పెరియార్ ఇ.వి.రామస్వామి జీవిత చరిత్ర
- జననం,రాజకీయం ప్రవేశం, ఉద్యమాలు
- పెరియార్ నిర్వహించిన పోరాటాలు
- పెరియర్ రామస్వామి పిల్లల పెంపకం ఎలా ఉండాలో చక్కగా సూచించారు
- రామాయణం గురించి పెరియార్ ఏం అన్నారు..?
- మరియు మరణం
- 👉https://youtu.be/o59iHON4yJU తెలుగు సినిమాలో పెరియార్ పుార్తి జీవిత చిత్రం
- 👉 జననం, రాజకీయం ప్రవేశం, ఉద్యమాలు మరియు మరణం వేలాది సంవత్సరాల క్రితం ఎలాంటి శ్రమ లేకుండా కూర్చొని తినడానికి , శ్రమజీవుల మీద ఆధిపత్యం చేయడానికి కులాలను , పుక్కిటి పురాణాలను పుట్టించి కర్మ, ధర్మ సిద్దాంతాలతో రాజ్యమేలుతున్న బ్రాహ్మణీయ అగ్రకుల శక్తుల ఆటకట్టించేందుకై ఎన్నో ఉధ్యమాలను నిర్మించిన పెరియార్ 1879 సెప్టంబరు 17వ తేదీన తమిళనాడులోని ఈరోడు పట్టణంలో జన్మించారు. ఈయన తండ్రి వెంకటప్పనాయకర్, తల్లి చిన్నతాయమ్మాళ్. పెరియార్ అసలు పేరు ఇ.వి.రామస్వామి. పెరియార్ అంటే తమిళంలో రుషి, జ్ఞాని అని అర్థం. పెరియార్ సంపన్న కుటుంబంలో పెట్టి పెరిగారు. పాతికేళ్ల ప్రాయంలోనే తన తండ్రికి తెలియకుండా అప్పుచేసి భూమి కొనుగోలు చేశాడని పెరియార్ ను తండ్రి మందలించడంతో బాధపడి కుటుంబం వదిలి సన్యాసిగా మారిపోయారు. అయితే ఆయన దేశంలోని ప్రధాన నగరాలన్నీ తిరిగి లోకజ్ఞానం సంపాదించారు. తర్వాత కాశీ లో బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని, తనకు జరిగిన అవమానాన్ని భరించలేక ఆకలితో దిక్కుతోచక బికారిగా తిరుగుతున్న పెరియార్ ఆచూకీని తండ్రి కనుగొని స్వయంగా ఇంటికి తీసుకెళ్లి వ్యాపార బాధ్యతలను అప్పగించారు. ముప్పై ఏళ్ల ప్రాయంలోనే కాంగ్రేస్ పార్టీ పట్ల ఆసక్తి చూపసాగారు. తొమ్మిదేళ్ల ప్రాయంలోనే భర్త చనిపోయి వితంతువుగా ఉన్న తన అక్క కూతురికి కుటుంబంలో అందరూ వ్యతిరేకిస్తున్నా రహస్యంగా పెళ్లి జరిపించారు. 1911లో పెరియార్ తండ్రి మరణించారు. పెరియార్ స్వయంకృషి , నీతి నిజాయితి , సేవాభావం మూలంగా ప్రజల చేత నీరాజనాలందుకొని ఇరవై ఎనిమిదేళ్ల వయసులోనే 1917 లో ఈరోడు నగరపాలక సంస్థకు చైర్మన్ గా ఎన్నికయ్యారు. 1919లో కాంగ్రేస్ పార్టీలో చేరే నాటికే జిల్లాలోని 29 గౌరవ పదవులు పొందాడంటే ఆయనపట్ల ప్రజల అభిమానం ఎంతటిదో ఊహించవచ్చు. పెరియార్ నాయకత్వం లేనిదే కాంగ్రేస్ పార్టీ మనుగడ లేదన్న వాతావరణం ఏర్పడిపోయింది. పార్టీ నాయకత్వమంతా బ్రాహ్మణుల చెప్పుచేతల్లో ఉందని వారిలో ఏ ఒక్కరూ మినహాయింపు లేకుండా నీఛ , నికృష్ట వర్ణాశ్రమ వ్యవస్థను బలంగా స్థిరపరచాలన్న కుటిల లక్ష్యం కలవారని పెరియార్ తెలుసుకున్నారు. ఈరోడు చైర్మన్ గా ఉన్నపుడు ప్లేగు వ్యాధి సోకి వందలమంది ప్రజలు మరణించారు. జనం భయపడి శవాలను ఎక్కడపడితే అక్కడ వదిలి భయంతో పారిపోయారు.ఈవ్యాధికి ఇంజక్షన్లు వేయించుకుంటే అమ్మవారి ( దేవత )ఆగ్రహానికి గురికావలసి వస్తుందన్న మూఢనమ్మకంతో జనం భయపడిపోయారు. పెరియార్ సహచరుతో కలసి శవాలను తన బుజాలపై వేసుకొని శివారు ప్రాంతాల్లో పూడ్పించారు. మనదేశంలో మొట్ట మొదటి సారిగా పట్టణ ప్రాంతాలకు కుళాయిద్వారా మంచినీటి సరఫరా చేయించిన ఘనత పెరియార్కే దక్కింది. కులప్రాతిపదికన విధ్య , ఉద్యోగ రంగాలలో అణగారిన కులాలకు రిజర్వేషన్లు కల్పించాలని పార్టీ మహాసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని బ్రాహ్మణ వర్గమంతా వ్యతిరేకించి కొట్టివేయించింది. దీనికి నిరసనగా 29 గౌరవపదవులకు రాజీనామా చేశారుపెరియార్. కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లాలోని వైక్కోం దేవాళయాని వెళ్లే దారుల్లో దళితులు నడవరాదంటూ శాసనాలుండేవి. ఇందుకు నిరసిస్తూ పెరియార్ పెద్ద పోరాటం నిర్వహించారు. దారుల్లో పందులు , గాడిదలు, పలురకాల జంతువులు నడుస్తున్నాయ్... సాటి మనుషులు నడవటం నిషేధమా... ఇది మానవ హక్కుల ఉళ్లంఘన అంటూ పెరియార్ ఆవీధుల్లో దళితుల్ని అంటరానివారిని నడిపించి చరిత్రని తిరగరాశారు. అలాగే దేవదాసీ దురాచారంపై చట్టాన్ని తీసుకరావాలని పోరాటంచేశారు. దేవాలయంలో ఒక కులానికి చెందిన స్త్రీలు దేవునికి దాసీలుగా నాట్యమాడుతూ రాతి బొమ్మలను రంజింపజేయాలన్న దుష్ట సాంప్రదాయం మూలంగా రెండు వేల సంవత్సరాలుగా స్త్రీలు వ్యభిచార వ్రృత్తిలోకి బలంగా నెట్టబడుతూ వచ్చారని పెరియార్ పోరాటం చేశారు.తన సామాజిక లక్ష్యాలను,చైతన్యాన్ని ప్రజల ముందుకు తీసుకువచ్చేందుకు ఒక పత్రిక ఉండవలసిన అవసరాన్ని గుర్తించి కుడిఅరసు అనే పత్రికను 1925 మే రెండున తొలి సంచికను కాంచీపురంలో ఆవిష్కరించారు.పెరియార్,తన భార్య పలువురు ఉధ్యమకారులతో సింగపూర్,మలేషియా,యూరప్,ఫ్రెంచ్,రష్యా తదితర దేశాల్లో విస్త్రృతంగా ప్రచారాన్ని చేపట్టి సత్యాన్వేషకుల సంఘం,ఉదార ఆలోచనాపరుల సంఘం,హేతువాద సంఘం,దేవుడులేని వాళ్ళ సంఘాలు స్థాపించారు.బాల్య వివాహాలపై పోరాటం చేస్తూ స్త్రీ జాతిని అవమానిస్తున్న బ్రాహ్మణేతరులకు అర్థంకాని మంత్రాలు తంత్రాలతో కూడిన హిందూ పెళ్ళి సాంప్రదాయాలను పాటించకుండా ,పురోహితున్ని పిలవకుండా పూల దండలు మార్చుకొని పెళ్ళిచేసుకొనే స్వాభిమాన పెళ్ళి విధానాన్ని పెరియార్ పరిచయం చేశారు.
- 👉 పెరియార్ నిర్వహించిన పోరాటాలు
1.మనదేశంలో మొట్ట మొదటి సారిగా పట్టణ ప్రాంతాలకు కుళాయిద్వారా మంచినీటి సరఫరా చేయించిన ఘనత పెరియార్కే దక్కింది.
2.పెరియార్ స్వయంకృషి , నీతి నిజాయితి , సేవాభావం మూలంగా ప్రజల చేత నీరాజనాలందుకొని ఇరవై ఎనిమిదేళ్ల వయసులోనే 1917 లో ఈరోడు నగరపాలక సంస్థకు చైర్మన్ గా ఎన్నికయ్యారు. 1919లో కాంగ్రేస్ పార్టీలో చేరే నాటికే జిల్లాలోని 29 గౌరవ పదవులు పొందాడంటే ఆయనపట్ల ప్రజల అభిమానం ఎంతటిదో ఊహించవచ్చు.
3.కులప్రాతిపదికన విధ్య , ఉద్యోగ రంగాలలో అణగారిన కులాలకు రిజర్వేషన్లు కల్పించాలని పార్టీ మహాసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని బ్రాహ్మణ వర్గమంతా వ్యతిరేకించి కొట్టివేయించింది. దీనికి నిరసనగా 29 గౌరవపదవులకు రాజీనామా చేశారుపెరియార్.
4.కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లాలోని వైక్కోం దేవాళయాని వెళ్లే దారుల్లో దళితులు నడవరాదంటూ శాసనాలుండేవి. ఇందుకు నిరసిస్తూ పెరియార్ పెద్ద పోరాటం నిర్వహించారు. దారుల్లో పందులు , గాడిదలు, పలురకాల జంతువులు నడుస్తున్నాయ్... సాటి మనుషులు నడవటం నిషేధమా... ఇది మానవ హక్కుల ఉళ్లంఘన అంటూ పెరియార్ ఆవీధుల్లో దళితుల్ని అంటరానివారిని నడిపించి చరిత్రని తిరగరాశారు.
5.అలాగే దేవదాసీ దురాచారంపై చట్టాన్ని తీసుకరావాలని పోరాటంచేశారు. దేవాలయంలో ఒక కులానికి చెందిన స్త్రీలు దేవునికి దాసీలుగా నాట్యమాడుతూ రాతి బొమ్మలను రంజింపజేయాలన్న దుష్ట సాంప్రదాయం మూలంగా రెండు వేల సంవత్సరాలుగా స్త్రీలు వ్యభిచార వ్రృత్తిలోకి బలంగా నెట్టబడుతూ వచ్చారని పెరియార్ పోరాటం చేశారు.
6. బాల్య వివాహాలపై పోరాటం చేస్తూ స్త్రీ జాతిని అవమానిస్తున్న బ్రాహ్మణేతరులకు అర్థంకాని మంత్రాలు తంత్రాలతో కూడిన హిందూ పెళ్ళి సాంప్రదాయాలను పాటించకుండా ,పురోహితున్ని పిలవకుండా పూల దండలు మార్చుకొని పెళ్ళిచేసుకొనే స్వాభిమాన పెళ్ళి విధానాన్ని పెరియార్ పరిచయం చేశారు.
- 👉 పెరియర్ రామస్వామి పిల్లల పెంపకం ఎలా ఉండాలో చక్కగా సూచించారు
" మీ చెప్పు చేతల్లో పిల్లల్ని పెంచాలని, మీ మూర్ఖపు, మూఢాచారపు భావాల్ని వారికి అంటగట్టకండి !
దేవుడు వున్నాడని గుళ్ళూ,గోపురాలు తిప్పించి , వారిచే దండాలు, పూజలు చేయించకండి !!
పిల్లల చదువు కోసం మీరు ఎంతైనా కష్టపడండి , అంతేగానీ అన్ని కష్టాల్ని ఆ కనిపించని దేవుడే తీర్చేస్తాడని , పిల్లలకి లేని పోని భ్రమలు మాత్రం కల్పించి చెప్పకండి !!!
దేవుడే వున్నడని మీరు గాఢంగా నమ్మిస్తే, మీ పిల్లల్లో స్వంత వ్యక్తిత్వ వికాసం గానీ, స్వంత ఆలోచనా విధానం గానీ వుండదు - అన్నిటికీ ఆ దేవుడు మీదే భారం వేసే బలహీనులై పోతారు !!!!
పిల్లల్లో మేధావితనం పెరగాలి గానీ, భక్తి భావన పెరిగినా ప్రయోజనం లేదు.
నిజానికి ---
దేవుడు వున్నాడా లేడా అని నిర్ణయించుకో వలసింది మీ పిల్లలే , ఉన్నాడు అనే ఓ అబద్దమైన నమ్మకాన్ని మాత్రం మీరు కలిగించకండి !
అప్పుడే మీ పిల్లలకు మీరు మేలు చేసినవారౌతారు !!
స్వంత వ్యక్తిత్వం స్వంత మనస్తత్వం, స్వంత ఆలోచనా విధానం లేని వాళ్ళు యీ భూమ్మీద చాలా మంది వున్నారు -- వారిలో మీ పిల్లలు ఒకరిగా వుండ కూడదు -- ఆ మందలో కల్సిపోయి అసలే వుండ కూడదు !!
మీ పిల్లలకు మీరు మొదట్నుంచీ నేర్ప వలసింది మంచి వ్యక్తిత్వం, మూఢ భక్తిత్వం మాత్రం కాదు !!!
👉 పుట్టినప్పుడు మీరు ఏ మతం లో పుట్టారో మీకు తెలుస్తుందా..? పెరుగుతున్న కొద్దీ మతం , కులం అన్న విషయాలు ఇటు తల్లిదండ్రులు , అటు సమాజం నూరిపోస్తుంది. చదువుకుని ఉద్యోగంలో స్థిరపడేవరకు కూడా మనం తల్లిదండ్రులు సమాజం నూరిపోసిన కులమత భావజాలం లోనే బతుకుతాము. 25-30 ఏళ్లు దాటాక ప్రతి వ్యక్తికి ఒక స్థిత ప్రజ్ఞత వస్తుంది. అప్పుడు చిన్నప్పటి నుండి నూరిపోసిన మూర్ఖపు భావాలన్నీ పటాపంచలు అయి మనదైన ఒక ప్రత్యేక వ్యక్తిత్వం , ఒక ప్రత్యేక దృక్పథం ఏర్పడుతుంది. ఆ దృక్పథమే మనల్ని సరైన లక్ష్యం దిశగా నడిపిస్తుంది.
- 👉 రామాయణం గురించి పెరియార్ ఏం అన్నారు..?(రామాయణం-యదార్థ పరిశీలన పుస్తకం నుండి)"
తోలి పలుకు :-
పెరియార్ .వి రామస్వామి గారు రాసిన "రామాయణం-(యదార్థ పరిశీలన)" పుస్తకంలోని వారి మాటలు చదవండీ...
రామయాణానికి ఏ చరిత్ర ఆధారంలేదు...
అదోక కల్పిత రచన ,దాని ప్రకారం రాముడు తమిళుడు కాడు.తమిళదేశానికి సంబంధించినవాడుా కాదు..అతను ఉత్తర భారతం వాడు.
అతను చంపిన రావణుడు లంకకు రాజు,లంక అంటే దక్షిణ తమిళనాడు...
కించిత్తు అయిన తమిళ సంస్కృతి (తిరుక్కురల్ సంస్కృతి)రాముడిలో లేదు.అతనికి లాగానే అతని భార్యకుాడా తమిళ గుణగణాలు లేని ఉత్తర భారత మవిషి.
.తమిళనాడుకు చెందిన ఆడ,మగవాళ్లను కోతుల్లాగ,రాక్షసుల్లాగ అసహ్యంగా చిత్రీకరించారు..
రామయణం యుద్థంలో ఉత్తరభారతానికి సంబంధించిన వాడెవడుా బ్రామ్హడు లేక ఏ ఆర్యుడు (దేవుడు)ప్రాణాన్ని పోగోట్టుకోలేదు.
.ఓక ఆర్యుడి కుర్రాడు జబ్బు వచ్చి చచ్చాడని వాడి కోసం ఓక శుాద్రుడు తన ప్రాణాన్ని పణంగా చెల్లించాడు.యుద్ధంలో ప్రాణాలు పోగేట్టుకున్న వాళ్లందరుా తమిళులు మాత్రమే.వాళ్లనే రాక్షసులన్నారు..
రావణుడు రాముడి భార్య సీతను ఎతితుకెళ్లాడు,ఎందుకంటే అతని చెల్లెలి అవయవాల్లి కోసి కురుాపిని చేశాడు.రావణుడు చేసిన ఈ పనికి లంకనెందుకు తగల బెట్టాలి..?లంక వాసుల్ని ఎందుకు చంపాలి ? ఈ కథ యెుక్క ఉద్దేశ్యం తమిళుల్ని నీచంగా చుాయించటం. తమిళనాడులో ఇంకా ఈ కథను గౌరవించటం అంటే ఆ ప్రజల స్వాభిమానాన్ని దెబ్బతీయటం,కించపరచటముా అవుతుంది..
రాముడులోగాని సీతలోగాని దేవాంశమైనది కుాడా ఏమీ లేదు.
స్వతంత్రంలాంటిది వచ్చిందని అనుకుంటున్న తరువాత తెల్లవాళ్ల విగ్రహాల్ని తీసేశారు.వాళ్ల పేర్లున్న స్తలాల్ని మార్చి వాటికి బదులు భారతీయుల పేర్లు పెట్టారు.అట్లాగే తమిళుల గౌరవాన్ని కించపరచే ఆర్యదేవుళ్లను .వాటి ప్రాముక్యతను తీసి అవతల పారేయాలి.నరనరాల్లో ద్రావిడ రక్తం పారుతున్న ప్రతి తమిళుడు ఈ పనిచేయించటం తన కర్తవ్యంగా భావించి ప్రతిగ్న చేయాల్సి ఉంది
డిసెంబరు 19 న చెన్నాపట్నం త్యాగరాయనగర్ లో ఆలోచనా పరులమండలిలో జరిపిన సదస్సులో తన చివరి సందేశాన్నిస్తూ వేదికపైనే కుప్పకూలిపోయారు పెరియార్.వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించి ఆతర్వాత వేలూరు సిఎంసి ఆసుపత్రిలో చేర్పించారు. డిసెంబరు 23న వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆరాత్రి 11గంటలకు స్పృహకోల్పోయి కోమాలోకి వెళ్లి మరునాడు 24 ఉదయం 7-40 నిమిషాలకు మరణించారు. పీడిత ప్రజల మానాభిమానాల పరిరక్షణకోసం , వారి హక్కులకోసం సుదీర్ఘకాలం పోరాటం చేస్తూ తిట్లను, నిందల్ని , చెప్పుల దెబ్బల్ని సైతం ఎదుర్కొన్న పెరియార్ , లక్షలాది గుండెల్లో నిరుపమాన స్థానాన్ని సంపాదించుకొని మరణం లేని అమరజీవిగా నిలిచిపోయారు. మతతత్వ విషం ఎల్లెడలా వ్యాపిస్తున్న తరుణంలో పెరియార్ జీవితం, పోరాటాలు ఎంతగానో స్పూర్తిదాయకం.పెరియార్ E.V రామస్వామి గారి పోరాటాలు
- 👉మరణం:-
డిసెంబరు 19 న చెన్నాపట్నం త్యాగరాయనగర్ లో ఆలోచనా పరులమండలిలో జరిపిన సదస్సులో తన చివరి సందేశాన్నిస్తూ వేదికపైనే కుప్పకూలిపోయారు పెరియార్.వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించి ఆతర్వాత వేలూరు సిఎంసి ఆసుపత్రిలో చేర్పించారు. డిసెంబరు 23న వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆరాత్రి 11గంటలకు స్పృహకోల్పోయి కోమాలోకి వెళ్లి మరునాడు 24 ఉదయం 7-40 నిమిషాలకు మరణించారు. పీడిత ప్రజల మానాభిమానాల పరిరక్షణకోసం , వారి హక్కులకోసం సుదీర్ఘకాలం పోరాటం చేస్తూ తిట్లను, నిందల్ని , చెప్పుల దెబ్బల్ని సైతం ఎదుర్కొన్న పెరియార్ , లక్షలాది గుండెల్లో నిరుపమాన స్థానాన్ని సంపాదించుకొని మరణం లేని అమరజీవిగా నిలిచిపోయారు. మతతత్వ విషం ఎల్లెడలా వ్యాపిస్తున్న తరుణంలో పెరియార్ జీవితం, పోరాటాలు ఎంతగానో స్పూర్తిదాయకం.పెరియార్ E.V రామస్వామి గారి పోరాటాలు
👉 సేకరణ : రంగ ప్రశాంత్




No comments:
Post a Comment