కరోనా కేసులు పెరుగుతుంటే విద్యార్థులకు పరీక్షలు ఎలా నిర్వహిస్తారు - ఆదర్శ వర్ధన్ రాజు - NSUI జిల్లా అధ్యక్షుడు
ఈ రోజు NSUI మాంచెరిల్ జిల్లా ఆధ్వర్యంలో బెల్లంపల్లి బజార్ ఏరియా లో రాస్తా రోకో నిర్వహించడం జరిగింది పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు కరోనా బారిన పడే అవకాశం ఉందని విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం అడవద్దని పరీక్షల షెడ్యుల్ విడుదల నిరసిస్తూ NSUI రాష్ట్ర అధ్యక్షులు బలమురి వెంకట తో పాటు 30 మంది విద్యార్థి నాయకులు ప్రగతి భవన్ ని ముట్టడించారు ఎన్నో రకాలుగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు అయినా ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తుంది కాబట్టి దీనికి నిరసనగా మాంచెరిల్ NSUI జిల్లా అధ్యక్షుడు ఆదర్శ వర్ధన్ రాజు ఆధ్వర్యంలో బజార్ ఏరియా ప్రధాన రహదారి పైనా రాస్తా రోకో చేయడం జరిగింది. బెల్లంపల్లి నియోజకవర్గం యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎనగందుల వెంకటేష్ మరియు చాకెపల్లి ఎంపీటీసీ ముడిమడుగుల మహేందర్ మాట్లాడుతూ ప్రస్తుత కరోనా పరిస్థులులో రాష్ట్ర వ్యాప్తంగా కోవిద్ నిబంధనలు అమలులో ఉంటే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలనుకోవడం ఎమాత్రం సమంజసం కాదని, హైకోర్టు లో కేసు ఉన్న ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుందని విమర్శించారు. రాష్ట్రం లో 30లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వంటనే పరీక్షలు నిర్వహించే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో NSUI నాయకులు సాయికుమార్ , ప్రదీప్, ఫారూఖ్, అస్లాం,వైభవ్, నాని యువజన నాయకులు చంద్పాషా మహేష్, రవి, జంబోజు రాజకుమార్, పొల్లంపల్లి రాజుకుమార్ తదితరులు పాలుగోన్నారు.






























