Friday, March 1, 2019

ప్రేమను చంపే హంతకులకు నిలమే ఈ దేశం

ప్రేమించను అంటే వాడు చంపేస్తడు
ప్రేమించాను అంటే నాన్న చంపేస్తడు
వాడేమో ప్రేమంటడు
నాన్నేమో కులమంటడు

ప్రేమ పేరుతో వాడి వేధింపులు
పరువు పేరుతో నాన్న బెదిరింపులు
వీళ్ళ స్వార్ధపు ఆటలో  ఆటబొమ్మని నేనే 
నలిగిపోతూ కుమిలిపోతూ
దుఃఖ సాగరంలో మునిగిపోతూ
తరతరాల నుండి కొనసాగుతున్న 
ఈ స్వార్ధయుద్ధంలో బలైపోయేది నేనే

కళ్ళ ముందున్న నాకంటే కనిపించని పరువే ప్రాణమంటరు 
కూడు పెట్టని కులం కోసం కన్నబిడ్డను బూడిద చేసి కులరక్కసి చేతిలో 
ప్రేమ ఓడిపోవడానికి కారణంగా మిగిలిపోతరు మమ్మల్ని కన్నవాళ్ళు.
ప్రేమంటే ఎంటో తెలియని వింత మనుషుల చేత
నిత్యం ప్రేమ చంపబడుతున్న దేశం ఇది

ప్రేమను చంపే హంతకులకు నిలయమైన దేశం

-  స్నేహితా నాస్తిక్, ప్రముఖ రచయిత . 

No comments:

Post a Comment