Monday, March 25, 2019

తహశీల్దార్ కార్యాలయానికి తాళంవేసి ధర్నా వేస్తున్నా రైతు కుటుంబ సభ్యులు

  • తమ్మునికి తెలియకుండా అన్నకు పట్టా చేసిన రెవెన్యూ సిబ్బందులు
  • పట్టించుకోని అధికారులు, న్యాయం చేయాలని రైతు కుటుంబ సభ్యుల నిరసన.

      స్యుాస్ టుాడె, కొమురం భీం జిల్లా : కొమురం భీం,ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం అనుకొడ గ్రామానికి చెందిన మన్ సింగ్ మరియు దేవ్ సింగ్ ఇద్దరు అన్నతమ్ములు వారి తండ్రి గారికి చెందిన వారసత్వ భూమి 5 ఎకరాలు ఉంది.దానిని సాగుచెసుకోని జీవనం కోనసాగిస్తున్నారు, కానీ అనుకోడ గ్రామానికి చెందిన పట్వారీ ధనరాజ్ మరియు గిర్దవర్ వారి ఇద్దరి ఇష్టపుార్వకంగా తండ్రికీ చెందిన వారసత్వ భూమిని సమానంగా పంచకుండా " దేవ్ సింగ్ "  అనుమతి లేకుండా పట్వారీ మరియు గిర్థవర్ మన్ సింగ్ దగ్గర డబ్బులు తీసుకొని 5 ఎకరాలు పట్టా చేయించాడని గత ఏడాది నుండి " కాగజ్ నగర్ తహశీల్దార్ కార్యాలయం " చుట్టూ తిరుగుతున్న న్యాయం చేయడం లేదని దేవ్ సింగ్ కుటుంబీకులు తహశీల్దార్ కార్యాలయనికి వచ్చిన అధికారులు పట్టించుకోక పోవడంతో తాళం వేసి ఆందోళన చేస్తున్నారు.

No comments:

Post a Comment