Saturday, April 27, 2019

ప్రణయ్ హత్యపై ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ని ఏర్పాటు చేసి నిందితులను వెంటనే శిక్షించాలి. నాస్తిక్ రాకేష్, ప్రధాన కార్యదర్శి, సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్.



  • ప్రణయ్ హత్యపై ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ని ఏర్పాటు చేసి నిందితులను వెంటనే శిక్షించాలి.
  • నాస్తిక్ రాకేష్, ప్రధాన కార్యదర్శి, సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్.  .                                                                          ఈ రోజు వల్భపూర్ గ్రామంలో జరిగిన సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా కమిటీ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాస్తిక్ రాకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతో సంచలనం కలిగించిన ఘటణ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ కుల హత్య అనదరికి తెలిసినదే దానిలో  ప్రదాన నిందితులు అయిన మారుతిరావుకు, మిగతా వారికి ఈరోజు బెయిల్ రావడం సిగ్గుచేటు అన్నారు. దేశంలో కులం పేరుతో, మతం పేరుతో హత్యలు పెరిగిపోతున్న క్రమంలో ప్రభుత్వమే ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక హత్యలపై ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ లని ఏర్పాటు చేసి నిందితులకు తక్షణమే శిక్ష పడేలా చేయాలని లేదంటె పాలకులపై న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందన్నారు. అలా చేయకపోతె నిందితులు బెయిల్ మీద బయటకు వచ్చి సాక్ష్యాలను తారుమారు చేయడం, డబ్బులతో బాధితులని కొనడానికి కానీ, కిరాయి గుండాలతో బెదిరించి కేసులు వాపస్ తీసుకునేలా చేస్తున్నారు. కాబట్టి అలాంటి అవకాశం రాకుండా శిక్షలు వెంటనే పడేలా ప్రభుత్వమే చొరవ తీసుకోవాలని అన్నారు.ప్రణయ్ నిందితులకు యావజ్జివ శిక్ష పడేలా ప్రభుత్వమే చర్య తీసుకోవాలని లేకపోతే హత్యలు చేస్తే కూడా బెయిల్ మీద బయటకు రావచ్చు అనే చెడు సందేశం సమాజానికి ఇచ్చిన వారు అవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ssf రాష్ట్ర నాయకులు గొర్రె. శ్రీనివాస్, శివకుమార్ నాస్తిక్, అచ్యుత్ రాజ్, రాజేందర్, అగ్నితేజ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment