ప్రజలకు కోవిడ్-19 సోకకుండా శక్తి పానీయాలు ( ఎనర్జీ డ్రింక్ ) పంపిణీ చేస్తూ సహాయక చర్యలు చేపట్టిన "మేము సైతం ఎడ్యుకేషనల్ రూరల్ డెవలప్మెంట్ యూత్ వెల్ఫేర్ సొసైటీ" సభ్యులు
బెల్లంపల్లి మండలం తాళ్ల గురజాల, లంబడి తండా గ్రామపంచాయతీ గ్రామీణ క్రీడాకారులకు శక్తి పానీయాలు ( ఎనర్జీ డ్రింక్ ) పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము సైతం ఎడ్యుకేషనల్ రూరల్ డెవలప్మెంట్ యూత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు పోరండ్ల రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రంగ ప్రశాంత్, స్పోర్ట్స్ కోచ్ వంగ రామన్న మాట్లాడుతూ చలికాలం దృష్టిలో పెట్టుకొని గ్రామపంచాయతీ ప్రజలు, యువత జాగ్రత్త వహించాలని సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించవలసిన బాధ్యత యువతరందే అన్నారు. యువత శారీరక, మానసిక ఉల్లాసం పొందాలంటే రోజు ఆటలు పాడాలని అన్నారు..త్వరలోనే "మేము సైతం ఎడ్యుకేషనల్ రూరల్ డెవలప్మెంట్ యూత్ వెల్ఫేర్ సొసైటీ" ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మెటీరియల్, టోర్నమెంట్ నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు రంగ శ్రీరామ్,రాము క్రీడాకారులు గాజుల వెంకటేష్, మెడి శేఖర్, N రాహుల్ తదితరులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment