ఏకగ్రీవమైన నూతన లంబడి తండా గ్రామ పంచాయతీని దత్తత తీసుకోవాలని ఎమ్మెల్యే గారికి వినతి పత్రం సమర్పించిన - రంగ ప్రశాంత్, సామాజిక కార్యకర్త
లంబడి తండా గ్రామ పంచాయతీ సమస్యలను వివరిస్తున్నా రంగ ప్రశాంత్, వినతి పత్రమును స్వీకరిస్తున్నా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
ఈ రోజు లంబడి తండా గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులలో భాగంగా 1వ మరియు 2వ వార్టు రోడ్డు శంకుస్థాపన పనులను ప్రారంభిం చుటకు విచ్చేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారికి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్టు మెంబర్స్, గ్రామ పెద్దలు మరియు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు అందరు కలసి సన్మానం చేయడం జరిగింది... ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు పలు అభివృద్ధి పనులకు లంబడి తండా గ్రామ పంచాయతీలో శంకుస్థాపన నిర్వహిం చాటం జరిగింది. అనంతరం ప్రముఖ సామాజిక కార్యకర్త రంగ ప్రశాంత్ ఎమ్మెల్యే గారికి వినతి పత్రం సమర్పించాటం జరిగింది. బెల్లంపెల్లి మండలంలోని స్థానిక ఎన్నీకలల్లో ఏకగ్రీవమైన ఏకైక గ్రామం లంబడి తండా గ్రామ పంచాయతీ అని , గ్రామం అభివృద్ధికి సహాకరించాలని కోరుతుా, గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ఎమ్మెల్యేకు గారికి వినతి పత్రం సమర్పించాటం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు మాట్లడుతుా స్థానికఎన్నికల్లో ఏకగ్రీవం చేసుకున్న గ్రామస్థులందరికీ అభినందనులు తెలియజేసిన ఎమ్మెల్యే, గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది... ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్టు మెంబర్స్, గ్రామ పెద్దలు మరియు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ యువత పాల్లోన్నారు..
No comments:
Post a Comment