Tuesday, April 2, 2019

అణిచివేయబడ్డ ప్రజల బాధల స్వరాలే అతనినాదం ' పాటల పరివ్రాజకుడు డప్పు ప్రకాష్ ' ....

అణిచివేయబడ్డ ప్రజల బాధల స్వరాలే అతనినాదం
' పాటల పరివ్రాజకుడు డప్పు ప్రకాష్ ' ....

నేడు డప్పు ప్రకాష్ అన్న 
   - మహాపరినిర్వాణం ( 2-4-2017 ) చెందిన సందర్భం గా యాదిలో .....
https://youtu.be/rWHgr2kJgkI

అతని గొంతు ఉక్కు కంఠం
అతని పాట నీలి విప్లవం
అతని డప్పు మనువాదుల
గుండెల్లో దిగబడ్డ గునపం
అతను పాటల సంచారి
అంబేద్కర్ ఆశయ బాటసారి
కాన్షీరాం కలల కార్యకర్త
దళిత ఉద్యమాల ఊపిరి సలపని
పోరాటాల పాట
అతనొక మహాగాయకుడు
పాటల నుండి మంటలు పుట్టించగలడు
మనిషిని మేల్కొల్పగలడు
మానవత్వాన్ని తట్టి లేపగలడు
కలేకూరి ధిక్కార కలానికి
శబ్ధరూపం డప్పు ప్రకాష్

తెనాలి పట్టణంలో ఒక మిత్రుని ఇంటికి వచ్చిన డప్పు ప్రకాష్ 2017 ఏప్రిల్ 2 సూమారు రాత్రి 9 గంటల సమయంలో బయటకు వచ్చి ఒక కొట్టు అరుగు మీద కుప్పకూలి తుది శ్వాస విడిచాడు.
ఆ విధంగా ఒక పాటల సంచారి నడక అగిపోయింది. ఈ వార్త మిత్రుల ద్వారా మీడియాకు చేరి తుదకు రాష్ర్టంలోని ఉద్యమ కారులకు , అతనితో పరిచయం ఉన్న మిత్రులకు దావానలంలా చేరుకుంది. ఈ వార్త అందుకున్న వేంటనే రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న మిత్రులందరూ 
తెనాలికి చేరుకుని అంతిమ సంస్కారాలను ఘనంగా నిర్వహించారు. పత్రికల్లో వచ్చినట్లు అతను అనాధగా చనిపోలేదు . ఆకస్మాతుగా ఒంటరిగా చనిపోయినా ఉద్యమ సహచరుల ఘనమైన నివాళుల మధ్య హుందాగా ఈ లోకం నుండి సాగనంప బడ్డాడు. సామాజిక ఉద్యమ నేత , సీనియర్ న్యాయవాది వై.కోటేశ్వర్రావు, హక్కుల ఉద్యమనేత జి.యస్ .నాగేశ్వర్రావు,సీనియర్ న్యాయవాదులు, ఉద్యమ నేతలు పి.పి.ఆర్ ., వి.సాగర్ ,అమర్తలూరి రత్న ప్రసాద్ ,దళిత నాయకులు నందేటి ప్రభాకర్ , సిర్రా భగత్ సింగ్ ,
నూకతోటి బాబురావు ,కోడూరి బాబు, జి.ఆర్.భగత్ సింగ్ ,నల్లాపు కోటి ,మెండెం సంతోష్ కుమార్ ,మేడికోండ సునీల్కుమార్ ,దేవరపల్లివీరయ్య ,డా.సాంబశివరావు,మద్దు అంకయ్య ,రేపల్లే ప్రసాద్,ఆంజనేయులు ( ప్రకాశం జిల్లా), డా. నూకతోటి రవికుమార్ , మాతంగి దీలిప్ కుమార్ ,ఉన్నవ వినయకుమార్ , 
బహుజన రచయితల వేదిక ,సామాజిక న్యాయపోరాట సమితి,రమణ,కె.వి.పి.యస్, సమతాసైనిక్ దళ్ ,ఎం.ఆర్.పి.ఎస్. కార్యకర్తలు నాయకులతో పాటు ఇతర మిత్రులు , ప్రజాసంఘాలు కార్యకర్తలు అధిక సంఖ్యలో 'డప్పు
ప్రకాష్ ' నాటి అంతిమయాత్రలో పాల్గోన్నారు.
సొంత ఆస్థిలేకుండా ,సొంత ఇల్లులేకుండా,కుటుంబాన్నించి దూరంగా ఉంటూ ఎవరు ఎంతిస్తే అంతే తీసుకుని ఒక ఊరి నుండి మరొక ఊరుకు ప్రయాణిస్తూ అగ్రకులహంకార ,రాజ్యహింసలకు వ్యతిరేఖంగా
మొత్తం తన జీవితాతం ప్రజల్ని చైతన్యం చేయడానికి తన గళాన్నిచ్చి మోయడమనేది చిన్న విషయం కాదు.'డప్పు ప్రకాష్ 'చనిపోయంతవరకూ అతని సొంత వూరు ఎక్కడో,ఏ ప్రాంతం వ్యక్తో ,చివరకు ఇంటి పేరు ఏమిటో కూడా చాలా మందికి తెలిదు.

ఆ వివరాలు తెల్సుకోవడానికి తెనాలికి చెందిన 
ఎస్సీ ,ఎస్టీ ఉద్యోగ సంఘనాయకులు శ్యామ్ షా గారు సేకరించిన సమాచారంతో 'డప్పు ప్రకాష్ '
తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తని,కొత్తగూడెంలో జన్మించి గోదావరీఖనిలో
స్థిరపడ్డారని తెలిసింది. అతను జళనాట్యమండలిలోగద్దర్ బృదంలో పనిచేసాడు.కారంచేడు సంఘటన తరువాత దళితఉద్యమప్రస్థానాన్నికొనసాగించాడు.ఆంధ్రా ,తెలంగాణ ,రాయలసీమఅనే ప్రాంతీయ సరిహద్దులను జయించి జీవించాడు ప్రకాష్ . ఆంధ్రప్రదేశ్ లో కారంచేడు,చుండూరు ,లక్షింపేట ,గోకరాజు పల్లిలో దళితులపై దాడులు జరిగినప్పుడు ఉద్భవించిన ఉద్యమంలో తన వంతు కర్తవ్యంగా ఎన్నో పాటలతో ఉద్యమ  చైతన్యాన్ని రగిలించాడు.
దాదాపు ఏడు పదుల వయస్సులో కూడ అతని కంఠం కంచులా మోగేది.కేవలం దాడులు జరిగినప్పుడే కాకుండా రాష్ర్టంలో ఎక్కడ సాహిత్య 
సభలు జరిగినా ,ఆయా ప్రాంతల్లో స్థానికంగా జరిగే 
అన్ని కార్యక్రామలకు విధిగా హాజరై తన గొంతును 
వినిపించేవాడు. ఎవరు చెప్పిన చెప్పకపోయినా
ఆ వివరాలను ఎట్లాగో తెలుసుకుని హాజరవటం 
ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచేది. ' డప్పు ప్రకాష్ '
దళిత విప్లయోద్యమ పాటలు పాడినప్పటికి అతని గొంతులో ' కలేకూరి ప్రసాద్ 'రాసిన పాటలు
అద్భుతంగా పలికేవి.ఆపాటలతోతాను
హాజరయ్యే సభలను హోరేతిస్తాడు .ఎందుకంటే
'కలేకూరికి 'అతను వీరభిమాని! ప్రకాష్ కు 'కంచికచర్ల'తో మంచి అనుభందం వుండేది.కలేకూరి అమరుడైన తర్వాత 'కలేకూరి'జయంతి సభలను నిర్వహించాలని మమ్మల్నందరిని పురిగొల్పి రాష్ర్టం లోని రచయితలు ,కవులు ,కళాకారులు ,ఉద్యమ కారులతో చర్చలు జరిపేవాడు. ' కంచికచర్ల 'లో
నాతోపాటు ( తంగిరాల - సోని),నీలం దాసు,బొద్దుకోల్ల శ్రీను,వేల్పుల శ్రీను,సర్వేశ్వరరావు
వంటి వారితో చాలా సన్నిహితంగా తిరిగేవాడు.
ఆ మాటకొస్తే రాష్ట్రంలో ప్రతి జిల్లాతోటి ,ప్రతి ప్రాంతంతోటి అతనికి అనుబంధం ఉండేది. అందుకే ప్రతి ఒక్కరూ 'డప్పు ప్రకాష్ 'మాకు చాల దగ్గరగా ఉండేవాడని అంటారు.అందరి హృదయాల్లో అంతటి గాఢమైన చెరిగిపోని ముద్ర వేసాడు . ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి' డప్పు ప్రకాష్ 'సంస్మరణ సభను 2017 జూన్ 11ఆదివారం తెనాలిలోని ఎన్జీఓస్ కళ్యాణ మండపంలో సాయంత్రం 5 గంటల నుండి రాత్రి
8 వరకు శ్యామ్ షా గారి నేతృత్వంలో జరిగింది.
రాష్ర్ట వ్యాప్తంగా అనేక మందికి సమాచారం అందించి ,హాజరయ్యేట్లు చూసారు.ఈ సంస్మరణ 
సభను ఎక్కువగా పాటలు ,అతి తక్కువగా డప్పు ప్రకాష్తో ఉన్న అనుభంధాన్ని నెమరువేసుకునే 
,జ్ఞాపకాలనుమాటలతో ముందుకు నడిపించారు.
ఈ కార్యక్రమంలో తమ పాటలతో నివాళులు 
అర్పించడానికి ప్రజ పాటల తూటా ఉదయ్ భాస్కర్ ,ప్రజానాట్యమండలి కళాకారుడు రమణ తమ సహచరులతో కలిసి ప్రకాష్ కు పాటల 
నీరాజనాలర్పించారు. 
ఉద్యమ సహచరులు ,ఆత్మీయ మిత్రులు ,కవులు
,రచయితలు,కళాకారులు పాల్గోన్నారు.గద్దరు
బృందంలో ప్రకాష్ తో పాటు పనిచేసిన 'పుష్పక్క',
వచ్చారు.మరియు డా.నూకతోటి రవికుమార్,
డా.చుక్కా నాగభూషణం,బెందాళం కృష్ణారావు,
కేంద్ర సెన్సార్ బోర్డ్ సభ్యులు దిలిప్ రాజా,ఎస్ .ఎస్ సుకుమార్ ,ఎస్.ఎన్.పి.యస్.
రాష్ర్ట నాయకులు ,న్యాయవాది గొల్లపల్లి అంబేడ్కర్ ,బహుజన కెరటాలు పత్రిక వ్యవస్థపకులు పల్నాటి శ్రీరాములు ,కాలజ్ఞానం పత్రిక ఎడిటర్ పి.మురళీకుమార్ ,భీమ్ భూమి
పత్రిక సంపాదకులు దిలిప్ కుమార్ , 
కంచర్ల శ్రీనివాస్ ,మాలమహానాడు రాష్ర్ట అధ్యక్షులు పంతగాని రమేష్ అనేక మంది నాయకులు ,సాహితికారులు ,కళాకారులు పాల్గొన్నారు......

                                            

( కొంత చేర్పులు మార్పులు చేసి ప్రచురించిన  'కాలజ్ఞానం 'మాసపత్రిక ఎడిటర్ పి.మురళికుమార్ అన్నకు జైభీంలు )

                Source :-  తంగిరాల - సోని -9676609234

                                                 

No comments:

Post a Comment