- ప్రణయ్ హత్యపై ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ని ఏర్పాటు చేసి నిందితులను వెంటనే శిక్షించాలి.
- నాస్తిక్ రాకేష్, ప్రధాన కార్యదర్శి, సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్. . ఈ రోజు వల్భపూర్ గ్రామంలో జరిగిన సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా కమిటీ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాస్తిక్ రాకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతో సంచలనం కలిగించిన ఘటణ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ కుల హత్య అనదరికి తెలిసినదే దానిలో ప్రదాన నిందితులు అయిన మారుతిరావుకు, మిగతా వారికి ఈరోజు బెయిల్ రావడం సిగ్గుచేటు అన్నారు. దేశంలో కులం పేరుతో, మతం పేరుతో హత్యలు పెరిగిపోతున్న క్రమంలో ప్రభుత్వమే ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక హత్యలపై ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ లని ఏర్పాటు చేసి నిందితులకు తక్షణమే శిక్ష పడేలా చేయాలని లేదంటె పాలకులపై న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందన్నారు. అలా చేయకపోతె నిందితులు బెయిల్ మీద బయటకు వచ్చి సాక్ష్యాలను తారుమారు చేయడం, డబ్బులతో బాధితులని కొనడానికి కానీ, కిరాయి గుండాలతో బెదిరించి కేసులు వాపస్ తీసుకునేలా చేస్తున్నారు. కాబట్టి అలాంటి అవకాశం రాకుండా శిక్షలు వెంటనే పడేలా ప్రభుత్వమే చొరవ తీసుకోవాలని అన్నారు.ప్రణయ్ నిందితులకు యావజ్జివ శిక్ష పడేలా ప్రభుత్వమే చర్య తీసుకోవాలని లేకపోతే హత్యలు చేస్తే కూడా బెయిల్ మీద బయటకు రావచ్చు అనే చెడు సందేశం సమాజానికి ఇచ్చిన వారు అవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ssf రాష్ట్ర నాయకులు గొర్రె. శ్రీనివాస్, శివకుమార్ నాస్తిక్, అచ్యుత్ రాజ్, రాజేందర్, అగ్నితేజ తదితరులు పాల్గొన్నారు.
Saturday, April 27, 2019
ప్రణయ్ హత్యపై ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ని ఏర్పాటు చేసి నిందితులను వెంటనే శిక్షించాలి. నాస్తిక్ రాకేష్, ప్రధాన కార్యదర్శి, సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్.
Friday, April 12, 2019
సిల్వర్ పథకాన్ని గెలుపోందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్
![]() |
| సిల్వర్ పథకాంతోపాటు, ప్రశంసా పత్రం అందజేస్తున్న ప్రముఖులు |
- చిల్డ్రన్స్ కేటగిరి లో సిల్వర్ పథకాన్ని గెలుచుకున్న మన మంచిర్యాల జిల్లా వాసి
- గతంలో జాతీయ, రాష్ర్టస్థాయి అవార్టులను పోందిన జవాజి కుమారస్వామి గారు
- ఫోటో & విడియోగ్రాఫీలో తనశైలే వేరు.. తన నైపుణ్యనికి ఎంతో మంది ప్రముఖులు ప్రశంసలు
Thursday, April 11, 2019
ఘనంగా జ్యోతిబా ఫూలే 193వ జయంతి వేడుకలు - పెరియార్ ఆలోచన వేదిక
- ఏప్రిల్ 11 జ్యోతిబా ఫూలే జయంతి
- ఘనంగా నిర్వహించిన జయంతి వేడుకలు
- పెరియార్ ఆలోచన వేదిక ఆధ్వర్యంలో
బెల్లంపల్లిలోని స్థానిక ఒకటోవ పోలిస్ట్ స్టేషన్ వద్ద ఉన్న పెరియార్ భవన్ లో మహాత్మ జ్యోతిబాఫూలే జయంతిని పెరియార్ ఆలోచన వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాటం జరిగింది. ఈ కార్యక్రమంలో పెరియార్ ఆలోచన వేదిక సభ్యులు, గోడిసెల శ్రీహరి, అక్కు ఉమ - క్రిష్ణ, దుాబాసి రవి, లింగంపెల్లి రాజన్న, రంగ ప్రశాంత్ తో పాటు తదితరులు పాల్లోన్నారు
పుాలే చరిత్ర :-
ఆధునిక యుగ నిర్మాతగా, దార్శనికునిగా జ్యోతిబా ఫూలే వ్యక్తిత్వం సమాజాన్ని ప్రభావితం చేసింది. భవిష్యత్ మార్గాన్ని నిర్దేశించింది. సమాజంలో వేళ్ళూనుకున్న ఛాందస విధానాలను ప్రశ్నిస్తూ వంచన విధానాలను ఎత్తి చూపటంలో సఫలీకృతు డయ్యారు. అగ్రకుల అణచివేతలను, అధర్మ నీతులను ఏకరువు పెట్టారు. బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరచడానికి శాయశక్తులా కృషిచేశారు. విప్లవాత్మక ఆలోచనలను, యదార్థ జీవన చిత్రాలను సామాన్య ప్రజలకు పరిచయం చేశారు. సమాజ వికాసానికి అడ్డంకిగా ఉన్న బ్రాహ్మణవాదాన్ని వ్యతిరేకించి అదే అగ్రవర్ణాలలో నిరాదరణకు గురైన మహిళల కోసం ఆశ్రమాన్ని స్థాపించి వారికి బాసటగా నిలిచారు. సనాతన వాదాన్ని ప్రచారం చేసే అగ్రవర్ణాలవారు శూద్ర, అతిశూద్రులను ఏవిధంగా దోచుకున్నదీ వివరించారు. మెజార్టీ మత సంప్రదాయంలో భాగమైన దశావతారాలకు చరమగీతం పాడుతూ సమకాలీన సందర్భాలను చెబుతూ చారిత్రక సత్యాలతో ''గులాంగిరీ''ని రచించారు. 1873లో వెలువడిన ఈ రచనలో మొత్తం 16 భాగాలున్నాయి. ప్రతి భాగంలోనూ సామాజిక కోణం ఉట్టిపడేట్లు రచన సాగింది. మూఢనమ్మకాల వైపు ప్రజల ఆలోచనలను ప్రభావితం చేసిన ఇతిహాసాలను కాలాను గుణంగా వివరించి గతం తాలూకూ వాస్తవాలను జోడించ టంలో సఫలీకృతులయ్యారు ఫూలే. రాజుల మధ్య జరిగిన యుద్ధాలలో పరాజితులను రాక్షసులుగా, గెలిచిన వారిని దేవతలుగా చిత్రిస్తూ రాసిన పుస్తకాలు ఆకాశం నుంచి భూమ్మీద పడ్డాయనే అంధ విశ్వాసపు మోసపూరిత ముసుగులను తొలగించిన ధీశాలి ఆయన. 1882లో 'షేత్ కార్యాచ అసుద్' (తెలుగులో సేద్యగాని చర్నాకోలు) అనే పుస్తకాన్ని ప్రచురించారు. శూద్ర రైతాంగాన్ని బ్రిటీష్, అగ్రవర్ణాల వారు ఉమ్మడిగా దోచుకుంటున్న తీరు ఆ రచనలో సాగింది. నూతన వ్యవసాయ పద్ధతుల్లో పంట పండించి శాస్త్రీయంగా వ్యవసాయం చేసే విధానానికి సంబంధించి రైతులకు శిక్షణనిచ్చారు. 1882 నుంచే రైతులకు సంబంధించిన ప్రజా బహిరంగ సభలను నిర్వహించారు. రైతు సమస్యలపై విస్తృతమైన చర్చలు జరిపిన ఈ సభలు దాదాపు 83 జరిగాయి. ''రైతుల చిట్టా'' పేరుతో ప్రచురితమైన పుస్తకం ఫూలే ఆలోచనల్లోని అత్యున్నత స్థాయిని తెలియజేస్తుంది. ''తృతీయ రత్న'' నాటిక సామాన్య జనంలో చిరస్థాయిగా నిలిచి పోయింది. సామాజిక పురోభివృద్ధి కాంక్షే ఆయన ప్రతి అడుగులోనూ ప్రతిబింబించింది. మద్యం షాపులు ఏర్పాటు చేయటాన్ని, మద్యం మత్తులో కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకోవటాన్ని వ్యతిరేకించారు. 1873లో ''సత్యశోధక్'' సమాజాన్ని స్థాపించారు. చాతుర్వర్ణ విధానానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించారు. రైతుల, కార్మికుల సమస్యలపై విస్తృతంగా పనిచేయటంలోనూ, మానవీయ విలువల్ని బోధిస్తూ యదార్థ మార్గాలను చూపడంలోనూ దీని పాత్ర కీలకంగా నిలిచింది. సత్యాగ్రహ ఉద్యమాన్ని మొట్టమొదట ఆచరణలో పెట్టిన మహనీయుడు జ్యోతీబా. స్త్రీలు, రైతులు, కార్మికులు, శ్రామికులు, శూద్ర, అతిశూద్ర ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులను ఆలోచించి సమస్యల పరిష్కారానికి సత్యాగ్రహోద్యమం అనే ప్రతిఘటనోద్యమాన్ని ఎన్నడో ఆచరించి చూపారు. స్త్రీలకు నిర్బంధ విద్యా విధానాన్ని ప్రకటించే వరకూ సాగించిన ఉద్యమంలో జ్యోతిబా పాత్ర గణనీయమైంది. స్త్రీ స్వేచ్ఛను కాంక్షించిన వారిలో ఫూలే అగ్రగణ్యుడు. ఆంక్షల వలయంలో చిక్కుబడి ఉన్న స్త్రీకి అక్షరాలను నేర్పి జ్ఞాన జ్యోతుల్ని వెలిగించిన ఘనత జ్యోతీబా ఫూలేకే దక్కుతుంది. స్త్రీల విద్య కోసం 1848లో బాలికా విద్యా పాఠశాలను స్థాపించారు. మహిళా ఉపాధ్యాయురాలి అవసరాన్ని గుర్తించి తన భార్యకు అక్షరాభ్యాసం చేసి పాఠాలు చెప్పించిన మహోన్నత మూర్తి ఆయన. మన దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా కీర్తింపబడే ఘనతను తన భార్యకు అందించిన సమానత్వ స్థాపకుడాయన. చదువు జ్ఞానాన్ని ఇస్తుందని, జ్ఞానం సంస్కారాన్ని ఇస్తుందని నమ్మిన వాడు ఫూలే. విద్యారంగంలో