థవంతంగా త్రిప్పికొడుతుంది.

2. దష్+హరా =దశరా అంటే 10 ని కూల్చడం .మరి ఆ పది ఏంటిది అని చుస్తే మనకు మౌర్య సామ్రాజ్యం గుర్తుకు వస్తుంది.మౌర్య వంశం మొదటి రాజు చంద్రగుప్తుడు మొదలు చివరి రాజు బృహదత్తుడు వరకు పది వంశాల పాలన .ఈ పది వంశాల పాలన బౌద్ధ శాసన కాలం, అంతే కాకుండా మౌర్య సమ్రాజ్య చివరి రాజు బృహదత్తు ని సైన్యాధ్యక్షుడు గా కుట్ర తో చేరిన పుష్యమిత్రశృంగ అనే బ్రాహ్మణుడు చంపడం జరుగుతుంది. మౌర్య రాజ్యాన్ని కూల్చి తన బ్రాహ్మణ సామ్రాజ్యాన్ని స్థాపించించడం జరిగింది.ఒకొక్క బౌద్ద భిక్షువు తల ను నరికి తెచ్చిన వారికి నూరు వరహాలు ప్రకటించింది ఈ క్రూరుడే.

3. బౌద్ద కాలo అయినా మౌర్యుల కాలంలో బ్రాహ్మణుల ను ఎవరు పట్టించుకోలేదు.వారికీ ఎటువంటి గుర్తింపు, అది శ్రమజీవుల గుర్తిoపు కాలం ముఖ్యన్గా శ్రద్ద ఖర్మలు ఆగిపోయాయి.దానితో శృంగ బ్రాహ్మణుల కు గడ్డుకాలం దాపురించింది.దానితో కుట్ర చేసి బృహదత్తునికి పిల్లను ఇచ్చి పెళ్లి చేసి చివరికి ఈమౌర్య పదవ రాజు ను హత్య చేసి మౌర్య సామ్రాజాన్ని కూల్చడానికి గుర్తే ఈ దష్-హరా.

4. అశోక విజయ దశమి చరిత్ర ను వక్రేకరించిన బ్రహ్మనిజం. ది గ్రేట్ అశోక మౌర్య కళింగ యుద్దాన్ని గెలిచి సామ్రాట్ గా ప్రకటింపబడుతారు.ఆ తరువాత ఆయన బౌద్ద భిక్షువు మొగలి పుత్త తిస్స దగ్గరికి వెళ్లి నేను ఇప్పుడు సామ్రాట్ నుఅయ్యాను అని చెబుతారు.అపుడు ఆ బౌద్ద గురువు ఇచ్చిన జ్ఞాన బోధ ఆయనను ఆలోచింప జేస్తుంది.కళింగ యుద్ధాన్ని వెనక్కు మరలి చూసుకున్న అశోకుడు కి లక్షలాది సైనికుల శవాల దిబ్బలు,ఏరులై పారుతున్న రక్తం,తెగిపడ్డ మానవ* శరీరాలు ,భర్తలు,బిడ్డలను కోల్పోయిన అడబిడ్డల ఆర్తనాదాలుకనిపిస్తాయి.చలించి పోయిన మౌర్యరాజు పశ్చాత్తాపం చెంది చనిపోయిన కళింగుల కుటుంబాలకు పెద్దకొడుకు అయిపోతాడు.

5. యుద్ధం జరిగిన తరువాత మామూలుగా విజయోత్సవ సభ జరగాలి .కాని అశోకుడు యుద్ధం జరిగిన పది రోజులకు సరిగ్గా దశమి రోజున బౌద్ద ధమ్మ దీక్ష ను బౌద్ద గురువు మొగలి పుత్త తిస్స ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది.ఈ దశమీ రోజున అశోకుడు బుద్ధుని పాదాల దగ్గర ఆయుధాలనుపెట్టడం జరిగింది. మౌర్యరాజు బుద్దుని పాదాల వద్ద ఆయుధాలుపెట్టి విజయ దశమి నిర్వహిస్తే బ్రహ్మనిజo ఇదే రోజు ఆయుదాలకు రక్తం పూసి హింస ను ప్రేరేపించేల ఉన్న ఒక స్త్రీ ప్రతిమ ముందు పూజలు చేస్తారు.శాంతి ని బోధస్తున్న బౌద్దo కి వ్యతిరేకoగా బ్రాహ్మనిజం చేస్తున్నదే ఈ విజయ దశమి.

