- పోస్టల్ డిపార్ట్మెంట్ లో అవకతవకలు
- కాంపెల్లి ఉదయ్ కాంత్ చొరవతో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సస్పెండ్
ఆకనపల్లి గ్రామంలో గత నాలుగు నెలలుగా ఆసరా పింఛన్లు అందడం లేదని ఉదయ్ కాంత్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి పోస్టల్ ఏ ఎస్పీ మరియు ఐ పి ఓ గారిని విచారించగా ప్రతి నెల పోస్టులు అకౌంట్ నుంచి సంబంధిత వ్యక్తులకు పెన్షన్లు అందినట్లుగా రికార్డు ఉన్నట్లు తెలియజేసినారు లోతుల్లోకి వెళ్లి పరిశీలించి చూడగా సంబంధిత బ్రాంచ్ పోస్టుమాస్టర్ కుమారుడైన మధుకర్ రెడ్డి ప్రతి నెల పీ ఓ టి డి మిషన్ ద్వారా వేలిముద్రలు తీసుకొని రసీదులపై తాను బాకీ ఉన్నట్టుగా రాసి ఇవ్వడం జరిగింది. ఇది గత కొద్దికాలం నుంచి జరుగుతున్న తరుణంలో సంబంధిత అధికారులు ఏ మాత్రం చర్యలు తీసుకోలేదు, వెంటనే ఐ పి ఓ ను తన వెంట ఆకెనపల్లి గ్రామానికి చేరుకొని బ్రాంచ్ పోస్టుమాస్టర్ విచారించగా ఆవిడ నోరు వెళ్ళ బుచ్చుకొన్ని నీళ్లు మింగారు వెంటనే ఐ పి ఓ తనను సస్పెండ్ చేసి అట్టి బాధ్యతను మరో అధికారికి అప్పగించడం జరిగింది. దీనిపై విచారించి అతి త్వరలో ఆకనపెల్లి గ్రామానికి సంబంధించినవారందరికి పెన్షన్ ఇప్పిస్తానని చెప్పి ఐ పి ఓ గారు భరోసా ఇచ్చినారు. ఇటువంటి పరిస్థితి రాకుంట చూస్తానని చెప్పి తాను తెలియజేయడం జరిగింది. ఇట్టి సంఘటనపై కాంపెల్లి ఉదయ్ కాంత్ గారు మాట్లాడుతూ అధికార పార్టీ నిర్లక్ష్యం వల్లే ఇటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి అని చెప్పి వీటిపై విచారణ జరిపించి తక్షణమే ప్రభుత్వ ఉన్నత అధికారులపై ఎంక్వయిరీ నిర్వహించి ఎప్పుడు ఇటువంటి పరిస్థితులు రాకూడాదని అన్నారు. ఇటువంటి అన్యాయం ఎవరికి జరిగినా నియోజకవర్గ ప్రజల పక్షాన తాను నిలబడతాను అని చెప్పి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆకనపల్లి సర్పంచ్, ఉప సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజ్ కుమార్ ఇతరులు పాల్గొన్నారు.
- ఉన్నత అధికారులతో విచారణ జరపాలని కాంపెల్లి ఉదమ్ కాంత్


