27 వ జాతీయ నాస్తిక మేళా కరపత్రం ఆవిష్కరణ.
" గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని చార్వాక ఆశ్రమం లో ఫిబ్రవరి 9,10 తేదీల్లో జరిగే 27వ జాతీయ నాస్తిక మేళా ను విజయవంతం చేయాలని " కడప జిల్లా హేతువాద సంఘం నాయకులు పిలుపునిచ్చారు . ఈ సందర్భంగా వారు జిల్లా కేంద్రమైన కడపలో డాక్టర్ అశోక్ కుమార్ వైద్య శాల యందు జాతీయ నాస్తిక మేళా కరపత్రాన్ని ఆవిష్కరించారు . తరతరాల మానవ అనవసరమైన శాస్త్రీయ వైజ్ఞానిక దృక్పథమే నాస్తికత్వమన్నారు. శ్రమ దోపిడీ పై ఆధారపడిన ఆధిపత్య మనువాద సంస్కృతికి ప్రత్యామ్నాయం గా నాస్తిక మేళా నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు భారత సమాజం రోజురోజుకి సాంస్కృతికంగా మూఢ విశ్వాసాలమయంగా తయారుకావడం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. శబరిమల ఆలయంలో అయ్యప్ప భక్తి ని వ్యాపార స్థాయికి పెరిగిన పరిశ్రమగా మార్చిన పిదప ఆలయ ప్రవేశం లోని కొన్ని ఆంక్షలను సుప్రీంకోర్టు రద్దు పరిచిందని అలాంటి ఆంక్షలే మహారాష్ట్రలోని శనీశ్వరాలయం లో ఉంటే బొంబాయి హైకోర్టు వాటిని రద్దు పరిచినప్పుడు భారతీయ జనతా పార్టీ స్వాగత్ ఇచ్చినట్లు శబరిమల లో కూడా చేయొచ్చు కదా అని ప్రశ్నించారు . కర్ణాటక మహారాష్ట్ర ప్రభుత్వాలు మూఢవిశ్వాసాల నిరోధక చట్టాలు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వం కూడా ఆమోదించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాస్తిక సమాజం నాయకులు నాగార్జున్ , గంగా సురేష్, పల్లవోలు రమణ, కొమ్మద్ది ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment