ప్రశ్న: మనం ప్లాస్టిక్ వస్తువుల్ని విపరీతంగా వాడుతున్నాం. ఎంతోకొంత పునర్వినియోగం చేస్తున్నా అవి పర్యావరణంలో కలిసిపోవడం వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది. మరి ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించడం ఎలా?
- అరవింద పబ్లిక్ స్కూల్ విద్యార్థులు, మంగళగిరి, గుంటూరు
కాలక్రమేణా ఇతర పదార్థాలతో తయారు చేయడానికి అవకాశమున్న వస్తువులను కూడా ప్లాస్టిక్‌తోనే తయారుచేయడంతో దీని వాడకం మితిమీరి పోయింది. దాని పరిమితుల్ని దాటింది. ప్లాస్టిక్ రసాయనికంగా చాలా స్థిరమైన బంధాలతో ఉంటుంది. దీని వల్ల సూక్ష్మజీవులు కూడా వాటిని ఏమీ చేయలేవు. అందుకే ప్లాస్టిక్‌లను నాన్‌బయో డిగ్రేడబుల్ అంటారు. థర్మో ప్లాస్టిక్‌లు, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్‌లని రెండు రకాలున్నాయి. ఇందులో థర్మో ప్లాస్టిక్‌లను పునర్వినియోగం చేయడం ద్వారా వాటి ప్రభావాన్ని అదుపులో ఉంచగల్గుతున్నాం. ప్లాస్టిక్‌ల వినియోగాన్ని పూర్తిగా నివారించలేకపోయినా వాటి వినియోగం మీద నియంత్రణ ఉండేలా ప్రపంచవ్యాప్తంగా చట్టాలు వస్తున్నాయి. వీటిని సక్రమంగా అమలు చేయడంతోపాటు రోడ్లు, భవనాల నిర్మాణంలో ఉపయోగించే కొన్ని ప్రక్రియలు నేడు ముందుకు వస్తున్నాయి. ఘన వ్యర్థ పదార్థాలైన ప్లాస్టిక్‌ల నుంచి ఇంధన శక్తిని రాబట్టే పద్ధతుల్ని అన్వేషిస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడమే అన్నింటికీ¨ మించిన ఉత్తమ నివారణ పద్ధతి.
- ప్రొ।। ఎ.రామచంద్రయ్య, నిట్, వరంగల్; ఎడిటర్, చెకుముకి, జనవిజ్ఞాన వేదిక.

No comments:
Post a Comment