అమెరికాలోని అబర్న్ యూనివర్సిటీలో పీజీ వుడ్ సైన్స్ కోర్స్ లో ఉచితంగా సీటు సాధించిన సుహర్ష ని సన్మానం చేసిన ఎర్రోళ్ల నరేష్
 |
| విద్యార్ధి సుహర్షని సన్మానం చేసిన ఎర్రోళ్ల నరేష్ |
మేము సైతం : సింగరేణి కార్మిక బిడ్డల సంఘం(SKBS) ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాకు చెందిన సింగరేణి ఉద్యోగి భాస్కర్ల శ్రీనివాస్ కుమార్తె సుహర్ష తెలంగాణ ఫారెస్ట్ ఇనిస్టిట్యూట్ లో డిగ్రీ పూర్తి చేసి, అమెరికాలోని అబర్న్ యూనివర్సిటీలో పీజీ వుడ్ సైన్స్ కోర్స్ సుమారు 50 లక్షల సీటు ఉచితంగా సాధించినందుకు సింగరేణి కార్మిక బిడ్డల సంఘం తరుపున శాలువతో సన్మానం చేసి, పూల మొక్క అందజేసి అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఎర్రోళ్ల నరేష్ మాట్లాడుతూ సింగరేణి ముద్దు బిడ్డ,సుహర్ష అమెరికాలోని పీజీ వుడ్ సైన్స్ ఆఫ్ టెక్నాలజీ లో సీటు సాధించడం చాలా గొప్ప విషయమని, తెలంగాణ రాష్ట్రం లోని విద్యార్థులందరు సుహర్ష ను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని భవిష్యత్ లో మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని కోరడం జరిగింది. మరియు సుహర్ష మాట్లాడుతూ నాకు సన్మానం చేసిన నాయకులకు సింగరేణి కార్మిక బిడ్డల సంఘం(SKBS)నికి ప్రత్యేక ధన్యవాదాలు, భవిష్యత్ లో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఎర్రోళ్ల నరేష్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కోశాధికారి పడాల రవీందర్, తెలంగాణ జాగృతి యువజన నాయకులు కందుల ప్రశాంత్, అడ్వకేట్ మెరుగు నరేందర్, సుహర్ష కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment