Friday, December 13, 2019

మహిళల ఆత్మ రక్షణ కై అవగాహన సదస్సు

మహిళల ఆత్మ రక్షణ కై అవగాహన సదస్సు
 ప్రసంగిస్తున్నా తాళ్లగురజాల ఎస్ఐ సమ్మయ్య గారు
బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామ యువత అధ్వర్యంలో  మహిళల ఆత్మ రక్షణ కై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  వార్టు మెంబర్ బుడిమే విజయ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి తాళ్లగురజాల ఎస్ఐ సమ్మయ్య గారు ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహిళలు మగవారితో దీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కానీ ఏ రంగాల్లో అయిన మహిళలకు వేధింపులు తప్పడం లేదు.. కావున మహిళలు, పిల్లలు ఆత్మ రక్షణ కొరకు చిన్న నాటి నుండి కరాటే, తైక్వందో, మార్షల్ ఆర్ట్స్ వంటి క్రీడల్లో దృష్టి సారించాలన్నారు.. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు  శైలజ గారు, పేరెంట్స్ కమిటీ చైర్మన్ బచ్చలి శంకర్, గ్రామ నాయకులు సుభాష్ రావు,దర్ని సత్యనారాయణ, జంబోజి రాజ్ కుమార్, జడి మహేష్, అనవేని స్వప్న, కొల్లూరి విష్ణు, పొలంపెళ్లి రాజు, బండి మల్లేష్,  విద్యార్థి JAC చైర్మన్  రంగ ప్రశాంత్  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment