- రాష్ట్ర అధ్యక్షులుగా గొర్రె శ్రీనివాస్ ,
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాస్తిక్ రాకేష్ నియమకం.
- ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు డా,, జయగోపాల్ గారు వెల్లడి.
![]() |
| నియమక పత్రం అందజేస్తున్నా ఆ సంస్థ వ్యవస్థపాకులు డా,,జయగోపాల్ గారు |
సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడుగా గొర్రె శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాస్తిక్ రాకేష్ లని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకులు డా,,. జయగోపాల్ గారు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ మూఢ నమ్మకాలు నిర్ములన కోసం 13 సంవత్సరాల నుండి SSF తో కలిసి పని చేస్తున్న నాపై నమ్మకం ఉంచి నాకు రాష్ట్ర అధ్యక్షుడుగా బాధ్యతలు అప్పగించిన వ్యవస్థాపకులు గారికి మరియు రాష్ట్ర కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. మూఢ నమ్మకాలు నిర్ములన చట్టం కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా నాస్తిక్ రాకేష్ మాట్లాడుతూ కులం పేర, మతం పేరిట జరుగుతున్న ఘోరాలను అరికట్టేందుకు పాటుపడతామని, శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తామని తెలిపారు. గడిచిన 15 ఏళ్లలో వేలాది పాటశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులకు అవగహన కార్యక్రమాలు చేయడమే కాకుండా గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పించామని ఇకపై మూఢ నమ్మకాలు నిర్ములన తో పాటు విద్యార్థి, ప్రజా సమస్యల పరిష్కారానికి జరిగే పోరాటాల్లో కూడా ముందుండి పని చేస్తామని తెలిపారు.


No comments:
Post a Comment