Wednesday, February 20, 2019

కొబ్బరి నీళ్లతొ వచ్చే ప్రయోజనాలు తెలిస్తే రోజూ తాగుతారు

కొబ్బరి నీళ్లతొ వచ్చే ప్రయోజనాలు తెలిస్తే రోజూ తాగుతారు

       ఒంట్లో నీరసంగా ఉన్నా.. జ్వరం వచ్చినా కొబ్బరి నీళ్లు తాగితే చాలు. కొబ్బరి నీళల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతికాలంలో మనకి కొబ్బరి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. ప్రతి జబ్బుకూ ఇది సర్వ రోగ నివారిణి. ఎలాంటి కల్తీ లేకుండా మనకు స్వచ్ఛంగా లభించే పానీయం ఇదొక్కటే ఉంటుంది.

కొబ్బరి నీళల్లో చాలా పౌష్టిక గుణాలుంటాయి. ఇందులో ఉండే చాలా మినరల్స్ శరీరానికి మేలు చేస్తాయి. అందువల్ల రెగ్యులర్ కొబ్బరి నీళ్లను తాగడం చాలా మంచిది. అలాగే కొబ్బరి నీళ్ల వల్ల కలిగి ఉపయోగాలు ఏమిటో మీరూ చూడండి.

 1. గుండెకు చాలా మంచిది

కొబ్బరి నీళ్లు తాగడం గుండెకు చాలా మంచిది. హార్ట్ అటాక్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అధిక రక్తపోటు సమస్య కూడా ఉండదు. గుండె సంబంధిత వ్యాధులన్నింటినీ దూరం చేయగలదు.


2. జీవక్రియను పెంచుతుంది

రోజూ కొబ్బరినీరు తాగడం వల్ల మీ జీవక్రియ రేట్ కూడా పెరుగుతుంది. అలాగే మీరు త్వరగా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇందులోని ఎలెక్ట్రోలైటీ అనేది అధికంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ఇందులో మాంగనీస్ ఎక్కువగా ఉంటుంది. దీంతో జీవక్రియ పెరిగి ఫ్యాట్ మొత్తం కరిగిపోతుంది.


3. కిడ్నీలోని రాళ్లను కరిగించుకోవొచ్చు

తక్కువగా నీరు తాగితే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతుంటాయి. అయితే కొబ్బరి నీళ్లను తాగడం వల్ల కిడ్నిలోని చిన్నసైజ్ రాళ్లు త్వరగా కరిగించుకోవొచ్చు.

అలాగే కిడ్నీల్లోని వ్యర్థ పదార్థాలు మొత్తం కూడా బయటకు వెళ్లడానికి కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడతాయి.

 4. డీ హైడ్రేషన్ ఉండదు

కొబ్బరి నీళ్లను రెగ్యులర్ గా తాగడం వల్ల మీలో డీ హైడ్రేషన్ సమస్య అనేది ఏర్పడదు. నీళ్ల కంటే ఎక్కువగా కొబ్బరి నీళ్లు పని చేస్తాయి.

అథ్లెట్లు, వ్యాయామాలు చేసేవారు ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగడం చాలా మంచిది.


5. జీర్ణశక్తిని పెంచుతుంది

కొబ్బరి నీరు కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఇందులో మినరల్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ మీలో మీలో జీర్ణశక్తిని పెంచుతాయి.


6. కండరాల తిమ్మిరిని తగ్గిస్తుంది

కండరాల తిమ్మిరిని తగ్గించడంలో కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడతాయి. రక్తంలో పొటాషియం స్థాయి తక్కువగా ఉంటే ఇలాంటి తిమ్మిర్లు వస్తాయి. అయితే కొబ్బరి నీరు పొటాషియం స్థాయిని పెంచుతుంది. దీంతో కండరాల తిమ్మిరి సమస్య అనేది ఉండదు.


7. ఎముకలను బలంగా ఉంచగలదు

కొబ్బరి నీటిలో కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఈ రెండూ కూడా మీ ఎముకల్ని బలంగా చేస్తాయి. అందువల్ల ఎముకలు బలపడాలంటే రెగ్యులర్ కొబ్బని నీళ్లు తాగడం మంచిది.


8. బరువు తగ్గొచ్చు

మీరు గంటల తరబడి వ్యాయామం చేయకుండానే ఈజీగా బరువు తగ్గించ గల శక్తి కొబ్బరి నీళ్లకు ఉంటుంది. కొబ్బరి నీరు మీలో కాస్త ఆకలి తగ్గిస్తుంది.

అంతేకాకుండా శరీరంలో ఫ్యాట్ ను కొబ్బరి నీళ్లు కరిగిస్తాయి.


9. యాంటీ డయాబెటిక్

కొబ్బరి నీళ్లు యాంటీ డయాబెటిక్ గా పని చేస్తాయి. బ్లడ్ షుగర్ ని తగ్గించడానికి కొబ్బరి నీళ్లు చాలా బాగా ఉపయోగపడతాయి. డయాబెటిస్ బాధపడుతున్నవారు కొబ్బరి నీళ్లు తాగడం చాలా మంచిది. అయితే డయోబెటిక్ తో బాధపడుతున్నవారు ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగకపోవడం కూడా మంచిది. హైపోగ్లైసెమిక్ ఎపిసోడ్ సమస్య బారిన పడే అవకాశం ఉంది.


10. రక్తం గడ్డకట్టే సమస్య ఉండదు

రక్తం గడ్డకట్టే సమస్యను కొబ్బరి నీళ్లు పరిష్కరిస్తాయి. కొందరిలో ఈ సమస్య ఏర్పడుతుంటుంది. దీన్ని కొబ్బరి నీళ్లు తాగడం ద్వారా పరిష్కరించుకోవొచ్చు.

11. రక్తపోటును తగ్గిస్తుంది

కొబ్బరి నీళ్లు రక్తపోటును తగ్గిస్తాయి. హైపర్టెన్సివ్ తో బాధపడే వారు రెగ్యులర్ కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. దీంతో వారిలో ఆ సమస్య పోతుంది.

12.బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ను తొలగించగలవు

కొబ్బరి నీళ్లు రక్తంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ను తొలగించగలవు. ఈ విషయం పలు పరిశోధనల్లో వెల్లడైంది.

13. అతిసారం సమయంలో ఎక్కువగా తాగాలి

అతిసారంతో బాధపడుతున్నప్పుడు కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగాలి. ఓఆర్ ఎస్ కన్నా కొబ్బరి నీళ్లు చాలా మంచివి. అందువల్ల అతిసారం సమయంలో కొబ్బరి నీళ్లను తాగడం మంచిది.


14. వ్యర్థాలన్నీ బయటకు పోతాయి

శరీరంలోని వ్యర్థాలన్నీ బయటకుపంపడానికి కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడతాయి. అప్పడప్పుడు కేవలం శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడానికి కొబ్బరి నీళ్లు తాగడం చాలా మంచిది.


15. తక్షణ శక్తిని ఇస్తుంది

మీకు తక్షణ శక్తిని ఇవ్వడానికి కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడతాయి. మీరు బాగా అలసిపోయినప్పడు కాసిన్ని కొబ్బరి నీళ్లు తాగితే చాలు. మీరు వెంటనే కోల్పొయిన శక్తిని తిరిగి పొందుతారు.

16. హ్యాంగోవర్ తగ్గిపోతుంది

చాలామంది రాత్రి తాగింది దిగకపోవడంతో హ్యాంగోవర్ తో బాధపడుతుంటారు. అలాంటి వారు కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. దీంతో వెంటనే ఉపశమనం కలుగుతుంది. మద్యపానం వల్ల శరీరంలోని ఉన్న శక్తిని మొత్తం ఖాళీ అయిపోతుంది. అలాంటి సందర్భాల్లో మీరు కోకనట్ వాటర్ తాగడం చాలా మంచిది.


17. తలనొప్పి తగ్గిపోతుంది

కొబ్బరి నీళ్లు తాగడం వల్ల తలనొప్పి సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందొచ్చు. తలనొప్పి ఉన్నప్పుడు కాసిన్ని కొబ్బరి నీళ్లు తాగి చూడండి

18. మతిమరుపు

మతిమరుపు సమస్యను కొంత మేరకు కొబ్బరి నీరు పరిష్కరించగలదు. కొబ్బరి నీళ్లలో ఉండే ట్రాన్స్-జేజిటిన్ జ్ఞాపకశక్తిని పెంపొందించగలదు.


19. కాఫీ, టీల కంటే చాలా మంచిది

కాఫీ లేదా టీని క్రమం తప్పకుండా తాగుతున్నట్లయితే వాటి బదులుగా కొబ్బరి నీళ్లను తాగడం చాలా మంచిది. వాటికంటే బోలెడన్నీ ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి. అందువల్ల రెగ్యులర్ గా కొబ్బరి నీళ్లను తాగడం అలవాటు చేసుకోండి.


20. హానికరమైన బాక్టీరియా నుంచి కాపాడుతుంది

కొబ్బరి నీళ్లలోని ఔషధ గుణాలు శరీరంలోకి ప్రవేశించిన హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడగలవు. ఈ కోలి, పి ఎరుగినోస, బీ సబ్ టిల్స్ , ఆరియస్ వంటి బ్యాక్టీరియాపై కొబ్బరి నీళ్లు ప్రభావంతంగా పని చేస్తాయి. కొబ్బరి నీరు యాంటీమోక్రోబియాల్ గా పని చేస్తుంది.

21. రోగనిరోధక శక్తిని పెంచుతుంది

కొబ్బరి నీళ్లు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే కొబ్బరి నీటిలో ఆమ్లజనకాలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను తగ్గిచండానికి కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడతాయి.

22. మంచి నిద్ర

రాత్రి పడుకునే సమయంలో కొబ్బరి నీళ్లను తాగడం వల్ల త్వరగా నిద్రకు ఉపక్రమిస్తారు. అలాగే మంచి నిద్ర వస్తుంది. కొబ్బరి నీటిలో గాబా ఉంటుంది. ఇది ఒక న్యూరోట్రాన్స్మిటర్. ఇది కండరాలకు త్వరగా విశ్రాంతి చేకూర్చగలదు. నిద్రలేమితో బాధపడేవారు పడుకునే ముందు కొబ్బరి నీళ్లను తాగడం చాలా మంచిది.

 23. మెమరీ పవర్ పెరుగుతుంది

కొబ్బరి నీళ్ల వల్ల మెమరీ పవర్ పెరుగుతుంది. జ్ఞాపక శక్తిని పెంచడానికి కొబ్బరి నీరు బాగా ఉపయోగపడుతుంది. చాలా అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది.

24. డిప్రెషన్

కొబ్బరి నీటిలో మెగ్నీషియం దాదాపు 60 మి. గ్రా ఉంటుంది. ఇది మిమ్మల్ని డిప్రెషన్ నుంచి కాపాడుతుంది. అందువల్ల రోజూ మీరు కొబ్బరి నీటిని తాగడం చాలా మంచిది.

25. గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు మంచిది

గర్భిణీలు, పాలిచ్చే తల్లులు పలు సమస్యల ద్వారా బాధపడుతుంటారు.

ఎక్కువగా అలసట చెందడం, కండరాల తిమ్మిరి, అధిక రక్తపోటు వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయితే రోజూ కొబ్బరినీరు తాగడం వల్ల ఈజీగా ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు


26. అధిక జ్వరం

అధిక జ్వరం నుంచి త్వరగా ఉపశమనం పొందడానికి కొబ్బరి నీరు చాలా బాగా ఉపయోగపడుతుంది. జ్వరం వచ్చినప్పుడు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మీరు కోల్పొయిన శక్తిని తిరిగి పొందుతారు.

 27. గ్యాస్ట్రిక్ సమస్య నుంచి ఉపశమనం

కొబ్బరి నీళ్ల ద్వారా గ్యాస్ట్రిక్ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

గ్రాస్టిక్ సమస్య వల్ల కొందరు చాలా ఇబ్బందిపడుతుంటారు. అయితే కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కొంతమేరకు సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

 28. వృద్ధాప్య ఛాయలు రాకుండా

వయస్సు పెరిగేకొద్ది వృద్ధాప్య ఛాయలు ఎక్కువగా వస్తుంటాయి. ముఖంపై

ముడుతలు ఏర్పడుతుంటాయి. అయితే ప్రతి రోజూ కొబ్బరి నీళ్లను తాగడం వల్ల ఇలాంటి ముడతలు కాస్త తగ్గుతాయి.


29. చర్మం కాంతివంతంగా మారుతుంది

కొబ్బరి నీళ్లను రెగ్యులర్ గా తాగడం వల్ల చర్మ కాంతివంతంగా మారుతుంది. మీ స్కిన్ ఎప్పుడూ కోమలంగా ఉంటుంది.

 30. జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది

జుట్టు ఆరోగ్యంగా ఉంచేందుకు కొబ్బరి నీరు బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. జుట్టు నిగనిగలాడుతుంది. వీటన్నింటి కోసం మీరూ రోజూ కొబ్బరి నీళ్లు తాగితే చాలు.

Tuesday, February 19, 2019

తెలంగాణ మంత్రులు - శాఖలు


1. ఈటల రాజేందర్- వైద్యాఆరోగ్యం 

2. వేముల ప్రశాంత్ రెడ్డి- రవాణా, రోడ్లు భవనాలు 

3. గుంటకండ్ల జగదీష్‌రెడ్డి- విద్యాశాఖ 

4. సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి- వ్యవసాయశాఖ

5. తలసాని శ్రీనివాస్‌యాదవ్- పశుసంవర్థకశాఖ 

6. కొప్పుల ఈశ్వర్- సంక్షేమశాఖ 

7. ఎర్రబెల్లి దయాకర్‌రావు- పంచాయతీరాజ్, 
      గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ 

8. అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి- న్యాయశాఖ, దేవాదాయ,  అడవులు, పర్యావరణం, 

9. వి. శ్రీనివాస్‌గౌడ్ ఎక్సైజ్- పర్యాటకం, క్రీడలు 

10. చామకూర మల్లారెడ్డి- కార్మిక, ఉపాధి,     మానవవనరుల అభివృద్ధి

Sunday, February 17, 2019

సైనికులకు సంతాపం వక్తపరుస్తు శాంతీర్యాలిని నిర్వహించిన గురిజాల గ్రామస్థులు

సైనికులకు సంతాపం వక్తపరుస్తుా శాంతీర్యాలిని నిర్వహించిన గురిజాల గ్రామస్థులు



ఈ రోజు తాళ్ల గురజాల గ్రామపంచాయతీ యువకులు, ప్రజా సంఘాల నాయకుల మరియు గ్రామ ప్రజలు  ఆధ్వర్యంలో జమ్మూకాశ్మీర్ లో పుల్వామా జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరణించిన సీఆర్పీఎఫ్  సైనికులకు సంతాపం తెలుపుతూ క్యాండిల్ తో శాంతీ ర్యాలీ తీయడం జరిగింది .పెద్ద ఎత్తున యువకులు ఈ కార్యక్రమంలో పాల్లోని జై జవాన్, జై భారత్ నినాదలతో గ్రామంలో ర్యాలి నిర్వహించి దేశ భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎండి చాంద్ పాషా, వంగ  రామన్న,  డాకుారి సురేష్, బండి పెళ్లి శ్యామ్, బాల, నాందేవ్ , తాటికొండ సత్యనారాయణ, మూటపోతుల  రాంబాబు, , బి శేఖర్, పల్లె సాయి మరియు పోలీస్ సిబ్బందిలతో పాటు పెద్దఎత్తున గ్రామస్థులు పాల్లోన్నారు.... (న్యుాస్/R.P.B)

Wednesday, February 13, 2019

పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా తన పేరును పరిశీలించాలి కాంపెల్లి ఉదయ్ కాంత్ గారు , హైకోర్టు న్యాయవాది వైస్ - చైర్మన్ లీగల్ HR & RTI Dept - TPCC ( తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ కమీటి )

ఉత్తమ్ గారికి బయోడేటాను అందిస్తున్న ఉదయ్ కాంత్ గారు
  • పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా తన పేరును  పరిశీలించాలి..!
  •  ఉత్తమ్ సానుకూలంగా స్పందించారా..?
  • కాంపెల్లి ఉదయ్ కాంత్ , హైకోర్టు న్యాయవాది " వైస్ - చైర్మన్ " లీగల్, HR & RTI, Dept - TPCC     గారు ఏమంటుాన్నారు..?
  • ఉత్కంఠగా మారిన  పెద్దపల్లి పార్లమెంట్ టిక్కెట్ వ్యవహారం....
పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా తన పేరును  పరిశీలించాలి కాంపెల్లి ఉదయ్ కాంత్ , హైకోర్టు న్యాయవాది " వైస్ - చైర్మన్ " లీగల్, HR & RTI, Dept - TPCC ( తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ కమీటి ) గారు                                                                                                                                                                                               పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా తన పేరును  పరిశీలించాలని కాంపెల్లి ఉదయ్ కాంత్ , హైకోర్టు న్యాయవాది " వైస్ - చైర్మన్ " లీగల్, HR & RTI, Dept - TPCC( తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ కమీటి ) గారు తన బయోడేటాను హైదరబాద్ లో  తెలంగాణ కాంగ్రేస్ ప్రదేశ్ అధ్యక్షులు ఉత్తమ్ కుామార్ రెడ్డి గారి నివాసంలో కలసి  అందజేయాటం జరిగింది.. ఈ సందర్భంగా కాంపెల్లి ఉదయ్ కాంత్ గారు మాట్లడుతుా అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారని తన పేరును కుాడ పరిశీలిస్తానాని హామి ఇవ్వటం జరిగిందాని తెలియజేస్తారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోరకు తను చేసిన కృషి, గత అసెంబ్లీ ఎన్నికల్లో బెల్లంపల్లి నియెాజకవర్గ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నామినేషన్ వేసి పోటీకి  సిద్దమైన తరుణంలో అధిష్ఠానం పిలుపు మేరకు నామినేషన్ ఉపసంహరించుకున్నట్లుగా, మహా కూటమి అభ్యర్థి గుండ మల్లేష్ గారికి మద్దతు తెలియజేసి నిజాయతీగా పని చేశానాని తెలియజేశారు. ప్రస్తుత పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం, మెాదీ తీసుకోస్తున్నా రాజ్యాంగ వ్యతిరేక విధానాలను ఎండ కట్టాలంటే అది  న్యాయవాదులకు, యువతకే సాధ్యమని అన్నారు. చట్టసభలో న్యాయవాదులకు అవకాశం కల్పించాలని, ఓక్క విజ్ఞానవంతుడిగా, హైకోర్టు న్యాయవాదిగా, తెలంగాణ టీపిసిసి లీగల్ సెల్ - వైస్ చైర్మన్ గా, తెలంగాణ ఉద్యమాకారుడిగా పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా తనకి అవకాశం ఇవ్వలని  కోరాటం జరిగిందాని తెలియజేశారు  ఈ కార్యక్రమంలో గడ్డం కిరణ్ కుమార్ గారు పాల్లోన్నారు...

Monday, February 11, 2019

బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2 కోట్ల రూపాయలతో నిర్మించబోతున్న నూతన బాలుర వసతి గృహ భవనానికి భూమి చేసి, నూతన బాలుర వసతి గృహ భవన పనులను ప్రారంభించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారు..


బాలుర వసతి గృహ భవనానికి భూమి పూజ చేస్తున్న ప్రజా ప్రతినిధులు
          మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని  బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రెండు కోట్ల రూపాయలతో నిర్మించబోతున్న నూతన బాలుర వసతి గృహ భవనానికి భూమి పూజ చేసి,  నూతన బాలుర వసతి గృహ భవన పనులను ప్రారంభించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారు.. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్, హెచ్.ఓ.డిస్స్, అధ్యపకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింగం గారు, ఎంపీపీ సుభాష్ రావు గారు, పలువురు కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, TRS నాయకులు, సంబంధిత అధికారులు,  విద్యార్థిని, విద్యార్థులుతదితరులు పాల్గొన్నారు

బి.సి. నిరుద్యోగులకు మ్యాజిషయన్ లో శిక్షణ

బి.సి. నిరుద్యోగులకు మ్యాజిషయన్ లో శిక్షణ 
మ్యాజిక్ నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న యువతీ, యువకులకు ఉచిత మాజిక్ శిక్షణను వరంగల్ బి.సి. స్టడీ సర్కిల్ ఇస్తున్నది. ఈ అవకాశాన్ని పాత ఉమ్మడి వరంగల్ జిల్లా బి.సి. యువతీయువకులు ఉపయోగించుకోండి.

వివరాలకు వరంగల్ బి.సి. స్టడీసర్కిల్ ను సంప్రదించండి లేదా ఈ నెంబర్ కు కాల్ చేయండి.
నెం. 0870 2571192


Thursday, February 7, 2019

మనుషులు పుట్టిన కొన్ని ఏళ్ల తర్వాతే మాట్లాడుతారు. పుట్టగానే మాటలు ఎందుకు రావు..?

మనుషులు పుట్టిన కొన్ని ఏళ్ల తర్వాతే మాట్లాడుతారు. పుట్టగానే మాటలు ఎందుకు రావు..?

జవాబు : శబ్దం చేయడమనేది జీవి విశిష్టతకు సంబంధించిన అంశం. పరిణామ క్రమంలో వివిధ రకాల జంతువులు రకరకాలుగా శబ్దాలను చేయగలుగుతున్నాయి. అయితే శబ్దాలకు క్రమబద్ధతను కల్పించి క్రమేపీ భాషను నెలకొల్పడం మానవ జాతికే వీలయింది. అందువల్ల భాష సామాజిక పరిణామంతో ముడిపడింది. మాట్లాడాలంటే వినాలి. అయితే పుట్టక మునుపు తల్లి మాట్లాడే భాషకానీ, ఆ శబ్దాలు ప్రసారమయ్యే వాతావరణంగానీ శిశువుకి పరిచయం కావు. పుట్టగానే శ్వాస పీల్చుకునే ప్రక్రియలో మొదటి ప్రయత్నమే కేర్‌మనే ఏడుపు శబ్దం. అంతకు మించిన శబ్దాలకు శిశువు నోటిలోని భాగాలు కూడా అభివృద్ధి చెంది ఉండవు. ఎందుకంటే మాటలు పలకడానికి నోటిలోని దంతాలు, నాలుక, గొంతు కండరాలు, పెదాలు సమన్వయంతో పనిచేయాలి. ఈ సామర్థ్యం శిశువు పెరుగుతున్న కొద్దీ అలవడుతుంది. తల్లి మాటలు వింటూ పదాలు, వాక్యాలు, అక్షరాలు, శబ్దాలు గ్రహిస్తూ ఆపై లిపిని కూడా మనిషి పరిచయం చేసుకుంటాడు. భాష సామాజిక పరమైనది కాబట్టే కొన్ని భాషలు, భాషల్లోని కొన్ని పదాలు కనుమరుగవుతున్నాయి.

-Dr. Sheshagiri

రైతు రాజ్యం రావాలి, ముఖ్యమంత్రి కెసిఆర్ గారి వల్లే అది సాధ్యం - బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు

                      కిసాన్ మేళాలో ప్రసంగ్రిస్తున్నా బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ  దుర్గం చిన్నయ్య గారు
మేముసైతం బెల్లంపల్లి నియోజకవర్గం :- రైతు రాజ్యం రావాలి, ముఖ్యమంత్రి కెసిఆర్ గారి వల్లే అది సాధ్యం అని దుర్గం చిన్నయ్య గారు అన్నారు. బెల్లంపల్లి మండలంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ( ATMA ) వారి సౌజన్యంతో జరిగిన " కిసాన్ మేళా " కార్యక్రమంలో ముఖ్యఅతిథిలుగా హాజరై రైతులకు వ్యవసాయ సాగులో పాటించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారు. అనంతరం మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలీకేరి గారు, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ రాహుల్ రాజ్ గారు రైతులను ఉద్దేశించి ప్రసంగించారు...

                         కిసాన్ మేళాలో ప్రసంగ్రిస్తున్నా   మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలీకేరి గారు                                                        ఈ కార్యక్రమంలో రైతులతో పాటు  ఎంపీపీ సుభాష్ రావు గారు, ATMA చైర్మన్లు బాణయ్య గారు,ZPTC కారుకూరి రాంచందర్ ,నర్సింగరావు, రాజు గారు, ఇతర ప్రజాప్రతినిధులు, TRS నాయకులు, సంబంధిత అధికారులు, ప్రజా సంఘ నాయకులు  తదితరులు పాల్గొన్నారు ...

Tuesday, February 5, 2019

మా గ్రామాన్ని దత్తత తీసుకోండి, ఎమ్మెల్యే గారికి రంగ ప్రశాంత్ వినతి -

ఏకగ్రీవమైన నూతన లంబడి తండా గ్రామ పంచాయతీని దత్తత తీసుకోవాలని ఎమ్మెల్యే గారికి వినతి పత్రం సమర్పించిన -  రంగ ప్రశాంత్,  సామాజిక కార్యకర్త   
లంబడి తండా గ్రామ పంచాయతీ సమస్యలను వివరిస్తున్నా రంగ ప్రశాంత్, వినతి పత్రమును  స్వీకరిస్తున్నా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

  ఈ రోజు లంబడి తండా గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులలో భాగంగా 1వ మరియు 2వ వార్టు  రోడ్డు  శంకుస్థాపన పనులను ప్రారంభిం చుటకు విచ్చేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారికి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్టు మెంబర్స్, గ్రామ పెద్దలు మరియు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు అందరు కలసి సన్మానం చేయడం జరిగింది... ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు పలు అభివృద్ధి పనులకు లంబడి తండా గ్రామ పంచాయతీలో శంకుస్థాపన నిర్వహిం చాటం జరిగింది. అనంతరం ప్రముఖ సామాజిక కార్యకర్త రంగ ప్రశాంత్ ఎమ్మెల్యే గారికి వినతి పత్రం సమర్పించాటం జరిగింది.   బెల్లంపెల్లి మండలంలోని స్థానిక ఎన్నీకలల్లో ఏకగ్రీవమైన ఏకైక గ్రామం లంబడి తండా గ్రామ పంచాయతీ అని , గ్రామం అభివృద్ధికి సహాకరించాలని కోరుతుా, గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ఎమ్మెల్యేకు గారికి వినతి పత్రం సమర్పించాటం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు మాట్లడుతుా స్థానికఎన్నికల్లో ఏకగ్రీవం చేసుకున్న గ్రామస్థులందరికీ అభినందనులు తెలియజేసిన ఎమ్మెల్యే, గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది... ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్టు మెంబర్స్, గ్రామ పెద్దలు మరియు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ యువత పాల్లోన్నారు..

అతిపెద్ద_ప్రజాస్వామ్య_దేశంలో_దళితుల_స్థానం..

#అతిపెద్ద_ప్రజాస్వామ్య_దేశంలో_దళితుల_స్థానం..!! - గ్యార_నరేష్_ఓయూ

రిజర్వేషన్స్ తీసేయాలి..కులం లేదు ఎం లేదు అదరు సమానమే అని మాట్లాడే మనుషులంతా ఇప్పుడు మాట్లాడాలి...!!

పిడికెడు ఆత్మగౌరవం కోసం మేము పోరాడుతుంటే కులాలు ఎక్కడివి రిజర్వేషన్లు ఎందుకు అనే కున మేధావులారా ఇదేంది మరి...?

భారత రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకుని, రాజకీయంగా ఎదుగుతున్న అట్టడుగు వర్గాలకను .. ఆదిలోనే తుంచేస్తున అగ్రకుల ఆధిపత్య రాజకీయాలు చూడండి...!!

గ్రామ సర్పంచ్ మొదలుకొని భారత ప్రథమ పౌరుడు రాష్ట్రపతి కి కూడా తప్పలే ఈ అవమానం.. కేవలం ఈ దేశంలో దలితుడై  పుట్టినందుకు మాత్రమే ఈ అవమానాలు..!!

డిజిటల్ ఇండియా, బంగారు తెలంగాణ అని చెప్పుతూ ప్రజల చేత ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోబడిన దళితులను అవమానాలకు గురి చేస్తున్న ఈ వ్యవస్థలో... దళితుల స్థానం ఎక్కడున్నదో చూడండి...!!

బాబాసాహెబ్ ప్రవేశపెట్టిన రిజర్వేషన్లు ఆర్థికంగా కాదు.. అసమానతలు, అంతరాలు పోవడానికి అన్న విషయము గమనించాలి, రిజర్వేషన్ల గురించి తప్పుడు కూతలు కూసి మా లో కూడా పేదలు ఉన్నారనే తెలివి తక్కువ దద్దమ్మల కు ఇప్పటికైనా అర్థం కావాలి రిజర్వేషన్లు విషయం, మీరు ఆస్తి అంతస్తు లో తక్కువ అయినా మీ కులం మిమ్మల్ని ఉన్నత స్థానంలో ఉంచి గౌరవిస్తుంది , మేము ఉన్నత స్థానంలో ఉన్నా కులం పేరుతో ఇంకా అవమానిస్తూనే ఉన్నారు...!!

నరనరాన ఇమిడి ఉన్న అగ్రకుల పొగరు అనిగే వరకు... ఈ దేశంలో అట్టడుగున ఉన్న దళితుడు అగ్రపీఠం ఆక్రమించే వరకు.. ఆత్మగౌరవంతో బతికే వరకు, రిజర్వేషన్లు ఉండాల్సిందే....!!

తక్కువ కులం అనే గ్రామ సర్పంచ్ని అవమానించి, అగ్రకుల అహంకారాన్ని చూపించుకున్నా వెధవలకు బుద్ధి చెప్పాలి, ఆ గ్రామ సాక్షిగా గ్రామ సర్పంచికి ప్రభుత్వ లాంచనాలతో అంగరంగ వైభవంగా సన్మాన కార్యక్రమాలు నిర్వహించి గౌరవించాలి ...!!

భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ వారసులను అవమానించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనీ, మరే గ్రామంలో కూడా ఇలా జరగకుండా కఠిన చర్యలు ప్రభుత్వమే చేపట్టాలి ..!!

                          #గ్యార_నరేష్_ఓయూ

Sunday, February 3, 2019

33వ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీలలో జాతీయ స్థాయి గోల్డ్ మెడల్ గెలుపొందిన " ప్రముఖ ఫోటోగ్రాఫర్ జవాజి కుమార స్వామి "

  పోటీలలో గెలుపోంది జాతీయ స్థాయి గోల్డ్ మెడల్ అందుకున్న ప్రముఖ ఫోటోగ్రాఫర్ కుమార స్వామి                గతనెల జనవరి 31 నుండి ఫిబ్రవరి 3వ తేది వరకు  అరకు ,విశాఖపట్నంలో జరిగిన సిగ్మా ఆర్ట్ ఫోటోగ్రఫీ  33వ  జాతీయస్థాయి  ఫోటోగ్రఫీ పోటీలలో  మంచిర్యాల  జిల్లాకు   చెందిన ప్రముఖ  ఫోటో గ్రాఫర్ జవాజి కుమారస్వామి గారికి(బాడీ పాయింట్ లో)జాతీయ స్థాయి  గోల్డ్ మెడల్ గెలుపొందారు. ఇట్టి కార్యక్రమంలో  mc శేఖర్ గారు, ముసుని వెంకటేశ్వరరావు గారు, నరేందు గోష్ కలకత్తా  గారితో పాటు పలు రాష్ట్ర ల నుండి విచ్చేసిన 150 మంది ఫోటోగ్రాఫర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.                                                             జాతీయ స్థాయి  గోల్డ్ మెడల్ గెలుపొందినందుకు మంచిర్యాల జిల్లాకు చెందిన పలువురు   ఫోటోగ్రాఫర్స్,  స్వచ్ఛంద, సామాజిక కార్యకర్తలు జవాజి కుమారస్వామి  అభినందనలు  తెలియజేయటం జరిగింది.

Saturday, February 2, 2019

ప్రశ్న: చంద్రుణ్ణి భూమి ఆకర్షిస్తుంటే, మరి చంద్రుడు భూమిపై ఎందుకు పడడు?


జవాబు: చెట్టు నుంచి రాలిన పండు భూమిపై పడడానికి కారణం భూమికి ఉండే గురుత్వాకర్షణ బలం అని ప్రఖ్యాత భౌతిక శాస్త్రజ్ఞుడు ఐజాక్‌ న్యూటన్‌ 

17వ శతాబ్దంలో ప్రతిపాదించాడు. రాలే పండును భూమి ఆకర్షిస్తున్నట్లే చంద్రుణ్ణి కూడా భూమి ఆకర్షిస్తుందని న్యూటన్‌ ఆ రోజుల్లోనే సిద్ధాంతీకరించాడు. మరి భూమిపై చంద్రుడు ఎందుకు పడడం లేదన్న ప్రశ్నకు జవాబు కూడా ఆయనే చెప్పాడు. భూమి చంద్రుణ్ణి గురుత్వాకర్షణ బలంతో తనవైపుకు లాగుతుంటే, ఈ బలానికి లంబదిశలో చంద్రుడు కొంత వేగంతో పయనిస్తున్నాడు. ఈ చలనం వల్లే చంద్రుడు భూమిపై పడడం లేదు. ఒక వ్యక్తి కొంత నీరు ఉన్న బకెట్‌కు తాడుకట్టి తన చుట్టూ వృత్తాకార మార్గంలో కొంత వేగంతో తిప్పుతుంటే, అందులోని నీరు నేలపై పడదు. తిప్పేవేగం తగ్గించినా, తిప్పడం ఆపినా, నీటితోపాటు బకెట్‌ కిందపడుతుంది. రోదసిలో ఎలాంటి ఘర్షణ(friction) ఉండక పోవడంతో, చంద్రుని వేగంలో ఎలాంటి మార్పు ఉండదు. 

అందువల్ల చంద్రుడు భూమిపై పడకుండా ఒక నిర్దిష్ట కక్ష్యలో భూమి చుట్టూ తిరుగుతూ నెలకోక పరిభ్రమణం చేస్తూ ఉన్నాడు.

-ప్రొ||ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌,జనవిజ్ఞాన వేదిక


నుాతన మాలగురిజాల సర్పంచ్ గా వామపాక్షాల అభ్యర్థి గోమాస అశోక్ ప్రమాణ స్వీకారం

నుాతన మాలగురిజాల సర్పంచ్ గా వామపాక్షాల అభ్యర్థి గోమాస అశోక్  ప్రమాణ స్వీకారం చేయాటం జరిగింది. వారితోపాటు మెరుగు రాజేశ్వరి ఉపసర్పంచ్ గా, మాల గురిజాల పంచాయతీలో మొత్తం ఎనిమిది  మెంబర్లలో ఏడు (1వ,2వ,3వ,4వ,6వ,7వ,8వ వార్టు ) వామపక్ష వార్టు మెంబర్ లు గెలుపోందారు,  TRS నుండి  5వ వార్టు మెంబర్ గా ఓక్కరు గెలుపోందినారు. ఈ రోజు సర్పంచ్ తో పాటు  ఉపసర్పంచ్, ఎనిమిది వార్డుమెంబర్లు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.... ఈ ప్రమాణ స్వీకారానికి మరో స్పెషల్  ఆఫీసర్  దురిశెట్టి  శ్రీనివాస్ గారు, VRO బద్దన్న, కార్యదర్శి రాధిక తదితరులు పాల్లోన్నారు...ప్రమాణ స్వీకారం అనంతరం గోమాస అశోక్ సర్పంచ్ గారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని, వార్డు సభ్యుల అంగీకారంతో పనిచేస్తానని  తెలియాజేయటం జరిగింది...


నుాతన మాలగురిజాల సర్పంచ్ గా వామపాక్షాల అభ్యర్థి గోమాస అశోక్  ప్రమాణ స్వీకారం చేయాటం జరిగింది. వారితోపాటు మెరుగు రాజేశ్వరి ఉపసర్పంచ్ గా, మాల గురిజాల పంచాయతీలో మొత్తం ఎనిమిది  మెంబర్లలో ఏడు (1వ,2వ,3వ,4వ,6వ,7వ,8వ వార్టు ) వామపక్ష వార్టు మెంబర్ లు గెలుపోందారు,  TRS నుండి  5వ వార్టు మెంబర్ గా ఓక్కరు గెలుపోందినారు. ఈ రోజు సర్పంచ్ తో పాటు  ఉపసర్పంచ్, ఎనిమిది వార్డుమెంబర్లు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.... ఈ ప్రమాణ స్వీకారానికి మరో స్పెషల్  ఆఫీసర్  దురిశెట్టి  శ్రీనివాస్ గారు, VRO బద్దన్న, కార్యదర్శి రాధిక తదితరులు పాల్లోన్నారు...ప్రమాణ స్వీకారం అనంతరం గోమాస అశోక్ సర్పంచ్ గారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని, వార్డు సభ్యుల అంగీకారంతో పనిచేస్తానని తెలియాజేయటం జరిగింది...

Friday, February 1, 2019

ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న తెలంగాణ పంచాయతీ పాలక వర్గ సభ్యులకు హృదయపుార్వక శుభాకాంక్షలు - కాంపెల్లి ఉదయ్ కాంత్

 తెలంగాణ రాష్ట్రాంలో  ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న గ్రామ  పంచాయతీ పాలక వర్గ సభ్యులు గ్రామ సర్పంచ్ లకు , ఉప సర్పంచ్ లకు, వార్టు సభ్యులకు, గ్రామ సిబ్బందులకు మరియు గ్రామ అభివృద్థి కమీటి సభ్యులకు హృదయపుార్వక శుభాకాంక్షలు....  మీ  కాంపెల్లి ఉదయ్ కాంత్ , హైకోర్టు న్యాయవాది" వైస్ - చైర్మన్ " లీగల్, HR & RTI, Dept - TPCC ( తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ కమీటి )

ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న తెలంగాణ పంచాయతీ పాలక వర్గ సభ్యులలకు హృదయపుార్వక శుభాకాంక్షలు తెలియజేసిన ప్రాముఖ సామాజిక కార్యకర్త రంగ ప్రశాంత్

 తెలంగాణ రాష్ట్రాంలో  ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న తెలంగాణ పంచాయతీ పాలక వర్గ సభ్యులైన గ్రామ సర్పంచ్ లకు , ఉప సర్పంచ్ లకు, వార్టు సభ్యులకు, గ్రామ సిబ్బందులకు మరియు గ్రామ అభివృద్థి కమీటి సభ్యులకు హార్థిక మరియు హృదయపుార్వక శుభాకాంక్షలు....  మీ  రంగప్రశాంత్ -  విద్యార్థి, యువజన నాయకుడు & సామాజిక కార్యకర్త - మేము సైతం ఏడ్యుకేషనల్ రుారల్ డెవలప్ మెంట్ యుాత్ వెల్ఫేర్ సోసైటి వ్యవస్థాకులు

*HIGHLIGHTS OF BUDGET 2019**#budget2019**Tax*

*HIGHLIGHTS OF BUDGET 2019*
*#budget2019*
*Tax*

1. Within 2 years, Tax assessment will be done electronically
2. IT returns processing in just 24 hours
3. Minimum 14% revenue of GST to states by Central Govt.
4. Custom duty has abolished from 36 Capital Goods
5. Recommendations to GST council for reducing GST rates for home buyers
6. *Full Tax rebate upto 5 lakh annual income after all deductions.*
7. Standard deduction has increase from 40000 to 50000
8. Exempt on tax on second self-occupied house
9. Ceiling Limit of TDS u/s 194A has increased from 10000 to 40000
10. Ceiling Limit of TDS u/s 194I has increased from 180000 to 240000
11. Capital tax Benefit u/s 54 has increased from investment in one residential house to two residential houses.
12. Benefit u/s 80IB has increased to one more year i.e. 2020
13. Benefit has given to unsold inventory has increased to one year to two years.
*Other Areas*
14. State share has increased to 42%
15. PCA restriction has abolished from 3 major banks
16. 2 lakhs seats will increase for the reservation of 10%
17. 60000 crores for manrega
18. 1.7 Lakh crore to ensure food for all
19. 22nd AIIMS has to be opened in Haryana
20. Approval has to be given to PM Kisan Yojana
21. Rs. 6000 per annum has to be given to every farmer having upto 2 hectare land. Applicable from Sept 2018. Amount will be transferred in 3 installments
22. National kamdhenu ayog for cows. Rs. 750 crores for National Gokul Mission
23. 2% interest subvention for farmers pursuing animal husbandry and also create separate department for fisheries.
24. 2% interest subvention for farmers affected by natural calamities and additional 3% interest subvention for timely payment.
25. Tax free Gratuity limit increase to 20 Lakhs from 10 Lakhs
26. Bonus will be applicable for workers earning 21000 monthly
27. The scheme, called Pradhan Mantri Shram Yogi Mandhan, will provide assured monthly pension of Rs. 3,000 with contribution of Rs. 100 per month for workers in unorganized sector after 60 years of age.
28. Our government delivered 6 crores free LPG connections under Ujjawala scheme
29. 2% interest relief for MSME GST registered person
30. 26 weeks of Maternity Leaves to empower the women
31. More than 3 Lakhs crores for defence
32. One lakh digital villages in next 5 years
33. Single window for approval of India film makers

కేంద్ర బడ్జెట్ --2019ని కేంద్ర తాత్కాలిక ఆర్ధిక మంత్రి పీయూష్ గోయెల్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. కేంద్ర ఆర్ధిక మంత్రి హోదాలో ఆయన తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 

* ఆదాయపు పన్ను పరిమితి రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంపు

* స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50 వేలకు పెంపు

* ప్రావిడెంట్ ఫండ్‌లో పెట్టుబడులు పెడితే రూ.6.5 లోపు ఆదాయపు పన్ను మినహాయింపు

* దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది ఉద్యోగులకు లబ్ధి

* వచ్చే ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా భారత్

* భారత్‌లో ఎలక్ట్రానిక్ వాహన వినియోగం పెరిగింది

* 2030 కల్ల ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగంలో భారత్‌దే అగ్రస్థానం

* అంతర్గత జలరవాణా వ్యవస్థను ప్రోత్సహిస్తాం

* 2030 నాటికి డిజిటల్ ఇండియాలోకి భారతీయులు

* 2022 నాటికి అంతరిక్షంలో భారతీయ వ్యోమగాములు

* రానున్న 8 ఏళ్లలో 10 ట్రిలియన్ డాలర్లకు భారత ఆర్ధిక వ్యవస్థ

* నల్ల ధనాన్ని అరికట్టేందుకు చేసిన దాడుల్లో 50 వేల కోట్ల రూపాయలు సీజ్ చేశాం

* రూ.6900 కోట్ల బినామీ ఆస్తుల స్వాధీనం

* 24 గంటల్లోనే ఐటీఆర్ ప్రాసెస్, రిఫండ్

*  గతేడాది దాఖలైన రిటర్న్స్‌లో 94 శాతం యథాతథంగా ఆమోదించారు

*  ఇల్లు కొనే వాళ్లపై జీఎస్టీ భారం తగ్గిస్తాం

* నల్లధనం నిర్మూలనకు కట్టుబడి ఉన్నాం

* సినిమా నిర్మాణానికి సింగిల్ విండో అనుమతులు

* సినిమా థియేటర్లపై జీఎస్టీ 12 శాతానికి తగ్గింపు

* ఇళ్ల కొనుగోలుదారులపై జీఎస్టీ మినహాయింపుపై త్వరలో నిర్ణయం

* ఎలక్ట్రానిక్ వాహనాలకు దేశంలోనే బ్యాటరీల తయారీ.. దీని వల్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది

* మిజోరాం, మేఘాలయ రాష్ట్రాలను రైల్వేతో అనుసంధానం

* ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి రూ.15,166 కోట్లు కేటాయింపు

* ఐదేళ్లలో 34 కోట్ల జన్‌ధన్ ఖాతాలు ప్రారంభం

* ప్రత్యక్ష పన్నుల ద్వారా ఆదాయం రూ.12 లక్షల కోట్లు

* 80 శాతం పెరిగిన ట్యాక్స్‌పేయర్లు

* పన్ను మినహాయింపు నూ. 50 వేలు పెంపు

* ఆదాయపు పన్ను పరిమితి రూ. 3 లక్షలకు పెంపు

* త్వరలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం

* టెలికాం రంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలు

* ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో మొబైల్ డేటా, వాయిస్ కాల్స్