6. క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దం నుండి భారత దేశం లో బౌద్ధం మొదలై క్రీస్తు శకం 15 వ శతాబ్దంవరకుసుమారు 2 వేల ఏండ్లు బౌద్ధం విలసిల్లింది.బ్రహ్మనిజ కుట్రలకు పూర్తిగా ఈ దేశం లో బాబా సాహెబ్ కి ముందువరకు బౌద్ధం తుడుచుకుపెట్టుక పోయింది. నలంద ,నాగార్జున,తక్షషీలా ,విక్రమషీలా లాంటి విశ్వ విద్యాలయాలతో చదువును,జ్ఞానాన్ని ప్రపంచానికి అందించిన బౌద్ధ కాలం,బ్రహ్మనీయా ద్వంస కుట్రల వలన ఈ దేశం మూఢత్వం,అవిద్య లో మొదటి స్థానం లోకి వచింది.

7. హిందువుగా పుట్టాను కాని హిందువుగా మరణించను అని ప్రకటించిన డాక్టర్ అంబేద్కర్ గారు 20ఏళ్ళ మన చరిత్ర వెలికి తీత అనంతరం సరిగా  అశోకుడు బౌద్ధ దమ్మ దీక్ష తీసుకున్న "దశమి"నాడు 1956 లో బౌద్ధధమ్మ దీక్షను 5 లక్షల మంది తో బౌద్ద గురువు చంద్రమని గారిఆధ్వర్యంలో స్వీకరించడం జరిగింది.అంతే కాకుండ మరునాడు బాబాసాహెబ్ స్వయంగా మరో 2 లక్షల ప్రజలకు బౌద్ద దీక్ష ను ఇవ్వడంజరిగింది.

8. పుష్యమిత్రశృంగు ని తరువాత కుల వ్యవస్త పాదుకుపోయింది. బౌద్ధo లో ఉన్న వారిని అంటరాని వారుగా చేసిన బ్రాహ్మనిజం.అందులో నాగవంశీయులు కూడా అంటరాని వారు అయ్యారని బాబాసాహెబ్ చరిత్ర విశ్లేషించడం జరిగింది.

9. దసరా ను జరుపుకుoటున్న అంటరాని కులాలు అవివేకులు, చరిత్ర తెలియని వారే అని చెప్పాలి.విజయదశమి అదే అశోక విజయ దశమి రోజు  బాబా సాహెబ్ బౌద్ధం స్వీకరించిన నాగపూర్ ను సందర్శించడం విదిగా పెట్టుకుందాం .బాబా సాహెబ్ ఆకాంక్ష అయినా ప్రబుద్ధ భారత్ నిర్మిద్దాం.

10. రామాయణం పేరుతొ ఒక కల్పిత గాథ ను అల్లిన బ్రహ్మనిజo, పుష్యమిత్ర శృంగున్ని రాముడు క్యారెక్టర్ గా, బృహదత్తు న్ని 10 తలలు ఉన్న రావణా సురుడుగా ఒక కథను సృష్టించారు. ఇక్కడ 10 తలలు అంటే 10 మౌర్య బౌద్ద శాశన కాలాలు అని గ్రహించండి . మన రాజుల చంపి మనతో పండగ చేయిస్తున్న బ్రాహ్మణ కుట్రల చేదిస్తూ  రావణ వధను తీవ్రoగా ప్రతిఘటిద్దాం.

దసరాను అశోక విజయ దశమి జరుపుకుందాం ఈ కార్యక్రమంలో దుర్గం గోపల్ తెలంగాణ నేతాకాని మహర్ కుల హక్కుల పరిరక్షణ సంఘం  రాష్ట్ర అధ్యక్షులు,హన్మాండ్ల శ్యామ్ భారత నాస్తిక సమాజం రాష్ట్ర కోశాధికారి,దాగం మల్లేష్ DHPS, రంగ ప్రశాంత్ పెరియర్ ఆలోచన వేదిక సభ్యులు, సపాట్ మల్లేష్.బా.నా.స జిల్లా నాయకులు దాగం రాయలింగు అంబేద్కర్ సంఘం మండల కార్యదర్శి పాల్గొన్నారు

Friday, October 4, 2019

ఇదేనా బంగారు తెలంగాణ...?

బుచ్చయ్యపల్లి గ్రామంలో రోడ్డు పరిస్థితి అధ్వానం... ప్రశ్నిస్తున్నా గ్రామ యువత, గ్రామస్థులు. ఇదేనా బంగారు తెలంగాణ...?
బెల్లంపల్లి మండలం బుచ్చయ్య పల్లి గ్రామంలో రోడ్డు పరిస్థితి అద్వనంగా ఉన్నాయని పలుసార్లు సర్పంచ్ మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన, అనేక సార్లు ఈ రోడ్డు పై నిరసనలు తెలిపిన పట్టించు కోవడం లేదాని, ఈ మార్గం బుచ్చయ్యపల్లి, పెద్దదుబ్బ, ఆకెనపల్లి గ్రామాల ప్రజలు మందమర్రి పట్టణనికి వెళ్ళడానికి ఇదే ప్రధాన మార్గం అని, ఈ రోడ్డుపై ప్రతి రోజు కనీసం 300 మంది ప్రజలు, రైతులు కూరగాయలు, పాలు అమ్ముటకు ఇదే మార్గంలో వెళ్ళాటనికి జీవనాధారం అయిన ఈ రోడ్డు బాగు చేయించాలని అక్కడి యువత ఎన్ని సార్లు మోరపెట్టుకున్న సంబంధిత అధికారులు స్వందించాటం లేదాని, ఇప్పటికైనా అధికారులు స్పందించాలని సమస్య పరిష్కరించాలని యువత, ప్రజలు కోరుతున్నారు.



అంకుశం గ్రామ ప్రజల ప్రధాన సమస్యలు పరిష్యారించాలి - కాంపెల్లి ఉదయ్ కాంత్, వైస్ చైర్మన్ లీగల్, హెచ్ ఆర్ & ఆర్ టి ఏ డిపార్ట్మెంట్ - టీపీసీసీ.       

అంకుశం గ్రామ ప్రజల ప్రధాన సమస్యలు పరిష్యారించాలి - కాంపెల్లి ఉదయ్ కాంత్, వైస్ చైర్మన్ లీగల్, హెచ్ ఆర్ & ఆర్ టి ఐ డిపార్ట్మెంట్ - టీపీసీసీ.       
మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి మండలంలోని 
అంకుశం గ్రామ పంచాయతీని పర్యటించిన కాంపెల్లి ఉదయ్ కాంత్ గారు అక్కడి ప్రజల ప్రధాన సమస్యలు పరిష్యారించాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. 30 రోజుల ప్రణాళికలో ఏమేమి పనులు జరిగాయో పరిశీలించారు. అంకుశం గ్రామంలోని వాడ వాడకి తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలపై గ్రామ సర్పంచ్ తో చర్చించాటం జరిగింది.
 అనంతరం అంగవాడి కార్యకర్తలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కాంపెల్లి ఉదయ్ కాంత్ మాట్లాడుతుా గ్రామలే దేశానికి పట్టుకొమ్మలని మహాత్ముని మాటలు ప్రభుత్వం విస్మరించి కేవలం ఓట్ల కోసమే పాలన అనే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన  ఉందని అన్నారు. ఏన్నికల ముందు గ్రామలలో అరకోర సాదుపాయలు కల్పించి, ఏన్నికలలో గెలిచిన తరువాత గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు.. ప్రధాన రహదారి నుండి గ్రామంలోకి వెళ్లడానికి సరైన రోడ్డు మార్గం లేక గ్రామస్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, అదే విధంగా అనారోగ్యనికి గురైన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే చాలా కష్టతరంగా ఉందాని, గర్భిణీ స్త్రీలు ప్రసవించిన ఆనంతరం పాప, బాబు పుట్టారనే సంతోషం ఉన్న, చికిత్స అనంతరం ఊళ్లోకి రావాలంటే రోడ్డని చుాసి భయపడే పరిస్థితి ఉందని అన్నారు. ఇదేనా బంగారు తెలంగాణ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం కేజీ టు పీజీ అమలు చేస్తామని ఎన్నికల ముందు హామి ఇచ్చి, మరిచిపోవటమే కాక అంకుశం ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకి చెరిన సంబంధిత  అధికారులు పట్టించు కోవటంలేదాని అన్నారు. వెంటనే పక్కా భవనాన్ని నిర్మించి, వచ్చే విద్యా సంవత్సరానికి నూతన భవనాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా  రైతులకు అందని ద్రాక్షలాగా రైతు బంధు పథకం ఉందాని, ఎన్నికల ముందు రైతులకు ఇవ్వవలసిన రైతు బంధు డబ్బులను భుాస్వాములకి, వందల ఏకరలు ఉన్న ఆసాములకి రైతు బంధు పథకం పేరిట కోట్లల్లో రుాపాయలు ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియెాగంచేశారని, ఇప్పుడు రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవాని, ప్రపంచా బ్యాంక్ కుాడ తెలంగాణకి అప్పులు ఇవ్వలేమని చెప్పిందాని అన్నారు. నిరుపేద రైతులు రైతు బంధు డబ్బులకై బ్యాంక్ ల చుట్టుా తిరుగే పరిస్థితి వచ్చిందాని, రైతు బంధు డబ్బులకై ఆన్ లైన్ లో చుాసే ట్రెజరీలో పెండింగ్ అయినట్టు ముాడు నెలలుగా చూపిస్తుందనాని, ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసి, మభ్యపెడుతున్నారని అన్నారు.. అంగన్వాడీ కార్యకర్తలకు గత రెండు నెలలుగా జీతభత్యాలు అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వేంటనే వారికి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంకుశం గ్రామ ఉపసర్పంచ్ కోప్పుల భానుచంగర్, కాంగ్రేస్ నాయకులు  సంకురి శంకర్, ప్రదీప్ తదితరులు మరియు అంకుశం గ్రామస్థులు ఉన్నారు.




                                                                           

Wednesday, October 2, 2019

బెల్లంపల్లి మండలంలో గ్రామలను పర్యటించిన - కాంపెల్లి ఉదయ్ కాంత్ వైస్ చైర్మన్ లీగల్, హెచ్ ఆర్ & ఆర్ టి ఏ డిపార్ట్మెంట్- టీపీసీసీ.

బెల్లంపల్లి మండలంలో గ్రామలను పర్యటించిన - కాంపెల్లి ఉదయ్ కాంత్ వైస్ చైర్మన్ లీగల్, హెచ్ ఆర్ & ఆర్ టి ఏ డిపార్ట్మెంట్- టీపీసీసీ.
న్యాయ సలహాలు, సుాచనలు ఇస్తున్నా ఉదయ్ కాంత్
                                      
ఉదయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి మండలంలోని పెరకపల్లి, బట్కాన్ పల్లి, గురిజాల, లంబడితాండ,  మాల గురిజాల, రంగపేట గ్రామలలో న్యాయ సదస్సులను నిర్వహించాటం జరిగింది. గ్రామ పంచాయతీలో పర్యటించి కాంపెల్లి ఉదయ్ కాంత్ గారు, అక్కడి గ్రామ ప్రజలను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  చట్టపరమైన, న్యాయపరమైన సమస్యలపై అవగహణ కల్పించాటం జరిగింది.  ఈ సందర్భంగా కాంపెల్లి ఉదయ్ కాంత్ మాట్లడుతుా తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామ గ్రామలలో న్యాయ సదస్సులు నిర్వహించి వారి సమస్యలపై అవగహణ కల్పింస్తున్నామని అన్నారు.  కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వల నుండి వచ్చే పథకలు ప్రజలకు అందుతున్నాయ లేదా అని  అడిగి తెలుసుకున్నారు. 30 రోజుల ప్రణాళిక పేరుతో ప్రభుత్వం ప్రజలను  మభ్య పెడుతున్నారని అన్నారు. గ్రామలలో మౌళిక సదుపాయాలు లేక ప్రజలు త్రీవ ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముందు మౌళిక సదుపాయాలు ఏర్పటు చేయాలని డిమాండ్ చేశారు. రేషన్ దుకాణంలో కనీస సరుకులు సరపార చేయాటంలోదని అన్నారు. మిషన్ భగిరద పేరుతో ఇంటింటికి మంచి నీరు అన్నా కేసిఆర్, నీళ్ళుపైపులు వేసి వదిలేసారాని, నీరు ఇవ్వనిదే ఓటు కుాడ అడగాను అన్నా కేసిఆర్ గెలిచి సంవత్సరం దగ్గరికి వస్తుందాని గుర్తుచేశారు. ఇప్పుటికైన ప్రభుత్వం ఇంటింటికి త్రాగునీరు ఇవ్వటంలో విఫలం అయిందాని అన్నారు. అందని ద్రాక్షగా మారిన ప్రభుత్వ పథకాలని, చాల మంది రైతులకి రైతు బంధు పథకం డబ్బులు అందక ఆందోళన చెందుతున్నారని అన్నారు. డబుల్ బెడ్ రుాం, దళితులకు ముాడు ఎకరాల భుామి, నిరుద్యోగ భృతి  ఇస్తానాని చేప్పి ప్రజాలను మెాసం చేశారని అన్నారు, ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షులు సింగతి సత్యనారయణ, భట్కాన్ పల్లి సర్పంచ్ హరికృష్ణ, కోఆప్షన్ మెంబర్ చాంద్ పాష, వార్టు మెంబర్స్ సురేష్, శ్యామ్, వంగ రామన్న మరియు గ్రామస్థులు పాల్లోన్నారు.