Thursday, September 26, 2019

మిషన్ భగీరథ పనుల్లో అధికారుల నిర్లక్ష్యం : బుడిమే విజయ్ కుమార్

మిషన్ భగీరథ పనుల్లో అధికారుల నిర్లక్ష్యం : బుడిమే విజయ్ కుమార్ 

మిషన్ భగీరథ పైపు లైన్ లు పరీశీలిస్తున్నా 8వ వార్డ్ సభ్యులు బుడిమే విజయ్ కుమార్ గారు
మంచిర్యాల జిల్లా : బెల్లంపల్లి : ఆకెనపల్లి గ్రామంలో మిషన్ భగీరథ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కురుమ వాడ లో రోడ్డుకి ఇరుప్రక్కల సీసీ రోడ్డును త్రవ్వి పైపు లైన్ లు వేశారు. పైపు లైన్లు కానిస లోతులో వేయలేదు అందువల్ల రోడ్డు పైన పైపులు ఉండడం వల్ల వాహనాలు తొక్కి పగిలితే అందులోకి మురుగు నీరు చేరే అవకాశం ఉంది. రోడ్డు కి ఇరువైపులా సిసి రోడ్డు ను త్రవ్వి పైప్ లైన్ వేశారు రోడ్డు మరమ్మత్తు చేస్తాము అని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించాలని పలు సార్లు కాంట్రాక్టర్ కి చెప్పిన పట్టించుకోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డ్ సభ్యులు బుడిమే విజయ్ కుమార్ కాంగ్రెస్ మండల నాయకులు జంబోజి రాజ్ కుమార్, బండి మల్లేష్, బండ్ల పవన్, గోసుకుల రాయమల్లు, జెట్టి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.