సంఘటన జరిగిన గ్రామం : చిన్నుగుాడ, కెరిమెరి గ్రామ పంచాయతీ .
తేది:30-07-2016,ఆదివారం సమయం ఉదయం 10:00
ఈనాడు దినపత్రికలో "మంత్రాలు చేస్తున్నాడని ఓకరి హత్య" అనే ఓ ప్రత్యేక కథనాన్ని చుాసి విషయాన్ని గోడిసెల స్వామి గారు తేలియజేయటం జరిగింది.
వారు ఆ గ్రామంలో జరిగిన హత్య గురించి తెలుసుకోని చాలా బాధపడినారు. అక్కడికి వెళ్ళి ఆ ప్రజలకు మంత్రాలు చేస్తున్నారాని హత్యలు చేయటం నేరం అని చేప్పి, ముఢానమ్మకాలపై అవగహణ కల్పించాలని మాకు తెలియజేయడం జరిగింది. జోషి ప్రశాంత్ (తనుకు), రంగ ప్రశాంత్ (నేను), స్వట్కస్ (కరీంనగర్) SSF రాష్ట్రం కోఆర్టనేటర్ లు అక్కడికి వేళ్ళి సర్వే చేసి ,వారికి కోంత అవగహణ కల్పించాండి అని చేప్పుటం జరిగింది. జోషి ప్రశాంత్, స్వట్కస్ బేల్లంపల్లి రైల్వే స్టేషన్ రావటం జరిగింది.
అక్కడి నుండి మేము బస్సు ఏక్కి ఆసిఫాబాద్ 32 కీ,మీ వెళ్ళటం జరిగింది. మళ్ళీ అక్కడి నుండి కెరిమెరి మండలనికి (29కీ,,మీ) వేళ్ళుటం జరిగింది.
సమయం:ఉదయం10అయింది,
కెరిమెరిలో దిగటం జరిగింది. అక్కడి నుండి
ప్రజలను చిన్నుగుాడకి ఏలా వెళ్ళాలి అని అడిగాము అప్పుడు సుాత్తన్ గుాడకి వేళ్ళి అక్కడి నుండి చిన్నుగుాడకి వెళ్ళాలి అన్నారు. కాని ఆ గుాడెంకి రవాణా సౌకర్యం లేదు, ఆటోలు గాని బస్సు వెళ్ళావు, ఇక్కడి నుండి ఐదు కీ'మీలు ఉంటుందాన్నారు, పైగా వరుసగా కురుస్తున్నా వర్షాల వల్లా మార్గం మెుత్తం బురదమయంగా ఉంటుందాని అన్నారు, అంతే కాకుండా దట్టమైన అడవి ప్రాంతాం నుండి వెళ్ళాలి అన్నారు, అప్పుడు ఏం చేయ్యాలో అర్థం కావటం లేదు , అయితే నడిచి వేళ్ళాక తప్పదు అని అర్థ మాయింది.
ముందు దుకాణంలో రేండు వాటర్ బాటిల్స్, 3బిస్కేట్ ప్యాకిట్స్ కోనుకోని చిన్నగుాడాకి బయలుదేరాము, వర్షం వచ్చేలా వాతవారణం చాలా చాల్లాగా ఉంది, అక్కడి గాలి ఏంతో ప్రశాంతాంగా ఉంది, అంటే ఇంచు మించు సునామి వచ్చేముందు వుండేలా అన్నామాటా.. ఇంకా నడుస్తునే ఉన్నాము.. 5నిమిషాల తరువాత పరుగేడుతున్నా సేరయేరు కనబడింది, మాకేంతో ఆనందంగా అని పించింది.. కోంచేం సేపు అక్కడ ఉండి గడిపి మళ్ళీ బయలుదేరాము. మనసుకి ఎంతో ఆనందం కలిగింది. అడవితల్లి ఓడిలోకి వెళ్ళుతున్నాము. ఆ ప్రకృతిని, ఆ గాలిని ఆస్వాదిస్తూ ఇంకా వేగాంగా నడువసాగాను. మదిలో ఏన్నో ఆలోచనాలు మళ్ళీ అది అడవి ప్రాంత కుృార మృగల బారినా పడితే మా పరిస్థితి ఏంటో మళ్ళీ అసలు తిరిగి వస్తామా...? ముాఢా నమ్మకాల గురించి చేప్పినప్పుడు అక్కడి ప్రజలు తీరుగబడితే ఏంటీ మన పరిస్థితి అని ఆలోచిస్తునే ముందు సాగాం.? మదిలో ఎన్నో కష్టాల వర్షం..! 30నిమిషాలు అయింది. ఇంకా చిన్నుగుాడా రావాటం లేదు.. ఏంటి దారి తప్పుమ్మా.? అనే నిరాషాతో నడుస్తున్నాము చుట్టు అడివే కనబడుతుంది. నడువలేక
పోతున్నాము. కాని ప్రయత్నిస్తున్నాము. దారిలో కోంత మంది కుాలీలు కనిపించారు, వారిని ఇంకా ఏంత దుారం అని అడిగాం. వారు మాకు బయపడుతుా సమాధానం ఇచ్చారు... చక్కగా వెళ్ళాలి సారు.. ఇంకా దుారం వేళ్ళాలి.. బేరగా వెళ్లండి అన్నారు.
ఇంకో 5 నిమిషాలు నడిచాము.. మేము వెతుకుతున్నా ఆ గ్రామ పెద్ద మనిషి (చేడం దేవరాజ్) ,ఇంకో ఇద్దరు కలిసి కాలినడకనా కెరిమెరిలోని వారానికి ఓక్కే రోజు అది ఆదివారం జరిగే సంతకి కుారగాయాలు కోనటానికి వెళ్ళాతున్నావారు, వారు మాకు ఏదురయ్యారు. మాలో ఓక్క తెలియని సంతోషం కల్పించింది. వారితో మాట్లాడి విషయాన్ని చెప్పి అక్కడి నుండి వారి గ్రామానికి తిసుకోని వెళ్ళారు వారు. చివరికి ఏంతో దుారం నడిచి మా గమ్యమును చేరుకున్నాము..
సమయం:12గంటల20నిమిషాలు.
మేము వారు ఉన్నా పరిసరాలు చుాసి చాలించుకపోయం. ఆ గ్రామం ఏర్పడి దాదాపు 120సంవత్సరాలు గడిచిపోయినా అక్కడ కేవలం 12 కుంటంబాలు మాత్రమే ఉన్నాయి. ముాడు తరాలుగా నుండి ప్రజలు జివిస్తున్నా వారికి చదువంటేనే తెలియదు, కేవలం జనాభా లేక్కలకోసం బ్రతుకుతన్నారు. అంతే మేము వివరాలు అడగటం ప్రారంభించాము.
వారుమాకు చేప్పిన సమచారం:-
మా ఊరిలో మగ-26, ఆడ-20, పిల్లలు-5 మంది ఉన్నారు సారు, కాని "అందులో నుండి ఐదుగురు మగ, ఇద్దరు ఆడ వారు జైలు శిక్ష పడి శిక్షను అనుభావిస్తున్నారని చేప్పరు". ముందే అసలు ప్రశ్న అడగాటం కన్నా కోన్ని వ్యక్తిగత ,ప్రభుత్వ సహుయం కోసం అడిగి తరువాత ముాఢనమ్మకాలపై చైతన్యపరాచాలను కున్నాము.
వారు కోలంస్ (ST) అనే గోండు తెగువకు చెందినావారు. వారు భీం అనే దేవున్ని (ఆకారం లేదు,
ఎలా ఉంటారో తేలియదు ) ప్రార్థిస్తారు. మా తండ్రికి మా తాత చేప్పారు. నాకు మా నాన్నా చేప్పరు సారు, మెుక్కుతున్నాము సారు అన్నారు వారు. వారికి ఏం తెలియదు కేవలం బ్రతుకుతున్నారు అంతే. స్వాతంత్రం వచ్చిన కుాడా వీరి బ్రతులు మారలేదు. వీరు కేవలం ఓట్ల కోసమే పుట్టారాని మాకనిపించింది. కాని వారి అజ్ఞానాన్ని చుాసి చాలా భాదపడినాము.. అసలు నిజాంగా ఇంకా ఇలాంటి మనుఘలున్నారా అనిపించింది. అప్పుడు మా అందరి మనస్సుల్లో పాలకుల నిర్లక్ష్యం వహించాటం వల్ల ఇంత నష్టం జరుగుతుందా.! అని అనుకున్నాము. మా ప్రశ్శలను మేము వేగవంతం చేశాము, వారు పుార్తిగా మాతో కలిసి చర్చలో పాల్లోన్నారు, వారి జీవనశైలిని తెలుసుకోవాటం జరిగింది. వారి "బ్రతుక భారం! జీవితం అంధకారం!!.. "వారి జీవనాధారం వ్యవసాయం మాత్రమే,
వారి పుర్వికుల నుండి వచ్చిన రెండు ఎకరాల భుామిలో కేవలం గోధుమ, పత్తి మాత్రమే పండిస్తున్నారు...
ఇంతలో జోషి అడిగాడు.. ఏందుకు ఈ పంటలే పండిస్తున్నారు అని అడిగారు...? అప్పుడు వారు చేప్పినా సమాధానం సారు మేము నేర్చకున్నా పంట ఇదే, మా తాత ఈ పంటనే పండించేవారు అని సమాధానం చేప్పారు. ఇంతవరకు" వ్యవసాయశాఖ "వారు వీరి గ్రామానికి రాలేదాంటా అసలు అవగహణ కల్పించాలేదాంటా....! ఆ ప్రజలు గడకబియ్యం, రోటి, అప్పుడప్పుడు అన్నం తింటారు అంతే. ఇప్పుటి వరకు అక్కడ చదువుకున్నావారే లేరు. .చదువంటే తెలియదు మరి అంతే కాదు వారి ఆసుపత్రి లేదు, వైద్య సదుపాయం లేనే లేదు. ఆ గ్రామంలో రుతుస్రావం తో మరణించిన మహిళ ఎందరో ప్రాణాలు గాలిలో కలిసై రెండు, ముాడు రోజులు ఏడుస్తాం సారు అంతే మేము ఏం చేయాగాలం సారు అన్నారు.. ఇంకా వారిని మాట్లాల్లో పడేసి జరిగిన సంఘటను మెల్లగా అడగటం ప్రారంభించాం..
అప్పుడు జైలుకైల్లినా వారిని విడిపించాలేదా.....?
అని అడిగాను వారు అమాయకంగా డబ్బులుంటేనే వారి బేల్ వస్తుందన్నారు... అసలేం జరిగింది అని అడిగాము. ఆ గ్రామ పెద్ద మనిషి (చేడం దేవరాజ్) తడబడుతు జరిగిన యాదర్థం గాధ చేప్పటం ప్రారంభించారు...
తేది:-06 - జుాన్-2016,సోమవారం,
సమయం:-సాయంత్రం 4గంటలు..
మానవ సమాజం తలదించుకునేలా ఓకరి హత్య జరిగింది.. కారణం మంత్రాలు చేస్తున్నాడని ఆ గ్రామనికి చెందిన కుడిమేత పోసిగా(38)ను తరిమి, తరిమి కోట్టి చంపిన ఘటనతో లోకం దద్దరిల్లింది. ఇంకా వివరాలకి వెళ్ళితే ఆ రోజున గ్రామంలో విదర్ హితుార్ (వారి సంప్రదాయ పండుగ ) చేశారు. ఆ సమయంలో పోసిగా ఇంట్లోకి పాము వచ్చింది. కోడిని కాటేయడంతో కోడి చనిపోయింది. దీంతో పాముని చంపేసి పాము, కోడిని గోయ్యి తవ్వి పుాడ్చేశాడు అనంతరం ఎప్పుడో వేసిన పాత చేతి పంపువద్ద నీటితో కడుక్కున్నాడు. తమ సంప్రదాయాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడని, పాము, కోడితో ఏదో మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో ఆగ్రహించిన కోంతమంది కర్రలు, రాళ్లతో కోట్టి సోమారం రాత్రి చంపేశారు. చివరికి అంతా అయిపోయింది. చివరికి పోసిగా మరణించాడు. మానవత్వం అనే పదానికి అర్థం తెలియని వారు, మనుషులనే పదాన్నే మర్చిపోయి పశువుల ప్రవర్తించారు, మరణించిన అతనికి భార్య అయ్యుాబాయి ఇద్దరు కోడుకులు పెద్దభీం(8) ,చిన్నభీం(3), ఓక కుాతురు రాజేశ్వరి(5) ఉన్నారు. చివరికి వారు అనాధలయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మంగళవారం ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. కోలాం ఆచార సంప్రదాయ ప్రకారం విదర్ హితుార్ ప్రత్యేక పుాజలు చేసినప్పుడు గ్రామంలో ఉన్నవారందరుా పుాజ చేసే ప్రదేశంలోనే ఉండాలి. ఇతర పనులు చేయకుాడదు. కనీసం చేతిపంపు నీరు కుాడా తాగరాదు. ఇలాంటి కట్టుబాట్లకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడంటుా పోసిగాను హత్య చేశారు.
మా దర్యాప్తు అనంతరం జరిగిన విషయాన్ని మేము గ్రామస్తులకు తెలియజేయడం జరిగింది. విషయం తెలుసుకున్న అంత పశ్చాత్తాపండ్డారు. ఓ పక్క ఒక కుటుంబం పెద్దదిక్కు కోల్పోయింది, మరోపక్క ఏడుగురు ఇంటి జైలు జీవితాన్ని గడుపుతూ ఆ గూడెం చిన్నబోయింది..
ఇది అవగాహన లోపమా...? ప్రభుత్వాల నిర్లక్ష్యంమా..?
ఆ గ్రామానికి కేవలం ప్రజాప్రతినిధులు ఎన్నికలకు రెండు రోజుల ముందు వచ్చి కేవలం 20 లేదా 50 రూపాయలు , ఒక సీసా సార ఇచ్చి ఎన్నికలలో ఓటు వేయించుకుంటారు.
మా ప్రభుత్వాల వల్ల రాష్ట్రాలు బాగుపడతాయని చెప్పుకుంటూ తిరుగుతున్న ఓ ప్రజాప్రతినిధి లారా ఇది చూసి సిగ్గు పడకండి,, ఇంకా ఆసుపత్రి సౌకర్యాలు లేని గ్రామాలు, పాఠశాలలు మరియు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించని మీరు ఉన్నా ఒకటే నీ ప్రభుత్వాలు లేకున్నా ఒకటే.....
-మీ రంగ ప్రశాంత్, సామాజిక కార్యకర్త
(మహాత్మ జ్యోతిరావు పూలే జాతీయ అవార్డు గ్రహీత)
























No comments:
Post a Comment