ఆయన చేస్తున్న విశిష్ట కృషిని గౌరవిస్తూ 1852లో బ్రిటీష్ ప్రభుత్వం ఆయనను రెండు దుశ్శాలువాలతో సత్కరించింది. అంతటి గౌరవాన్ని బ్రిటీష్ పాలకుల నుంచి అందుకున్న మొదటి, ఆఖరి వ్యక్తి కూడా ఫూలేనే. చదువుపై ఫూలేకి ఉన్న నమ్మకం ఎంత ధృఢమైందంటే రావు బహద్దూర్ హరిలాల్ జీ ప్రభువైన డ్యూక్ ఆఫ్ కనాట్ గౌరవార్థం ఇచ్చిన విందుకు సాధారణ ముతక దుస్తులు, పైన వేసుకునే అంగ వస్త్రం, కుట్టిన పాత చెప్పులు ధరించి విందు సమావేశానికి హాజరయ్యారు. రాణి మన్ననలు పొందటానికి దేశం అత్యంత సుభిక్షంగా ఉందని ముఖ్యులు చెబుతుండగా జ్యోతి బా కల్పించుకొని ఇక్కడున్న విధంగానే దేశమంతా లేదు. వాస్తవమైన దేశాన్ని చూడదలిస్తే దయచేసి గ్రామాల్లోకి వెళ్ళి రైతుల దారుణమైన జీవన స్థితిగతులను పరిశీలించండి. అధిక సంఖ్యాకులు దుర్భరమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని ఘనత వహించిన మహారాణి విక్టోరియాకు తెలియజేయండి. నిమ్నకులాల్లో విద్య ద్వారా మాత్రమే మార్పును తీసుకురావటం సాధ్యమవుతుంది. విద్యనందించట విద్యనందించటం ద్వారా అపారమైన జ్ఞాన సంపదను పొందుతారని మీరామెకు తెలియజేయండి అని విన్నవించారు. ''విద్య లేకపోతే జ్ఞానం నశిస్తుంది. జ్ఞానం లేకపోతే అభివృద్ధి లోపిస్తుంది. అభివృద్ధి లేకపోతే సంపద నశిస్తుంది'' అని గాఢంగా విశ్వసించారు. ఇంతటి మహోన్నత భావాలను, దూరదృష్టిని కలిగి ఉన్నారు కాబట్టే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ తన గురువుల్లో ఒకరిగా ఫూలేను ప్రకటించుకున్నారు. కొత్త సమీకరణలు, నవీన ఆలోచనలు జ్యోతిబాలోని విభిన్న కోణాలను స్పృశించటంలో ముందడుగు వేశాయి. ఆయనలోని ఎన్నో అభ్యుదయ భావాలను బయట ప్రపంచానికి ఎలుగెత్తి చాటాయి. బ్రాహ్మణవాదాన్ని వ్యతిరేకించిన ఫూలే అదే వర్ణంలోని స్త్రీకి పుట్టిన బాలుణ్ణి దత్తత తీసుకొని డాక్టర్‌ను చేశారు. ప్రస్తుతం బ్రాహ్మణవాదం పెచ్చరిల్లుతున్నది. తన మతోన్మాదాన్ని, మత పెత్తనాన్ని కొనసాగిస్తోంది. ఈ విపరీత ధోరణులు ఆధునిక వ్యవస్థను కబళించక ముందే, ప్రజాస్వామ్య పునాదులను పెకిలించక ముందే సామాజిక, దార్శనికుల అడుగు జాడలను అనుసరించాల్సిన అవసరం ఉంది. నిరాకరింపబడుతున్న సమానత్వాన్ని పొందేందుకూ, దూరం చేస్తున్న రిజర్వేషన్లను కొనసాగించుకునేందుకూ, వాస్తవాలను గుర్తించేందుకూ అభ్యదయ మార్గాలను అనుసరించాల్సిన సమయం ఆసన్నమైంది. చరిత్రను విశ్లేషిస్తూ ఆదర్శవంతమైన భవిష్యత్ ప్రణాళికలను ముందుండి నడిపించుకునే తెగువ, సాహసం ప్రదర్శించాలి. అప్పుడే ఫూలే కలలుగన్న సమసమాజాన్ని చూడగలం. ఆధునిక రథసారథులు చూపిన సర్వోన్నత శిఖరాలను చేరగలం. స్త్రీలకు నిర్బంధ విద్యా విధానాన్ని ప్రకటించే వరకూ సాగించిన ఉద్యమంలో జ్యోతిబా పాత్ర గణనీయమైంది.''విద్య లేకపోతే జ్ఞానం నశిస్తుంది. జ్ఞానం లేకపోతే అభివృద్ధి లోపిస్తుంది. అభివృద్ధి లేకపోతే సంపద నశిస్తుంది'' అని గాఢంగా విశ్వసించారు.
Monday, April 8, 2019
చార్వాక రామకృష్ణ 12వ వర్థంతి సభను విజయవంతం చేయాండి : పెరియార్ ఆలోచన వేదిక
- పెరియార్ ఆలోచన వేదిక ఆధ్వర్యంలో కరపత్రం విడుదలు
- చార్వాక రామకృష్ణ 12వ వర్థంతి సభను విజయవంతం చేయాలని పిలుపు
- నాస్తిక ఉద్యామానికి చార్వాక రామకృష్ణ కృషి ఎనలేనిది : కన్వీనర్ గోడిసెల శ్రీహరి

కరపత్రం విడుదల చేస్తున్న పెరియార్ ఆలోచన వేదిక సభ్యులు
Tuesday, April 2, 2019
పెరియార్ ఇ.వి.రామస్వామి జీవిత చరిత్ర
పెరియార్ ఇ.వి.రామస్వామి జీవిత చరిత్ర
- జననం,రాజకీయం ప్రవేశం, ఉద్యమాలు
- పెరియార్ నిర్వహించిన పోరాటాలు
- పెరియర్ రామస్వామి పిల్లల పెంపకం ఎలా ఉండాలో చక్కగా సూచించారు
- రామాయణం గురించి పెరియార్ ఏం అన్నారు..?
- మరియు మరణం
- 👉https://youtu.be/o59iHON4yJU తెలుగు సినిమాలో పెరియార్ పుార్తి జీవిత చిత్రం
- 👉 జననం, రాజకీయం ప్రవేశం, ఉద్యమాలు మరియు మరణం వేలాది సంవత్సరాల క్రితం ఎలాంటి శ్రమ లేకుండా కూర్చొని తినడానికి , శ్రమజీవుల మీద ఆధిపత్యం చేయడానికి కులాలను , పుక్కిటి పురాణాలను పుట్టించి కర్మ, ధర్మ సిద్దాంతాలతో రాజ్యమేలుతున్న బ్రాహ్మణీయ అగ్రకుల శక్తుల ఆటకట్టించేందుకై ఎన్నో ఉధ్యమాలను నిర్మించిన పెరియార్ 1879 సెప్టంబరు 17వ తేదీన తమిళనాడులోని ఈరోడు పట్టణంలో జన్మించారు. ఈయన తండ్రి వెంకటప్పనాయకర్, తల్లి చిన్నతాయమ్మాళ్. పెరియార్ అసలు పేరు ఇ.వి.రామస్వామి. పెరియార్ అంటే తమిళంలో రుషి, జ్ఞాని అని అర్థం. పెరియార్ సంపన్న కుటుంబంలో పెట్టి పెరిగారు. పాతికేళ్ల ప్రాయంలోనే తన తండ్రికి తెలియకుండా అప్పుచేసి భూమి కొనుగోలు చేశాడని పెరియార్ ను తండ్రి మందలించడంతో బాధపడి కుటుంబం వదిలి సన్యాసిగా మారిపోయారు. అయితే ఆయన దేశంలోని ప్రధాన నగరాలన్నీ తిరిగి లోకజ్ఞానం సంపాదించారు. తర్వాత కాశీ లో బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని, తనకు జరిగిన అవమానాన్ని భరించలేక ఆకలితో దిక్కుతోచక బికారిగా తిరుగుతున్న పెరియార్ ఆచూకీని తండ్రి కనుగొని స్వయంగా ఇంటికి తీసుకెళ్లి వ్యాపార బాధ్యతలను అప్పగించారు. ముప్పై ఏళ్ల ప్రాయంలోనే కాంగ్రేస్ పార్టీ పట్ల ఆసక్తి చూపసాగారు. తొమ్మిదేళ్ల ప్రాయంలోనే భర్త చనిపోయి వితంతువుగా ఉన్న తన అక్క కూతురికి కుటుంబంలో అందరూ వ్యతిరేకిస్తున్నా రహస్యంగా పెళ్లి జరిపించారు. 1911లో పెరియార్ తండ్రి మరణించారు. పెరియార్ స్వయంకృషి , నీతి నిజాయితి , సేవాభావం మూలంగా ప్రజల చేత నీరాజనాలందుకొని ఇరవై ఎనిమిదేళ్ల వయసులోనే 1917 లో ఈరోడు నగరపాలక సంస్థకు చైర్మన్ గా ఎన్నికయ్యారు. 1919లో కాంగ్రేస్ పార్టీలో చేరే నాటికే జిల్లాలోని 29 గౌరవ పదవులు పొందాడంటే ఆయనపట్ల ప్రజల అభిమానం ఎంతటిదో ఊహించవచ్చు. పెరియార్ నాయకత్వం లేనిదే కాంగ్రేస్ పార్టీ మనుగడ లేదన్న వాతావరణం ఏర్పడిపోయింది. పార్టీ నాయకత్వమంతా బ్రాహ్మణుల చెప్పుచేతల్లో ఉందని వారిలో ఏ ఒక్కరూ మినహాయింపు లేకుండా నీఛ , నికృష్ట వర్ణాశ్రమ వ్యవస్థను బలంగా స్థిరపరచాలన్న కుటిల లక్ష్యం కలవారని పెరియార్ తెలుసుకున్నారు. ఈరోడు చైర్మన్ గా ఉన్నపుడు ప్లేగు వ్యాధి సోకి వందలమంది ప్రజలు మరణించారు. జనం భయపడి శవాలను ఎక్కడపడితే అక్కడ వదిలి భయంతో పారిపోయారు.ఈవ్యాధికి ఇంజక్షన్లు వేయించుకుంటే అమ్మవారి ( దేవత )ఆగ్రహానికి గురికావలసి వస్తుందన్న మూఢనమ్మకంతో జనం భయపడిపోయారు. పెరియార్ సహచరుతో కలసి శవాలను తన బుజాలపై వేసుకొని శివారు ప్రాంతాల్లో పూడ్పించారు. మనదేశంలో మొట్ట మొదటి సారిగా పట్టణ ప్రాంతాలకు కుళాయిద్వారా మంచినీటి సరఫరా చేయించిన ఘనత పెరియార్కే దక్కింది. కులప్రాతిపదికన విధ్య , ఉద్యోగ రంగాలలో అణగారిన కులాలకు రిజర్వేషన్లు కల్పించాలని పార్టీ మహాసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని బ్రాహ్మణ వర్గమంతా వ్యతిరేకించి కొట్టివేయించింది. దీనికి నిరసనగా 29 గౌరవపదవులకు రాజీనామా చేశారుపెరియార్. కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లాలోని వైక్కోం దేవాళయాని వెళ్లే దారుల్లో దళితులు నడవరాదంటూ శాసనాలుండేవి. ఇందుకు నిరసిస్తూ పెరియార్ పెద్ద పోరాటం నిర్వహించారు. దారుల్లో పందులు , గాడిదలు, పలురకాల జంతువులు నడుస్తున్నాయ్... సాటి మనుషులు నడవటం నిషేధమా... ఇది మానవ హక్కుల ఉళ్లంఘన అంటూ పెరియార్ ఆవీధుల్లో దళితుల్ని అంటరానివారిని నడిపించి చరిత్రని తిరగరాశారు. అలాగే దేవదాసీ దురాచారంపై చట్టాన్ని తీసుకరావాలని పోరాటంచేశారు. దేవాలయంలో ఒక కులానికి చెందిన స్త్రీలు దేవునికి దాసీలుగా నాట్యమాడుతూ రాతి బొమ్మలను రంజింపజేయాలన్న దుష్ట సాంప్రదాయం మూలంగా రెండు వేల సంవత్సరాలుగా స్త్రీలు వ్యభిచార వ్రృత్తిలోకి బలంగా నెట్టబడుతూ వచ్చారని పెరియార్ పోరాటం చేశారు.తన సామాజిక లక్ష్యాలను,చైతన్యాన్ని ప్రజల ముందుకు తీసుకువచ్చేందుకు ఒక పత్రిక ఉండవలసిన అవసరాన్ని గుర్తించి కుడిఅరసు అనే పత్రికను 1925 మే రెండున తొలి సంచికను కాంచీపురంలో ఆవిష్కరించారు.పెరియార్,తన భార్య పలువురు ఉధ్యమకారులతో సింగపూర్,మలేషియా,యూరప్,ఫ్రెంచ్,రష్యా తదితర దేశాల్లో విస్త్రృతంగా ప్రచారాన్ని చేపట్టి సత్యాన్వేషకుల సంఘం,ఉదార ఆలోచనాపరుల సంఘం,హేతువాద సంఘం,దేవుడులేని వాళ్ళ సంఘాలు స్థాపించారు.బాల్య వివాహాలపై పోరాటం చేస్తూ స్త్రీ జాతిని అవమానిస్తున్న బ్రాహ్మణేతరులకు అర్థంకాని మంత్రాలు తంత్రాలతో కూడిన హిందూ పెళ్ళి సాంప్రదాయాలను పాటించకుండా ,పురోహితున్ని పిలవకుండా పూల దండలు మార్చుకొని పెళ్ళిచేసుకొనే స్వాభిమాన పెళ్ళి విధానాన్ని పెరియార్ పరిచయం చేశారు.
- 👉 పెరియార్ నిర్వహించిన పోరాటాలు
1.మనదేశంలో మొట్ట మొదటి సారిగా పట్టణ ప్రాంతాలకు కుళాయిద్వారా మంచినీటి సరఫరా చేయించిన ఘనత పెరియార్కే దక్కింది.
2.పెరియార్ స్వయంకృషి , నీతి నిజాయితి , సేవాభావం మూలంగా ప్రజల చేత నీరాజనాలందుకొని ఇరవై ఎనిమిదేళ్ల వయసులోనే 1917 లో ఈరోడు నగరపాలక సంస్థకు చైర్మన్ గా ఎన్నికయ్యారు. 1919లో కాంగ్రేస్ పార్టీలో చేరే నాటికే జిల్లాలోని 29 గౌరవ పదవులు పొందాడంటే ఆయనపట్ల ప్రజల అభిమానం ఎంతటిదో ఊహించవచ్చు.
3.కులప్రాతిపదికన విధ్య , ఉద్యోగ రంగాలలో అణగారిన కులాలకు రిజర్వేషన్లు కల్పించాలని పార్టీ మహాసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని బ్రాహ్మణ వర్గమంతా వ్యతిరేకించి కొట్టివేయించింది. దీనికి నిరసనగా 29 గౌరవపదవులకు రాజీనామా చేశారుపెరియార్.
4.కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లాలోని వైక్కోం దేవాళయాని వెళ్లే దారుల్లో దళితులు నడవరాదంటూ శాసనాలుండేవి. ఇందుకు నిరసిస్తూ పెరియార్ పెద్ద పోరాటం నిర్వహించారు. దారుల్లో పందులు , గాడిదలు, పలురకాల జంతువులు నడుస్తున్నాయ్... సాటి మనుషులు నడవటం నిషేధమా... ఇది మానవ హక్కుల ఉళ్లంఘన అంటూ పెరియార్ ఆవీధుల్లో దళితుల్ని అంటరానివారిని నడిపించి చరిత్రని తిరగరాశారు.
5.అలాగే దేవదాసీ దురాచారంపై చట్టాన్ని తీసుకరావాలని పోరాటంచేశారు. దేవాలయంలో ఒక కులానికి చెందిన స్త్రీలు దేవునికి దాసీలుగా నాట్యమాడుతూ రాతి బొమ్మలను రంజింపజేయాలన్న దుష్ట సాంప్రదాయం మూలంగా రెండు వేల సంవత్సరాలుగా స్త్రీలు వ్యభిచార వ్రృత్తిలోకి బలంగా నెట్టబడుతూ వచ్చారని పెరియార్ పోరాటం చేశారు.
6. బాల్య వివాహాలపై పోరాటం చేస్తూ స్త్రీ జాతిని అవమానిస్తున్న బ్రాహ్మణేతరులకు అర్థంకాని మంత్రాలు తంత్రాలతో కూడిన హిందూ పెళ్ళి సాంప్రదాయాలను పాటించకుండా ,పురోహితున్ని పిలవకుండా పూల దండలు మార్చుకొని పెళ్ళిచేసుకొనే స్వాభిమాన పెళ్ళి విధానాన్ని పెరియార్ పరిచయం చేశారు.
- 👉 పెరియర్ రామస్వామి పిల్లల పెంపకం ఎలా ఉండాలో చక్కగా సూచించారు
" మీ చెప్పు చేతల్లో పిల్లల్ని పెంచాలని, మీ మూర్ఖపు, మూఢాచారపు భావాల్ని వారికి అంటగట్టకండి !
దేవుడు వున్నాడని గుళ్ళూ,గోపురాలు తిప్పించి , వారిచే దండాలు, పూజలు చేయించకండి !!
పిల్లల చదువు కోసం మీరు ఎంతైనా కష్టపడండి , అంతేగానీ అన్ని కష్టాల్ని ఆ కనిపించని దేవుడే తీర్చేస్తాడని , పిల్లలకి లేని పోని భ్రమలు మాత్రం కల్పించి చెప్పకండి !!!
దేవుడే వున్నడని మీరు గాఢంగా నమ్మిస్తే, మీ పిల్లల్లో స్వంత వ్యక్తిత్వ వికాసం గానీ, స్వంత ఆలోచనా విధానం గానీ వుండదు - అన్నిటికీ ఆ దేవుడు మీదే భారం వేసే బలహీనులై పోతారు !!!!
పిల్లల్లో మేధావితనం పెరగాలి గానీ, భక్తి భావన పెరిగినా ప్రయోజనం లేదు.
నిజానికి ---
దేవుడు వున్నాడా లేడా అని నిర్ణయించుకో వలసింది మీ పిల్లలే , ఉన్నాడు అనే ఓ అబద్దమైన నమ్మకాన్ని మాత్రం మీరు కలిగించకండి !
అప్పుడే మీ పిల్లలకు మీరు మేలు చేసినవారౌతారు !!
స్వంత వ్యక్తిత్వం స్వంత మనస్తత్వం, స్వంత ఆలోచనా విధానం లేని వాళ్ళు యీ భూమ్మీద చాలా మంది వున్నారు -- వారిలో మీ పిల్లలు ఒకరిగా వుండ కూడదు -- ఆ మందలో కల్సిపోయి అసలే వుండ కూడదు !!
మీ పిల్లలకు మీరు మొదట్నుంచీ నేర్ప వలసింది మంచి వ్యక్తిత్వం, మూఢ భక్తిత్వం మాత్రం కాదు !!!
👉 పుట్టినప్పుడు మీరు ఏ మతం లో పుట్టారో మీకు తెలుస్తుందా..? పెరుగుతున్న కొద్దీ మతం , కులం అన్న విషయాలు ఇటు తల్లిదండ్రులు , అటు సమాజం నూరిపోస్తుంది. చదువుకుని ఉద్యోగంలో స్థిరపడేవరకు కూడా మనం తల్లిదండ్రులు సమాజం నూరిపోసిన కులమత భావజాలం లోనే బతుకుతాము. 25-30 ఏళ్లు దాటాక ప్రతి వ్యక్తికి ఒక స్థిత ప్రజ్ఞత వస్తుంది. అప్పుడు చిన్నప్పటి నుండి నూరిపోసిన మూర్ఖపు భావాలన్నీ పటాపంచలు అయి మనదైన ఒక ప్రత్యేక వ్యక్తిత్వం , ఒక ప్రత్యేక దృక్పథం ఏర్పడుతుంది. ఆ దృక్పథమే మనల్ని సరైన లక్ష్యం దిశగా నడిపిస్తుంది.
- 👉 రామాయణం గురించి పెరియార్ ఏం అన్నారు..?(రామాయణం-యదార్థ పరిశీలన పుస్తకం నుండి)"
తోలి పలుకు :-
పెరియార్ .వి రామస్వామి గారు రాసిన "రామాయణం-(యదార్థ పరిశీలన)" పుస్తకంలోని వారి మాటలు చదవండీ...
రామయాణానికి ఏ చరిత్ర ఆధారంలేదు...
అదోక కల్పిత రచన ,దాని ప్రకారం రాముడు తమిళుడు కాడు.తమిళదేశానికి సంబంధించినవాడుా కాదు..అతను ఉత్తర భారతం వాడు.
అతను చంపిన రావణుడు లంకకు రాజు,లంక అంటే దక్షిణ తమిళనాడు...
కించిత్తు అయిన తమిళ సంస్కృతి (తిరుక్కురల్ సంస్కృతి)రాముడిలో లేదు.అతనికి లాగానే అతని భార్యకుాడా తమిళ గుణగణాలు లేని ఉత్తర భారత మవిషి.
.తమిళనాడుకు చెందిన ఆడ,మగవాళ్లను కోతుల్లాగ,రాక్షసుల్లాగ అసహ్యంగా చిత్రీకరించారు..
రామయణం యుద్థంలో ఉత్తరభారతానికి సంబంధించిన వాడెవడుా బ్రామ్హడు లేక ఏ ఆర్యుడు (దేవుడు)ప్రాణాన్ని పోగోట్టుకోలేదు.
.ఓక ఆర్యుడి కుర్రాడు జబ్బు వచ్చి చచ్చాడని వాడి కోసం ఓక శుాద్రుడు తన ప్రాణాన్ని పణంగా చెల్లించాడు.యుద్ధంలో ప్రాణాలు పోగేట్టుకున్న వాళ్లందరుా తమిళులు మాత్రమే.వాళ్లనే రాక్షసులన్నారు..
రావణుడు రాముడి భార్య సీతను ఎతితుకెళ్లాడు,ఎందుకంటే అతని చెల్లెలి అవయవాల్లి కోసి కురుాపిని చేశాడు.రావణుడు చేసిన ఈ పనికి లంకనెందుకు తగల బెట్టాలి..?లంక వాసుల్ని ఎందుకు చంపాలి ? ఈ కథ యెుక్క ఉద్దేశ్యం తమిళుల్ని నీచంగా చుాయించటం. తమిళనాడులో ఇంకా ఈ కథను గౌరవించటం అంటే ఆ ప్రజల స్వాభిమానాన్ని దెబ్బతీయటం,కించపరచటముా అవుతుంది..
రాముడులోగాని సీతలోగాని దేవాంశమైనది కుాడా ఏమీ లేదు.
స్వతంత్రంలాంటిది వచ్చిందని అనుకుంటున్న తరువాత తెల్లవాళ్ల విగ్రహాల్ని తీసేశారు.వాళ్ల పేర్లున్న స్తలాల్ని మార్చి వాటికి బదులు భారతీయుల పేర్లు పెట్టారు.అట్లాగే తమిళుల గౌరవాన్ని కించపరచే ఆర్యదేవుళ్లను .వాటి ప్రాముక్యతను తీసి అవతల పారేయాలి.నరనరాల్లో ద్రావిడ రక్తం పారుతున్న ప్రతి తమిళుడు ఈ పనిచేయించటం తన కర్తవ్యంగా భావించి ప్రతిగ్న చేయాల్సి ఉంది
డిసెంబరు 19 న చెన్నాపట్నం త్యాగరాయనగర్ లో ఆలోచనా పరులమండలిలో జరిపిన సదస్సులో తన చివరి సందేశాన్నిస్తూ వేదికపైనే కుప్పకూలిపోయారు పెరియార్.వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించి ఆతర్వాత వేలూరు సిఎంసి ఆసుపత్రిలో చేర్పించారు. డిసెంబరు 23న వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆరాత్రి 11గంటలకు స్పృహకోల్పోయి కోమాలోకి వెళ్లి మరునాడు 24 ఉదయం 7-40 నిమిషాలకు మరణించారు. పీడిత ప్రజల మానాభిమానాల పరిరక్షణకోసం , వారి హక్కులకోసం సుదీర్ఘకాలం పోరాటం చేస్తూ తిట్లను, నిందల్ని , చెప్పుల దెబ్బల్ని సైతం ఎదుర్కొన్న పెరియార్ , లక్షలాది గుండెల్లో నిరుపమాన స్థానాన్ని సంపాదించుకొని మరణం లేని అమరజీవిగా నిలిచిపోయారు. మతతత్వ విషం ఎల్లెడలా వ్యాపిస్తున్న తరుణంలో పెరియార్ జీవితం, పోరాటాలు ఎంతగానో స్పూర్తిదాయకం.పెరియార్ E.V రామస్వామి గారి పోరాటాలు
- 👉మరణం:-

👉 సేకరణ : రంగ ప్రశాంత్
అణిచివేయబడ్డ ప్రజల బాధల స్వరాలే అతనినాదం ' పాటల పరివ్రాజకుడు డప్పు ప్రకాష్ ' ....
అణిచివేయబడ్డ ప్రజల బాధల స్వరాలే అతనినాదం
' పాటల పరివ్రాజకుడు డప్పు ప్రకాష్ ' ....
నేడు డప్పు ప్రకాష్ అన్న
- మహాపరినిర్వాణం ( 2-4-2017 ) చెందిన సందర్భం గా యాదిలో .....
https://youtu.be/rWHgr2kJgkI
అతని గొంతు ఉక్కు కంఠం
అతని పాట నీలి విప్లవం
అతని డప్పు మనువాదుల
గుండెల్లో దిగబడ్డ గునపం
అతను పాటల సంచారి
అంబేద్కర్ ఆశయ బాటసారి
కాన్షీరాం కలల కార్యకర్త
దళిత ఉద్యమాల ఊపిరి సలపని
పోరాటాల పాట
అతనొక మహాగాయకుడు
పాటల నుండి మంటలు పుట్టించగలడు
మనిషిని మేల్కొల్పగలడు
మానవత్వాన్ని తట్టి లేపగలడు
కలేకూరి ధిక్కార కలానికి
శబ్ధరూపం డప్పు ప్రకాష్
తెనాలి పట్టణంలో ఒక మిత్రుని ఇంటికి వచ్చిన డప్పు ప్రకాష్ 2017 ఏప్రిల్ 2 సూమారు రాత్రి 9 గంటల సమయంలో బయటకు వచ్చి ఒక కొట్టు అరుగు మీద కుప్పకూలి తుది శ్వాస విడిచాడు.
ఆ విధంగా ఒక పాటల సంచారి నడక అగిపోయింది. ఈ వార్త మిత్రుల ద్వారా మీడియాకు చేరి తుదకు రాష్ర్టంలోని ఉద్యమ కారులకు , అతనితో పరిచయం ఉన్న మిత్రులకు దావానలంలా చేరుకుంది. ఈ వార్త అందుకున్న వేంటనే రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న మిత్రులందరూ
తెనాలికి చేరుకుని అంతిమ సంస్కారాలను ఘనంగా నిర్వహించారు. పత్రికల్లో వచ్చినట్లు అతను అనాధగా చనిపోలేదు . ఆకస్మాతుగా ఒంటరిగా చనిపోయినా ఉద్యమ సహచరుల ఘనమైన నివాళుల మధ్య హుందాగా ఈ లోకం నుండి సాగనంప బడ్డాడు. సామాజిక ఉద్యమ నేత , సీనియర్ న్యాయవాది వై.కోటేశ్వర్రావు, హక్కుల ఉద్యమనేత జి.యస్ .నాగేశ్వర్రావు,సీనియర్ న్యాయవాదులు, ఉద్యమ నేతలు పి.పి.ఆర్ ., వి.సాగర్ ,అమర్తలూరి రత్న ప్రసాద్ ,దళిత నాయకులు నందేటి ప్రభాకర్ , సిర్రా భగత్ సింగ్ ,
నూకతోటి బాబురావు ,కోడూరి బాబు, జి.ఆర్.భగత్ సింగ్ ,నల్లాపు కోటి ,మెండెం సంతోష్ కుమార్ ,మేడికోండ సునీల్కుమార్ ,దేవరపల్లివీరయ్య ,డా.సాంబశివరావు,మద్దు అంకయ్య ,రేపల్లే ప్రసాద్,ఆంజనేయులు ( ప్రకాశం జిల్లా), డా. నూకతోటి రవికుమార్ , మాతంగి దీలిప్ కుమార్ ,ఉన్నవ వినయకుమార్ ,
బహుజన రచయితల వేదిక ,సామాజిక న్యాయపోరాట సమితి,రమణ,కె.వి.పి.యస్, సమతాసైనిక్ దళ్ ,ఎం.ఆర్.పి.ఎస్. కార్యకర్తలు నాయకులతో పాటు ఇతర మిత్రులు , ప్రజాసంఘాలు కార్యకర్తలు అధిక సంఖ్యలో 'డప్పు
ప్రకాష్ ' నాటి అంతిమయాత్రలో పాల్గోన్నారు.
సొంత ఆస్థిలేకుండా ,సొంత ఇల్లులేకుండా,కుటుంబాన్నించి దూరంగా ఉంటూ ఎవరు ఎంతిస్తే అంతే తీసుకుని ఒక ఊరి నుండి మరొక ఊరుకు ప్రయాణిస్తూ అగ్రకులహంకార ,రాజ్యహింసలకు వ్యతిరేఖంగా
మొత్తం తన జీవితాతం ప్రజల్ని చైతన్యం చేయడానికి తన గళాన్నిచ్చి మోయడమనేది చిన్న విషయం కాదు.'డప్పు ప్రకాష్ 'చనిపోయంతవరకూ అతని సొంత వూరు ఎక్కడో,ఏ ప్రాంతం వ్యక్తో ,చివరకు ఇంటి పేరు ఏమిటో కూడా చాలా మందికి తెలిదు.
ఆ వివరాలు తెల్సుకోవడానికి తెనాలికి చెందిన
ఎస్సీ ,ఎస్టీ ఉద్యోగ సంఘనాయకులు శ్యామ్ షా గారు సేకరించిన సమాచారంతో 'డప్పు ప్రకాష్ '
తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తని,కొత్తగూడెంలో జన్మించి గోదావరీఖనిలో
స్థిరపడ్డారని తెలిసింది. అతను జళనాట్యమండలిలోగద్దర్ బృదంలో పనిచేసాడు.కారంచేడు సంఘటన తరువాత దళితఉద్యమప్రస్థానాన్నికొనసాగించాడు.ఆంధ్రా ,తెలంగాణ ,రాయలసీమఅనే ప్రాంతీయ సరిహద్దులను జయించి జీవించాడు ప్రకాష్ . ఆంధ్రప్రదేశ్ లో కారంచేడు,చుండూరు ,లక్షింపేట ,గోకరాజు పల్లిలో దళితులపై దాడులు జరిగినప్పుడు ఉద్భవించిన ఉద్యమంలో తన వంతు కర్తవ్యంగా ఎన్నో పాటలతో ఉద్యమ చైతన్యాన్ని రగిలించాడు.
దాదాపు ఏడు పదుల వయస్సులో కూడ అతని కంఠం కంచులా మోగేది.కేవలం దాడులు జరిగినప్పుడే కాకుండా రాష్ర్టంలో ఎక్కడ సాహిత్య
సభలు జరిగినా ,ఆయా ప్రాంతల్లో స్థానికంగా జరిగే
అన్ని కార్యక్రామలకు విధిగా హాజరై తన గొంతును
వినిపించేవాడు. ఎవరు చెప్పిన చెప్పకపోయినా
ఆ వివరాలను ఎట్లాగో తెలుసుకుని హాజరవటం
ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచేది. ' డప్పు ప్రకాష్ '
దళిత విప్లయోద్యమ పాటలు పాడినప్పటికి అతని గొంతులో ' కలేకూరి ప్రసాద్ 'రాసిన పాటలు
అద్భుతంగా పలికేవి.ఆపాటలతోతాను
హాజరయ్యే సభలను హోరేతిస్తాడు .ఎందుకంటే
'కలేకూరికి 'అతను వీరభిమాని! ప్రకాష్ కు 'కంచికచర్ల'తో మంచి అనుభందం వుండేది.కలేకూరి అమరుడైన తర్వాత 'కలేకూరి'జయంతి సభలను నిర్వహించాలని మమ్మల్నందరిని పురిగొల్పి రాష్ర్టం లోని రచయితలు ,కవులు ,కళాకారులు ,ఉద్యమ కారులతో చర్చలు జరిపేవాడు. ' కంచికచర్ల 'లో
నాతోపాటు ( తంగిరాల - సోని),నీలం దాసు,బొద్దుకోల్ల శ్రీను,వేల్పుల శ్రీను,సర్వేశ్వరరావు
వంటి వారితో చాలా సన్నిహితంగా తిరిగేవాడు.
ఆ మాటకొస్తే రాష్ట్రంలో ప్రతి జిల్లాతోటి ,ప్రతి ప్రాంతంతోటి అతనికి అనుబంధం ఉండేది. అందుకే ప్రతి ఒక్కరూ 'డప్పు ప్రకాష్ 'మాకు చాల దగ్గరగా ఉండేవాడని అంటారు.అందరి హృదయాల్లో అంతటి గాఢమైన చెరిగిపోని ముద్ర వేసాడు . ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి' డప్పు ప్రకాష్ 'సంస్మరణ సభను 2017 జూన్ 11ఆదివారం తెనాలిలోని ఎన్జీఓస్ కళ్యాణ మండపంలో సాయంత్రం 5 గంటల నుండి రాత్రి
8 వరకు శ్యామ్ షా గారి నేతృత్వంలో జరిగింది.
రాష్ర్ట వ్యాప్తంగా అనేక మందికి సమాచారం అందించి ,హాజరయ్యేట్లు చూసారు.ఈ సంస్మరణ
సభను ఎక్కువగా పాటలు ,అతి తక్కువగా డప్పు ప్రకాష్తో ఉన్న అనుభంధాన్ని నెమరువేసుకునే
,జ్ఞాపకాలనుమాటలతో ముందుకు నడిపించారు.
ఈ కార్యక్రమంలో తమ పాటలతో నివాళులు
అర్పించడానికి ప్రజ పాటల తూటా ఉదయ్ భాస్కర్ ,ప్రజానాట్యమండలి కళాకారుడు రమణ తమ సహచరులతో కలిసి ప్రకాష్ కు పాటల
నీరాజనాలర్పించారు.
ఉద్యమ సహచరులు ,ఆత్మీయ మిత్రులు ,కవులు
,రచయితలు,కళాకారులు పాల్గోన్నారు.గద్దరు
బృందంలో ప్రకాష్ తో పాటు పనిచేసిన 'పుష్పక్క',
వచ్చారు.మరియు డా.నూకతోటి రవికుమార్,
డా.చుక్కా నాగభూషణం,బెందాళం కృష్ణారావు,
కేంద్ర సెన్సార్ బోర్డ్ సభ్యులు దిలిప్ రాజా,ఎస్ .ఎస్ సుకుమార్ ,ఎస్.ఎన్.పి.యస్.
రాష్ర్ట నాయకులు ,న్యాయవాది గొల్లపల్లి అంబేడ్కర్ ,బహుజన కెరటాలు పత్రిక వ్యవస్థపకులు పల్నాటి శ్రీరాములు ,కాలజ్ఞానం పత్రిక ఎడిటర్ పి.మురళీకుమార్ ,భీమ్ భూమి
పత్రిక సంపాదకులు దిలిప్ కుమార్ ,
కంచర్ల శ్రీనివాస్ ,మాలమహానాడు రాష్ర్ట అధ్యక్షులు పంతగాని రమేష్ అనేక మంది నాయకులు ,సాహితికారులు ,కళాకారులు పాల్గొన్నారు......
( కొంత చేర్పులు మార్పులు చేసి ప్రచురించిన 'కాలజ్ఞానం 'మాసపత్రిక ఎడిటర్ పి.మురళికుమార్ అన్నకు జైభీంలు )
Source :- తంగిరాల - సోని -9676609234

Subscribe to:
Posts (Atom)
ఎంతో మంది విద్యార్థులకు మార్గదర్శిగా నిలిచిన విద్యాలయం.*• *1950వ సంవత్సరంలో పురుడు పోసుకున్న పాఠశాల* • *నాడు చెరువు కట్ట బడి, నేడు బెల్లంపల్లి బస్తి బడిగా ప్రసిద్ధి*• *ఎంతోమంది రాజకీయ నాయకులు, కవులు, కళాకారులు, నక్సలైట్లు, ప్రభుత్వ అధికారులను, బొగ్గు గని కార్మికులకు ఇచ్చిన పాఠశాల*
ఎంతో మంది విద్యార్థులకు మార్గదర్శిగా నిలిచిన విద్యాలయం 1950వ సంవత్సరంలో పురుడు పోసుకున్న పాఠశాల నాడు చెరువు కట్ట బడిగా... నేడు ...
-
పెరియార్ ఇ.వి.రామస్వామి జీవిత చరిత్ర జననం,రాజకీయం ప్రవేశం, ఉద్యమాలు పెరియార్ నిర్వహించిన పోరాటాలు పెరియర్ రామస్వామి పిల్...
-
బెల్లంపల్లి, జూన్ 20 (మేము సైతం) బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ మరం దేవేందర్ తెలిపారు . తెలంగాణ పాలిటెక్...