* సోలార్ విద్యుదుత్పత్తిలో 10 రెట్ల వృద్ధి

* ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రహదారులు నిర్మించాం

* ప్రతి రోజూ 27 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం

* ప్రధాన మంత్రి శ్రమ యోగి బంధన్ పేరుతో పింఛన్ పథకం

* రైల్వే రంగానికి రూ. 64,587 కోట్లు

* ఆవుల సంరక్షణకు కమిషన్ ఏర్పాటు

* రైల్వేల చరిత్రలో ఇది ప్రమాదాలు తక్కువగా ఉన్న ఏడాది

* బ్రాడ్‌గేజ్‌లో కాపలా లేని గేట్లను తొలగించాం

* సాగర్‌మాల కింద పోర్టుల ద్వారా సరకు రవాణా

* బ్రహ్మపుత్ర ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు సరకు రవాణా  

* రక్షణ రంగానికి రూ. 3 లక్షల కోట్లు

*  వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కోసం ఇప్పటికే రూ.35 వేల కోట్లు చెల్లించాం

* పీఎం కౌషల్ వికాస్ యోజన కింద కోటిమంది యువతకు శిక్షణ

* దేశవ్యాప్తంగా 9 ప్రాంతాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్లు

* సైనికులకు ప్రత్యేక అలవెన్సులు

* అంగన్‌వాడీ సిబ్బంది వేతనం 50 శాతం పెంపు

* ప్రకృతి విపత్తు వల్ల పంట నష్టపోయిన వారి రుణాల రీషెడ్యూలింగ్ 

* రీ షెడ్యూల్ చేసిన రుణాలపై 2 శాతం వడ్డీ తగ్గింపు

* ఆవుల సంరక్షణకు ప్రత్యేక పథకం

* కిసాన్ క్రెడిట్ కార్డు కింద రుణాలు

* రుణాలు సకాలంలో చెల్లించిన వారికి రాయితీలు

* గ్రామీణులకు కొత్తగా 8 కోట్ల గ్యాస్ కనెక్షన్లు

* కార్మిక ప్రమాద బీమా రూ.లక్షన్నర నుంచి రూ. 6 లక్షలకు పెంపు

* *గ్రాట్యుటీ పరిధి రూ. 10 లక్షల నుంచి రూ. 30 లక్షలకు పెంపు*

* ముద్ర స్కీం కింద రుణాలకు రూ. 7 లక్షల కోట్లు

* 60 ఏళ్లు దాటిన అసంఘటిత రంగం కార్మికులకు నెలకు రూ.3 వేల పెన్షన్

* అసంఘటిత కార్మికులు పెన్షన్ కోసం రూ.60 జమ చేయాల్సి ఉంటుంది

* ఈఎస్‌ఐ లిమిట్‌ను రూ.15 వేల నుంచి 21 వేలకు పెంపు

* రూ.15 వేల నెల జీతం వుండే వేతన జీవులకు కొత్త పథకం

* ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ పేరుతో కొత్త స్కీమ్

* నెలకు రూ. 100 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది

* ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి రూ.75 వేల కోట్లు

* పాడి, మత్స్య రైతులకు 2 శాతం వడ్డీకే రుణం

* కొత్త పెన్షన్ విధానాన్ని సరళీకరిస్తాం

* పెన్షన్‌లో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంపు

* 12 కోట్ల మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి

* 2018 డిసెంబర్ నుంచి ఈ కార్యక్రమం అమలు

* గోకుల్ మిషన్‌కి రూ. 750 కోట్లు

* గో ఉత్పాదకత పెంచడం కోసం రాష్ట్రీయ కామ్‌ధేన్ అయోగ్

* 5 ఎకరాల్లోపు ఉన్న రైతులకు రూ. 6 వేలు సాయం

* ప్రతి ఏడాది రూ. 6000 పెట్టుబడి సాయం

* చిన్న రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బు వెళుతుంది. మూడు ఇన్‌స్టాల్‌మెంట్ల ద్వారా డబ్బు అందుతుంది

* ఎఫ్‌డీఐ విధానాన్ని పూర్తిగా సరళీకరించాం

* బ్యాంకుల విలీనాన్ని చేపట్టాం

* రాష్ట్రాలకిచ్చే వాటాను పెంచాం

* గ్రామాల్లో 95 శాతం పారిశుద్ధ్యం

* బొగ్గు, స్పెక్ట్రం వేలంలో పారదర్శకతకు ప్రాధాన్యం

* ఆయుష్మాన్ భారత్‌తో పేద, మధ్య తరగతికి రూ. 3 వేల కోట్లు ఆదా

* కొత్తగా 7 ఎయిమ్స్ ఆస్పత్రులు తీసుకొచ్చాం

* హర్యానాలో కొత్త ఎయిమ్స్ రాబోతోంది.

* 22 రకాల పంటలకు మద్ధతు ధర పెంచాం

* అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాం

* ఉపాధి హామీ రూ.60 వేల కోట్లు 

* గ్రామ సడక్ యోజనకు రూ. 19 వేల కోట్లు

* నాలుగేళ్లలో 1.53 కోట్ల ఇళ్లు నిర్మించాం

* మార్చి వరకు దేశంలో అన్ని ఇళ్లకు కరెంట్ కనెక్షన్లు

* ఎల్‌ఈడీ బల్బులతో దేశంలో రూ. 50 వేల కోట్లు ఆదా చేశాం

* రూ. 3 లక్షల కోట్ల మొండి బకాయిలను రికవరీ చేశాం

* బ్యాంకులకు రూ. 2.6 లక్షల కోట్ల మూలధన సాయం అందించాం

* ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ ఇబ్బందులను అధిగమిస్తున్నాయి

* అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం



* అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాం

* ఆరో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించాం

* 2018-19కి ద్రవ్యలోటు అంచనా 3.4 శాతం

* కరెంట్ అకౌంట్ లోటును 5.6 నుంచి 2.5 శాతానికి తగ్గించాం

* మా ప్రభుత్వంలో ధరల నడ్డి విరిచాం

* మా  హయాంలో ద్రవ్యోల్బణం దిగివచ్చింది

* జీడీపీ వృద్ధి రేటులో గణనీయమైన పురోగతి

* మా ప్రభుత్వం ప్రతీ పథకాన్ని నిజాయితీగా అమలు చేస్తోంది

* గడిచిన ఐదేళ్లలో ద్రవ్యోల్బణాన్ని తగ్గించాం

* మోడీ సారథ్యంలో సుస్థిర పాలన అందించాం.

* 2020లోగా నవభారతాన్ని చూడబోతున్నారు

* విధాన నిర్ణయాల్లో వేగం పెంచాం

* దేశ ఆర్ధిక వ్యవస్థ క్రమంగా గాడినపడుతోంది.

* రైతుల ఆదాయం రెట్టింపు కావాలన్నదే మా లక్ష్యం


* అందరికీ ఇల్లు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పించడమే లక్ష్యం